Site icon NTV Telugu

Pradakshina: గుడికి వచ్చి ప్రదక్షిణలు ఎందుకు చేస్తారో తెలుసా..

Pradakshina

Pradakshina

Pradakshina: పుట్టిన రోజులకు, పెళ్లి రోజులకు, పండగలకు గుడికి వెళ్లి పూజలు చేయడం సాధారణంగా జరిగే విషయమే. కానీ అసలు మీలో ఎంత మందికి గుడికి వెళ్లి ప్రదక్షిణలు ఎందుకు చేస్తారో తెలుసు.. తెలియకపోతే ఈ స్టోరీలో తెలుసుకుందాం..

READ ALSO: US-Pakistan: దెబ్బ అదుర్సు కదూ..! పాకిస్థాన్‌ నా ఫేవరెట్ అంటూనే వెన్నుపోటు పొడిచిన ట్రంప్..

సాధారణంగా గుడికి వెళ్లిన భక్తులందరూ దేవుడిని దర్శించుకోడానికి ముందు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వాస్తవానికి ప్రదక్షిణము, పరిక్రమము అనే పదానికి అర్థం ఏమిటంటే తిరగడం. దేవాలయంలోని దేవుడిని దర్శించుకోడానికి ముందు ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేయడం హిందూ సంప్రదాయంలో అనాదిగా వస్తున్న ఆచారం.

కొందరు పండితుల అభిప్రాయం ప్రకారం.. మనకి కనిపించే ‘సృష్టికి ఆతిథ్యమిస్తున్న భూమి తనచుట్టూ తాను ప్రదక్షిణలు చేస్తూ వుంటుంది. భూమి ఇలా ప్రదక్షిణలు చేయటంవల్ల దానికి శక్తి వచ్చిందా, లేక శక్తిని నిలబెట్టుకోవటం కోసం ప్రదక్షిణలు చేస్తోందా అనేది పక్కన పెడితే, మొత్తం మీద ప్రదక్షిణలు చేయకుండా వున్న మరుక్షణం ఏదన్నా జరగవచ్చు. సృష్టి మొత్తం వినాశనం కావచ్చు. అలాగే సూర్యుని చుట్టూ భూమి ప్రదక్షిణం చేస్తోంది. ఫలితంగా జీవరాశి మనుగడకు సూర్యుని నుంచి శక్తి (సూర్యరశ్మి) ని పొందుతోంది.

ఆలయంలో ప్రతిష్టించిన దైవం విశ్వశక్తికి, కేంద్ర బిందువునకు ప్రతీక అని చెప్పారు. భగవంతుడి విగ్రహం చుట్టూ ఉన్న ఆలయం అనంత విశ్వానికి సంకేతంగా నమ్ముతారని వివరించారు. విశ్వంలో జరిగే పరిణామాలే ప్రదక్షిణలు అని, జీవితం అంటే ఒక చుట్టు (ఆవృతం), పుట్టిక నుంచి మరణం వరకు ఈ విశ్వంలో మన జీవితమే ఒక ప్రదక్షిణ అని వెల్లడించారు. ఇలా ఎన్నో జన్మల్లో సంపాదించుకున్న కర్మల ఫలితాన్నే ఈ జన్మలో అనుభవిస్తామని, ప్రదక్షిణ పేరుతో పరమాత్ముని చుట్టూ తిరగడం వలన జన్మల చుట్లలో చేసిన కర్మల దుష్ఫలితాలను తొలగించుకోగలం అని తెలిపారు.

ఇలా చుట్టూ తిరగడం ద్వారా మన జ్ఞానానికి అతీతమైన శక్తిని దేవుని నుంచి పొందుతామని, ఇలా మనస్సుకు, శరీరానికి కూడా మేలు చేస్తుందని పేర్కొన్నారు. తద్వారా మనిషికి ప్రశాంతత, జ్ఞానం పెరుగుతాయని పండితులు చెబుతున్నారు. ఆలయాల్లో చేసే ప్రదక్షిణల్లో చాలా రకాలున్నాయి. మామూలుగా ధ్వజస్తంభం నుంచి ప్రారంభించి తిరిగి చివరకు ధ్వజస్తంభం వద్దకు చేరుకుని దైవానికి నమస్కరించడం ఒక ప్రదక్షిణ క్రమం. చండీశ్వరుడున్న శివాలయంలో ప్రదక్షిణ విధానం మరొక పద్ధతిలో ఉంటుంది. దానికి చండీ ప్రదక్షిణం అని పేరు. ఇంట్లో పూజల సందర్భంలో ఆత్మ ప్రదక్షిణ చేయాలని, గుడులలో ఆత్మ ప్రదక్షిణ చేయరాదని పలువురు పండితులు తెలిపారు. అలాగే అత్యధిక ప్రదక్షిణలు చేయడం వల్ల రానున్న జన్మల కర్మలను కూడా అధిగమించవచ్చని, కర్మక్షయమే ప్రదక్షిణలో పరమార్థం అని, మన మనోవాక్కాయ కర్మలు పరమేశ్వరుని చుట్టూ పరిభ్రమించాలన్నదే ప్రదక్షిణ లోని ప్రధానోద్దేశ్యం అని వెల్లడించారు.

READ ALSO: Sankranti Winner 2026: బ్లాక్‌బస్టర్ ర్యాంపేజ్‌.. సంక్రాంతి విజేత ‘నారి నారి నడుమ మురారి’!

Exit mobile version