Marry Now Pay Later: పెళ్లికి డబ్బు కావాలా? Marry Now-Pay Later అంటున్న సంస్థ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Marry Now Pay Later: పెళ్లి చేయాలంటే బోలెడు డబ్బు ఖర్చుపెట్టాలి. ఎందుకంటే.. మన దేశంలో చాలా మంది.. మ్యారేజ్‌ని ప్రెస్టేజ్‌గా భావిస్తారు. అందరూ గొప్పగా చెప్పుకోవాలని ఆశిస్తారు. అందుకే.. అప్పు చేసి మరీ పప్పన్నం పెట్టేందుకు వెనకాడరు. దీనికోసం కొందరు.. తెలిసినవారి దగ్గర డబ్బు తీసుకుంటారు. మరికొందరు.. బ్యాంకుల నుంచి లోన్లు పొందుతారు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు కొన్ని నవతరం ఫిన్‌టెక్ కంపెనీలు.. బై నౌ పే లేటర్.. మాదిరిగా.. మ్యారీ నౌ పే లేటర్.. అంటున్నాయి. జోరో ఇంట్రస్ట్‌కే ఆర్థిక సాయం చేస్తున్నాయి. తాజాగా.. సన్‌క్యాష్ అనే ట్రావెల్ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్.. ఈ సేవలను ప్రారంభించింది. దీంతో.. కొన్ని జంటలు, మధ్యతరగతి కుటుంబాలు.. ఈ కొత్త ఆప్షన్ వైపు ఆకర్షితులవుతున్నారు.
Also Read
- World's First Motorcycle: ప్రపంచంలో మొట్టమొదటి బైక్‌ను ఎవరు కనిపెట్టారు? షాకింగ్ హిస్టరీ ఇదే!
- 116 Year Old Woman: తిరుపతిలో నమ్మశక్యం కాని దృశ్యం.. 3550 మెట్లు ఎక్కిన 116 ఏళ్ల బామ్మ! వీడియో వైరల్..
- Siva Narayana Reddy: ప్రేమకు గుర్తుగా షాజహాన్ తాజ్ మహల్ కడితే.. ఏపీలో ఒక భర్త తన భార్య కోసం ఏం చేశాడో చూడండి!
- Success Story: అదృష్టం అంటే నీదే గురు.. రూ.4 లక్షల జీతం.. బోనస్‌గా థాయ్‌లాండ్ ట్రిప్! ఏం చేశాడో తెలుసా?
read more: AI Software New Version: AI సాఫ్ట్‌వేర్ కొత్త వెర్షన్. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఓపెన్ ఏఐ
సేవింగ్స్ మొత్తాన్నీ పెళ్లికే ఖర్చుపెట్టకుండా.. కొంతవరకు డబ్బు చేతిలో ఉంచుకుందామనుకునేవారు మ్యారీ నౌ పే లేటర్‌కి సై అంటున్నారు. సన్‌క్యాష్ అనే కంపెనీ ఇప్పటికే తన వినియోగదారుల ప్రయాణాల కోసం ట్రావెల్ నౌ పే లేటర్ సర్వీసును అందిస్తోంది. ఇండియాలో రోజురోజుకీ పెరుగుతున్న వెడ్డింగ్ మార్కెట్‌ని సొమ్ము చేసుకునేందుకు మ్యారీ నౌ పే లేటర్‌తో ముందుకొచ్చింది.
భారతదేశంలో వెడ్డింగ్ మార్కెట్ అనేది 4వ అతిపెద్ద ఇండస్ట్రీగా వెలుగొందుతోంది. ఈ పరిశ్రమ టర్నోవర్ దాదాపు 4 ట్రిలియన్ డాలర్లుగా నమోదవుతోంది. ఈ ఏడాది సుమారు 35 లక్షల జంటలు పెళ్లిచేసుకోబోతున్నాయి. ఈ గణాంకాలను దృష్టిలో పెట్టుకొని సన్‌క్యాష్ సంస్థ మ్యారీ నౌ పే లేటర్‌కి తెర లేపింది. దీనివల్ల.. ఒక వైపు.. లిక్విడ్ క్యాష్, మరో వైపు.. సేవింగ్స్.. రెండూ వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి.
ఫలితంగా.. పెళ్లి చేసుకున్న వెంటనే ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోవచ్చు. మ్యారీ నౌ పే లేటర్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకుంటే మొదటి ఆరు నెలల వరకు ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరంలేదు. కాబట్టి.. బ్యాంక్ లోన్లతో పోల్చుకుంటే.. ఇది.. బెస్ట్ అని చెప్పొచ్చు. అయితే.. ఈ రుణాన్ని ఏడాది కాలానికి తీసుకుంటే మాత్రం ఒక శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
మ్యారీ నౌ పే లేటర్ కింద గరిష్టంగా పాతిక లక్షల రూపాయలు ఇస్తారు. మ్యాగ్జిమం.. 12 నెలల లోపు తిరిగి చెల్లించాలి. కస్టమర్లకు.. రీపేమెంట్ చేసే సామర్థ్యం ఉందా లేదా అనేది చూసి లోను ఇస్తారు. ఈ మేరకు.. థర్డ్ పార్టీ డేటాను.. అంటే.. ఐడీ కార్డులు, అడ్రస్ ప్రూఫ్‌లు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు, పేస్లిప్‌లు, ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్‌లు తదితర డాక్యుమెంట్లను పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. సన్‌క్యాష్ సంస్థ ప్రారంభించిన ఈ సర్వీసుకు అద్భుతమైన స్పందన వచ్చింది.
జాతీయ రాజధాని ప్రాంతంలో వారం రోజుల్లోనే వంద మందికి పైగా కస్టమర్లు తమ పెళ్లికి డబ్బు కావాలని అడిగారు. వాళ్లు అడిగిన రుణాల విలువ ఏడు రోజుల్లోనే 8 కోట్ల రూపాయలకు చేరటం విశేషం. దీన్నిబట్టి.. మ్యారీ నౌ పే లేటర్ అనే ఫైనాన్షియల్ సర్వీస్‌కి ఎంత డిమాండ్ నెలకొందో అర్థంచేసుకోవచ్చు. అదీ.. మరి. మన దేశంలో.. పెళ్లంటే. మూడు ముళ్లు.. ఏడడుగులు.. మాత్రమే కాదు. ఆకాశమంత పందిరి.. భూదేవంత పీట అని అందరికీ తెలిసిందే కదా.
తాజావార్తలు
-
Fauji: ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్ చేసిన ప్రభాస్.. ‘ఫౌజీ’ ఫస్ట్ లుక్‌తో ఆల్‌టైమ్ రికార్డు!
-
Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
-
Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్‌ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
-
Reverse Gear Bikes: రివర్స్ గేర్ ఉన్న టూ వీలర్స్ ఇవే.. పార్కింగ్, ఇరుకైన రోడ్లలో డ్రైవింగ్ ఇక సులువు!
-
CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్‌తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?