Site icon NTV Telugu

New Year 2026 Vastu Tips: కొత్త సంవత్సరానికి ముందు ఈ వస్తువులకు గుడ్‌బై చెప్పండి!

Vastu Tips

Vastu Tips

New Year 2026 Vastu Tips: మరికొన్ని రోజుల్లో 2026 సంవత్సరం రాబోతుంది. ఈ కొత్త సంవత్సరంలో శ్రేయస్సు, సరికొత్త అవకాశాలు రావాలని అందరూ అనుకుంటారు. అయితే మీ ఇంట్లో చేసే చిన్న తప్పులు కూడా పెద్ద సమస్యలకు దారితీయవచ్చని అంటున్నారు జ్యోతిష్యులు. రాబోయే నూతన సంవత్సరానికి ముందు మీ ఇంటి నుంచి ఈ అనవసరమైన వస్తువులను తొలగించాలని వాస్తు శాస్త్రం సలహా ఇస్తున్నట్లు తెలిపారు. ఇంతకీ మీ ఇంట్లో అనవసరంగా ఉన్న ఆ వస్తువులు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

నూతన సంవత్సరానికి ముందు మీ ఇంట్లో నుంచి తీసేయాల్సిన వస్తువులు ఇవే..

పని చేయని గడియారం..
వాస్తు ప్రకారం.. విరిగిన లేదా పని చేయని గడియారాలను మీ ఇంట్లో నుంచి తీసేయాలని లేదా సెల్‌ను తిరిగి ఇన్‌స్టాల్ చేసి వాడుకోవాలని అన్నారు. అంతే కానీ ఆగిపోయిన గడియారాలను ఇంట్లో ఉంచకూడదని చెప్పారు. ఎందుకంటే ఈ పని చేయని గడియారం అనేది మీ జీవితంలో పురోగతికి ఆటంకం కలిగిస్తుందని, ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుందని విశ్వసిస్తున్నారు.

ఎండిపోయిన మొక్కలు
మీ ఇంట్లో ఎండిపోయిన, వాడిపోయిన మొక్కలను ఎప్పుడూ ఉంచవద్దని సూచించారు. ఎండిపోయిన, వాడిపోయిన మొక్కలు ఇంట్లోకి ప్రతికూలతను తెస్తాయని చెబుతున్నారు. ఇవి కుటుంబ ఆర్థిక పురోగతిని కూడా దెబ్బ తిస్తాయని, కాబట్టి నూతన సంవత్సరం ప్రారంభమయ్యే ముందు మీ ఇంట్లో ఎండిన, లేదంటే వాడిపోయిన మొక్కలను వెంటనే తొలగించాలని చెబుతున్నారు.

విరిగిన విగ్రహాలు
మీ ఇంట్లో విరిగిన విగ్రహాలను ఉంచుకో వద్దని చెబుతున్నారు. ఇవి మీకు కొత్త సమస్యలను కలిగిస్తాయని పేర్కొన్నారు. ఒక వేళ మీ ఇంట్లో విరిగిన విగ్రహాలు ఉంటే వెంటనే వాటిని గుడిలో లేదా రావి చెట్టు కింద ఉంచాలని సూచించారు. అలాగే వాటి స్థానంలో మీ ఇంటికి కొత్త విగ్రహాలను తీసుకురావాలని చెప్పారు.

పగిలిన గాజు
మీ ఇంట్లో పగిలిన గాజు సామగ్రిని లేదా అద్దాలను లేకుండా చూసుకోవాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. వాస్తు ప్రకారం.. పగిలిన గాజు మీ కుటుంబానికి సమస్యలను కలిగిస్తుందన్నారు. మీ ఇంట్లో పగిలిన గాజు ఉండటం వల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా తలెత్తుతాయని, అలాగే ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు.

చీపురు
చీపురును లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా మీ ఇంట్లో విరిగిన చీపురును ఉంచుకోవద్దన్నారు. విరిగిన చీపురు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఉండదని జ్యోతిష్యులు పేర్కొన్నారు.

Exit mobile version