New Year 2026 Vastu Tips: కొత్త సంవత్సరానికి ముందు ఈ వస్తువులకు గుడ్‌బై చెప్పండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Year 2026 Vastu Tips: మరికొన్ని రోజుల్లో 2026 సంవత్సరం రాబోతుంది. ఈ కొత్త సంవత్సరంలో శ్రేయస్సు, సరికొత్త అవకాశాలు రావాలని అందరూ అనుకుంటారు. అయితే మీ ఇంట్లో చేసే చిన్న తప్పులు కూడా పెద్ద సమస్యలకు దారితీయవచ్చని అంటున్నారు జ్యోతిష్యులు. రాబోయే నూతన సంవత్సరానికి ముందు మీ ఇంటి నుంచి ఈ అనవసరమైన వస్తువులను తొలగించాలని వాస్తు శాస్త్రం సలహా ఇస్తున్నట్లు తెలిపారు. ఇంతకీ మీ ఇంట్లో అనవసరంగా ఉన్న ఆ వస్తువులు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నూతన సంవత్సరానికి ముందు మీ ఇంట్లో నుంచి తీసేయాల్సిన వస్తువులు ఇవే..
Also Read
- తెలంగాణ జలియన్‌వాలాబాగ్.. September 17 వేళ గూస్బంప్స్ తెప్పించే వీరుల చరిత్ర!
- Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
- Ayyappa Prasadam: శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం ఇంట్లోనే చేసుకోండిలా!
- Teachers Day Special: ద్రోణాచార్యుడి నుంచి వశిష్ఠుడి వరకు.. దేవతలు సైతం తలవంచిన 10 మంది మహా గురువులు వీరే!
పని చేయని గడియారం..
వాస్తు ప్రకారం.. విరిగిన లేదా పని చేయని గడియారాలను మీ ఇంట్లో నుంచి తీసేయాలని లేదా సెల్‌ను తిరిగి ఇన్స్టాల్ చేసి వాడుకోవాలని అన్నారు. అంతే కానీ ఆగిపోయిన గడియారాలను ఇంట్లో ఉంచకూడదని చెప్పారు. ఎందుకంటే ఈ పని చేయని గడియారం అనేది మీ జీవితంలో పురోగతికి ఆటంకం కలిగిస్తుందని, ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుందని విశ్వసిస్తున్నారు.
ఎండిపోయిన మొక్కలు
మీ ఇంట్లో ఎండిపోయిన, వాడిపోయిన మొక్కలను ఎప్పుడూ ఉంచవద్దని సూచించారు. ఎండిపోయిన, వాడిపోయిన మొక్కలు ఇంట్లోకి ప్రతికూలతను తెస్తాయని చెబుతున్నారు. ఇవి కుటుంబ ఆర్థిక పురోగతిని కూడా దెబ్బ తిస్తాయని, కాబట్టి నూతన సంవత్సరం ప్రారంభమయ్యే ముందు మీ ఇంట్లో ఎండిన, లేదంటే వాడిపోయిన మొక్కలను వెంటనే తొలగించాలని చెబుతున్నారు.
విరిగిన విగ్రహాలు
మీ ఇంట్లో విరిగిన విగ్రహాలను ఉంచుకో వద్దని చెబుతున్నారు. ఇవి మీకు కొత్త సమస్యలను కలిగిస్తాయని పేర్కొన్నారు. ఒక వేళ మీ ఇంట్లో విరిగిన విగ్రహాలు ఉంటే వెంటనే వాటిని గుడిలో లేదా రావి చెట్టు కింద ఉంచాలని సూచించారు. అలాగే వాటి స్థానంలో మీ ఇంటికి కొత్త విగ్రహాలను తీసుకురావాలని చెప్పారు.
పగిలిన గాజు
మీ ఇంట్లో పగిలిన గాజు సామగ్రిని లేదా అద్దాలను లేకుండా చూసుకోవాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. వాస్తు ప్రకారం.. పగిలిన గాజు మీ కుటుంబానికి సమస్యలను కలిగిస్తుందన్నారు. మీ ఇంట్లో పగిలిన గాజు ఉండటం వల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా తలెత్తుతాయని, అలాగే ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు.
చీపురు
చీపురును లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా మీ ఇంట్లో విరిగిన చీపురును ఉంచుకోవద్దన్నారు. విరిగిన చీపురు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఉండదని జ్యోతిష్యులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!