NTV Telugu Site icon

Indian Economy: మన ఆర్థిక వ్యవస్థ.. నిన్న.. నేడు.. రేపు

Indian Economy

Indian Economy

Indian Economy: అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఇండియన్‌ ఎకానమీ గతేడాది ప్రత్యేక గుర్తింపు పొందింది. అయితే.. ఆ ఆనందం మరెన్నాళ్లో ఉండేట్లు లేదు. వచ్చే ఏడాదిలోనే ఈ టైటిల్‌ని కోల్పోయే ఛాన్స్‌ కనిపిస్తున్నాయి. కొవిడ్‌ అనంతరం ఆర్థిక వ్యవస్థలో కాస్త సానుకూల వాతావరణం నెలకొన్నప్పటికీ ఈ ప్రయోజనాలను అధిక రుణ భారం మరియు పెరుగుతున్న ఖర్చులు క్షీణింపజేస్తున్నాయని ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ కంపెనీ గోల్డమన్‌ శాక్స్‌ పేర్కొంది. మరో వైపు.. ఇండియా జీడీపీ గ్రోత్‌ ఈ ఏడాది 7 పాయింట్‌ 2 శాతం నుంచి వచ్చే సంవత్సరం 4 పాయింట్‌ 7 శాతానికి పడిపోతుందని ఫైనాన్షియల్‌ కంపెనీ నోమురా అంచనా వేసింది.

ఈ మేరకు గోల్డ్‌మన్‌ శాక్స్‌ ఎకనమిస్టులు ఒక రిపోర్టును విడుదల చేశారు. ఇండియా స్థూల దేశీయోత్పత్తి ఈ సంవత్సరం 6 పాయింట్‌ 9 శాతానికి చేరుతుందని అంచనా వేయగా అది 2023 క్యాలెండర్‌ ఇయర్‌లో 5 పాయింట్‌ 9 శాతానికి తగ్గొచ్చని పేర్కొన్నారు. ఈ రెండు సంస్థలు ఇలాంటి ప్రతికూల నివేదికలు ఇవ్వటానికి దారితీసిన కారణాలను ముఖ్యంగా రెండు భాగాలుగా విశ్లేషించొచ్చు. కరోనా అనంతరం.. ఫస్ట్‌ హాఫ్‌లో.. ఎకానమీ గ్రోత్‌ చాలా మందకొడిగా సాగింది. ఆర్థిక వ్యవస్థ తిరిగి ప్రారంభమైనప్పటికీ ఆ ప్రయోజనాలు ఎక్కువ రోజులు కొనసాగలేదు. ద్రవ్యపరమైన ఒత్తిళ్లు పెరగటంతో దేశీయంగా గిరాకీ తగ్గింది.

read more: International Trade Prospects: టాప్‌-10 ఎకానమీల్లో ఇండియా.. ది బెస్ట్‌

కరోనా అనంతరం.. సెకండాఫ్‌లో.. అంతర్జాతీయంగా ఆర్థికాభివృద్ధి పుంజుకోవటంతో ఇండియా ఎకానమీ గ్రోత్‌ రికవర్‌ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రధాన రిటైల్‌ ద్రవ్యోల్బణం ఈ సంవత్సరం 6 పాయింట్‌ 8 శాతం ఉంటుందని అంచనా వేయగా వచ్చే ఏడాది 6 పాయింట్‌ 1 శాతానికి దిగొస్తుందని గోల్డమన్‌ శాక్స్‌ పేర్కొంది. గత పది నెలలుగా ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేసిన టోలరెన్స్ బ్యాండ్ 6 శాతం కంటే ఎక్కువగా ఉంది. రానున్న కొద్ది నెలల్లో ఆ మార్కును అధిగమించే అవకాశం కూడా ఉందని నిపుణుల అభిప్రాయపడుతున్నారు.

ఇన్‌ఫ్లేషన్‌ పెరుగుదలకి ముకుతాడు వేసేందుకు అన్ని దేశాల కేంద్ర బ్యాంకులు అగ్రెసివ్‌గా వడ్డీ రేట్లను పెంచటంతో ఆ ప్రభావం దాదాపు అన్ని ఆర్థిక వ్యవస్థల గ్రోత్‌ రేట్‌ పైన పడింది. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు సైతం ఈ ఎఫెక్ట్‌ నుంచి తప్పించుకోలేకపోయాయి. దీనికి ఇప్పుడు ప్రపంచ ఆర్థిక మాంద్యం రిస్కులు, భయాలు తోడయ్యాయి. ఫలితంగా.. అడ్వాన్స్‌డ్‌ ఎకానమీల జీడీపీలు కూడా దెబ్బతిన్నట్లు నిపుణులు పేర్కొన్నారు. మరో వైపు.. అక్టోబర్‌లో మన దేశ ఎగుమతుల పురోగతి అనూహ్యంగా పడిపోయింది.

ఎక్స్‌పోర్ట్‌ల గ్రోత్‌ సెప్టెంబరులోని 4 పాయింట్‌ 8 శాతం వృద్ధి నుంచి వార్షిక ప్రాతిపదికన 16 పాయింట్‌ 7 శాతానికి తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న డిమాండ్ క్షీణతను ఇది సూచిస్తోంది. కొవిడ్‌ అనంతరం మన దేశ ఎగుమతులు తగ్గటం ఇదే తొలిసారి. 2021వ సంవత్సరం ఫిబ్రవరిలో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. గ్లోబల్‌ డిమాండ్‌ సెంటిమెంట్‌తో పోల్చితే ఇండియన్‌ ఎకానమీ చాలా సెన్సిటివ్‌ అని వాణిజ్య గణాంకాలను బట్టి చెప్పొచ్చు. అందుకే జీడీపీ రేటు పడిపోవచ్చని రేటింగ్‌ సంస్థలు అంచనా వేస్తున్నాయి.

ఎక్స్‌పోర్టులు తగ్గటం వల్ల ఆ ప్రభావం ఇండియా ఎకానమీ గ్రోత్‌పైన కీలకంగా పడుతుందని అనుకుంటున్నట్లు ఫైనాన్షియల్‌ కంపెనీ నొమురా తెలిపింది. ప్రధాన దిగుమతుల వృద్ధిలో నెలల తరబడి స్థిరమైన మందగమనం నెలకొనటం మరియు బలహీన పారిశ్రామిక ఉత్పత్తి డేటా.. Q2లో దేశీయ వృద్ధి ఊపందుకున్నట్లు సూచిస్తున్నాయని పేర్కొంటున్నారు. గ్లోబల్‌ మార్కెట్‌ గ్రోత్‌ మరియు ఎక్స్‌పోర్ట్స్‌తో ఇండియా ఇన్వెస్ట్‌మెంట్‌ సైకిల్‌కి బలమైన అనుబంధం ఉంది. దీనివల్ల అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం భారతదేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిపైన బాగా పడుతోంది. ఈ నేపథ్యంలోనే జీడీపీ గ్రోత్‌.. అంచనాల కన్నా తక్కువగా నమోదయ్యే ఛాన్స్‌ ఉన్నాయి.