Site icon NTV Telugu

Strange Police Complaint: ‘సర్ నా చిలుక ఎగిరిపోయింది’..!

Pet Parrot News

Pet Parrot News

Strange Police Complaint: పెంపుడు జీవులు అంటే ఇష్టం ఎవరికి ఉండదు చెప్పండి. కొందరికి కుక్కలు అంటే ఇష్టం ఉండవచ్చు, మరికొందరికి మరొక జీవి అంటే ప్రేమ ఉండవచ్చు. నిజానికి ఆ జంతువులు అంటే వాటి యజమానులకు వల్లమాలిన ప్రేమ ఉంటుంది. వాటిని తమ కుటుంబంలో భాగంగా చూసుకుంటారు. ఒకవేళ వాటికి ఏమైనా అయితే తట్టుకోవడం చాలా కష్టం. ఇలా పెంపుడు జంతువులను పెంచుకునే కుటుంబాల్లో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాటితో ప్రత్యేక అనుబంధాన్ని కలిగి ఉంటారు. అప్పుడప్పుడు వాటికి వచ్చే అనారోగ్యాలనే తట్టుకోలేని వారికి ఏకంగా వారి పెంపుడు జీవి కనిపించకపోతే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఈ స్టోరీలో కూడా అచ్చంగా అలాంటి ఒక సంఘటనే జరిగింది. ఇక్కడ కనిపించకుండా పోయింది ఏ కుక్కో, పిల్లో కాదు… ముద్దు ముద్దు పలుకులు పలికే చిలుక. అవును మీరు చదువుతున్న నిజమే. ఒక యజమాని అల్లారు ముద్దుగా పెంచుకున్న తన చిలుక కనిపించకుండా పోయిందని తాజాగా పోలీసులను ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది.

READ ALSO: KTR-Phone Tapping Case: విచారణలో నేను తప్ప ఏ రావు లేడు.. వేధింపులు తప్ప ఏమీ లేదు!

వివరాల్లోకి వెళ్తే.. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన దొరబాబు అనే వ్యక్తి ఒక చిలుకను మూడేళ్లుగా ఎంతో ప్రేమతో పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన చిలుక రెండు రోజుల క్రితం ఉన్నట్లుండి ఎగిరిపోయింది. హైదరాబాద్ నుంచి రూ.80 వేలకుపైగా ఖర్చుతో కొనుగోలు చేసిన తన చిలుక‌ కనిపించడం లేదంటూ తీవ్ర వేదనకు గురవుతున్నారు ఆయన. ఆ చిలుక ముద్దు ముద్దు పలుకులతో తమ ఇంట్లో సభ్యుడిలా కలిసిపోయిందని… కానీ రెండు రోజులుగా కనిపించడం లేదని వాపోయారు. తాజాగా ఆయన తన చిలుక పోయిందని స్థానిక పోలీసులను ఆశ్రయించారు. పక్కింటి వారు తమ చిలుకను బంధించారని ఆరోపిస్తూ, దానిని తిరిగి తనకు ఇప్పించాలంటూ అధికారులను వేడుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

READ ALSO: Sarfaraz Khan: టీమిండియా దిగ్గజాలకు సాధ్యం కాని రికార్డు ఇప్పుడు ఇతని సొంతం!

Exit mobile version