NTV Telugu Site icon

Payment with Credit Card: క్రెడిట్ కార్డ్‌తో పేమెంట్ చేస్తే 20 శాతం ఎక్కువ

Payment with Credit Card

Payment with Credit Card

Payment with Credit Card: విదేశీ యాత్రలకు వెళ్లేవాళ్లకి ముఖ్య గమనిక. టికెట్లు బుక్ చేసేటప్పుడు క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేస్తే 20 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. జులై ఒకటో తేదీ నుంచి ఈ రూలు అమల్లోకి వస్తుంది. ఇప్పటివరకు వసూలు చేస్తున్న.. ఈ ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్.. టీసీఎస్.. 5 శాతం మాత్రమే కావటం గమనించాల్సిన విషయం. అది ఇప్పుడు 20 శాతానికి పెరిగింది.

read more: Rice Shortage: ప్రపంచవ్యాప్తంగా బియ్యం కొరత. గడచిన 20 ఏళ్లలో ఎన్నడూ లేనంత..

ఏటీఎం కార్డు, అకౌంట్ ట్రాన్స్‌ఫర్ వంటి ఇతరత్రా చెల్లింపులకు ఇప్పటికే ఈ 20 శాతం టీసీఎస్‌ని అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. క్రెడిట్ కార్డుల ద్వారా చేసే ఈ విదేశీ చెల్లింపులను.. సరళీకృత చెల్లింపు పథకం.. ఎల్ఆర్ఎస్ పరిధిలోకి తేవాలని 2023 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
గతంలో కేంద్ర ప్రభుత్వానికి ఈ సూచన చేసింది.

దీంతో.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్‌లో పొందుపరిచారు. దీనివల్ల.. ఫారన్ ట్రిప్‌లకు వెళ్లేవాళ్ల పర్సనల్ బడ్జెట్ పెరుగుతుంది. ఉదాహరణకు.. క్రెడిట్ కార్డుతో 2 లక్షల రూపాయలు చెల్లిస్తే.. అదనంగా మరో 40 వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డ్ పేమెంట్లను ఎల్ఆర్ఎస్ పరిధిలోకి తీసుకురావటం వల్ల ముఖ్యంగా రెండు ప్రయోజనాలు ఉన్నాయి.

ఒకటి.. ఫారన్ ట్రిప్ టికెట్లను లోకల్ ఏజెంట్ ద్వారా బుక్ చేసినా.. ఓవర్సీస్ ఏజెంట్ ద్వారా బుక్ చేసినా ఒకే పన్ను విధానం అమలవుతుంది. రెండు.. విదేశీ చెల్లింపులను ట్రాక్ చేయటం, రిపోర్ట్ చేయటం ద్వారా ట్యాక్స్ పరిధిని పెంచొచ్చని విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే.. క్రెడిట్ కార్డ్ పేమెంట్లను ఎల్ఆర్ఎస్ పరిధిలోకి తీసుకురావటం అంత తేలిక కాదని కూడా వాళ్లు అభిప్రాయపడ్డారు.

ఎందుకంటే.. ఎడ్యుకేషన్ మరియు మెడికల్ పర్పస్ చేసే చెల్లింపులు ప్రస్తుతానికి ఎల్ఆర్ఎస్ పరిధిలోకి రావట్లేదు. కాబట్టి.. ఈ చెల్లింపుల్లో ఏవి టీసీఎస్ కిందికి వస్తాయో? ఏవి రావో? గుర్తించటం కొంచెం కష్టంతో కూడుకున్న పని. ప్రతి లావాదేవీనీ ఈ కోణంలో పరిశీలించటం బ్యాంకులకు సాధ్యం కాదని నిపుణులు తెలిపారు. ఒకే మర్చెంట్ వివిధ రకాల ట్రాన్సాక్షన్లు చేస్తుంటాడు.

అందులో కొన్ని టీసీఎస్ కిందికి వస్తాయి. కొన్ని రావు. ఇంటర్నేషనల్ మర్చెంట్స్ చాలా మంది ఉంటారు కాబట్టి పెద్ద సంఖ్య జరిగే ఆ లావాదేవీల వర్గీకరణ అంత సులవు కాదు. ఇది ఈజీ అవ్వాలంటే క్రెడిట్ కార్డ్ సిస్టమ్‌లోనే మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేస్తే అదనంగా చెల్లించాల్సి ఉంటుందనే విషయాన్ని కస్టమర్‌కి ముందే చెప్పాలని, వాళ్ల అంగీకారంతోనే పేమెంట్ చేయాలని అన్నారు.

టీసీఎస్ ఆటోమేటిగ్గా కట్ అవ్వాలంటే పాపప్ మెసేజ్ వచ్చే ఏర్పాటుచేయాలని తెలిపారు. దీనికితోడు.. ప్రస్తుతం ఒక
వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో రెండున్నర లక్షల డాలర్ల వరకు మాత్రమే విదేశీ చెల్లింపులు చేయటానికి వీలుంది. అందువల్ల.. క్రెడిట్ కార్డులతో చేసే పేమెంట్లు కూడా ఈ పరిమితిలోకి వస్తాయా రావా అనే క్లారిటీ లోపించింది. అయితే.. టీసీఎస్ అనేది ట్యాక్స్ కాదు.

ఇది.. ఒక ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లింపుదారుల మొత్తం ఆదాయపు పన్ను పరిమితిలో సర్దుబాటు చేస్తారు. వీలైతే రిఫండ్‌కి కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే.. దీనికి కావాల్సిన డాక్యుమెంట్లన్నీ ముందు నుంచే సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. ఇదంతా జరగాలంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.