NTV Telugu Site icon

Indian Box Office Report: సినిమా హాల్స్‌ ఇక క్లోజ్‌ అనే డౌట్లు పటాపంచలు

Fz6mbxjaklu Hd

Fz6mbxjaklu Hd

Indian Box Office Report: 2022వ సంవత్సరంలో సినిమా థియేటర్లు దద్దరిల్లాయి. ప్రేక్షకులతో హౌజ్‌ఫుల్‌ అయ్యాయి. మూవీలు కలెక్షన్ల వర్షం కురిపించాయి. 2019వ సంవత్సరం తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన సంవత్సరంగా 2022 రికార్డులకెక్కింది. 2019లో మన దేశంలోని అన్ని భాషల చలన చిత్రాలు 10 వేల 637 కోట్ల రూపాయలను ఆర్జించాయి.

2019తో పోల్చితే 2022లో 300 కోట్లు మాత్రమే తక్కువ వచ్చాయి. తద్వారా ఇండియన్‌ బాక్స్‌ ఆఫీస్‌ చరిత్రలో ఎక్కువ కలెక్షన్లు వచ్చిన 2వ సంవత్సరంగా 2022 నిలిచిపోయింది. కరోనా నేపథ్యంలో ఇండియాలో సినిమా థియేటర్ల బిజినెస్‌ వరుసగా రెండేళ్లపాటు తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంది. 2020 మరియు 2021 సంవత్సరాల్లో సినిమా హాళ్లు పూర్తిస్థాయిలో తెరుచుకోలేదు.

Demand for Hotel Rooms: జర్నీలు పెరగనుండటంతో రూములకు గిరాకీ

కొవిడ్ వల్ల లాక్‌డౌన్లు అమలుచేయటంతో 2020లో థియేటర్ల ఆదాయం 85 శాతానికి పైగా పడిపోయింది. 2021లో 65 శాతం రెవెన్యూ డౌన్‌ అయింది. ఈ లోపు జనాలు ఎక్కువ శాతం ఓటీటీలకు అలవాటుపడ్డారు. దీంతో సినిమా థియేటర్ల మనుగడపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ అనుమానాలు 2022 జనవరిలో కూడా కొనసాగాయి. కరోనా థర్డ్‌ వేవ్‌ వల్ల దేశంలోని చాలా ప్రాంతాల్లో సినిమా హాళ్లు మూతపడ్డాయి. దీంతో గతేడాది శుభారంభం లభించలేదు.

ఫలితంగా 2022 జనవరిలో 168 కోట్ల రూపాయల వసూళ్లు మాత్రమే నమోదయ్యాయి. కానీ.. ఆ తర్వాత మాత్రం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కొవిడ్‌ తగ్గుముఖం పట్టడంతో థియేటర్లు క్రమంగా ఓపెనయ్యాయి. కలెక్షన్లు పుంజుకున్నాయి. జనవరిలో కూడా సినిమా హాళ్లు పూర్తి స్థాయిలో తెరుచుకొని ఉండి ఉంటే ఆ లెక్క వేరే ఉండేది. ఇండియన్‌ బాక్స్‌ ఆఫీస్‌ చరిత్రలో 2022వ సంవత్సరం అత్యధిక వసూళ్లతో అగ్రస్థానాన్ని ఆక్రమించేది.

ఇదిలాఉండగా.. పోయినేడాది.. హిందీ ఫిల్మ్‌ ఇండస్ట్రీ.. మహమ్మారి ముందు నాటి పరిస్థితులకు చేరుకోవటానికి శతవిధాలా ప్రయత్నించింది. కానీ.. సక్సెస్‌ కాలేకపోయింది. అయితే.. ఆ లోటును సౌతిండియా చిత్రాలు భర్తీ చేశాయి. ముఖ్యంగా.. తెలుగు, కన్నడ, తమిళ మూవీలు అంచనాలకు మించి విజయవంతమయ్యాయి. ఈ విషయాలను ఆర్మాక్స్‌ మీడియా మరియు గ్రూప్‌ ఎం అనే సంస్థలు కలిసి రూపొందించిన రిపోర్ట్‌ వెల్లడించింది.

ఈ రెండు సంస్థలు.. ‘‘ఇండియా ఈజ్‌ బ్యాక్‌.. ఎట్‌ ది థియేటర్స్‌’’.. అనే పేరుతో నివేదికను విడుదల చేశాయి. ఈ రిపోర్ట్‌ ప్రకారం.. 2019తో పోల్చితే 2022లో హిందీ బాక్స్‌ ఆఫీస్‌ తన వాటాను 44 శాతం నుంచి 33 శాతానికి కోల్పోయింది. ఈ 10 శాతం షేర్‌ను దక్షిణాది సినిమాలు సొమ్ము చేసుకున్నాయి. ప్రధానంగా తెలుగు చలన చిత్రాలు లాభపడ్డాయి. ఇండియన్‌ బాక్స్‌ ఆఫీస్‌ వద్ద టాలీవుడ్‌ మూవీస్‌ వాటా 13 శాతం నుంచి 20 శాతానికి పెరగటం విశేషం.

హిందీ బాక్స్‌ ఆఫీస్‌కి వచ్చిన ఆదాయంలో 32 శాతం సౌత్‌ నుంచి డబ్బింగ్‌ అయిన సినిమాల నుంచే రావటం గమనించాల్సిన విషయం. 2022 మొత్తమ్మీద కలెక్షన్లపరంగా కేజీఎఫ్‌ చాప్టర్‌-2, ట్రిపుల్‌ ఆర్‌ మరియు అవతార్‌ టాప్‌-3లో నిలిచాయి. హిందీ మూవీస్‌లో బ్రహ్మాస్త్ర టాప్‌ ఫిల్మ్‌ అనే ఫీట్‌ సాధించింది. ఇతర భాషలతో పోల్చితే.. అధిక టిక్కెట్ రేట్లపై ఆధారపడిన హిందీ చిత్రాల కన్నా ముందు.. తెలుగు మరియు తమిళ సినిమాలు 20 కోట్ల కలెక్షన్ మార్క్‌ను దాటాయి.

2019తో పోల్చితే 2022లోని 2వ అర్ధ భాగంలో ఇండియన్‌ సినిమాల్లో ప్రకటనలిచ్చిన బ్రాండ్ల సంఖ్య 18 శాతం పెరిగింది. ముఖ్యంగా ఫుడ్‌ అండ్‌ బేవరేజెస్‌ మరియు కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌ సంస్థల అడ్వర్టైజ్‌మెంట్‌లు టాప్‌-2 కేటగిరీలుగా నమోదయ్యాయి. ఇలా.. వివిధ కోణాల్లో పరిశీలిస్తే 2022వ సంవత్సరం ఇండియన్‌ బాక్స్‌ ఆఫీస్‌ వద్ద చెప్పుకోదగ్గ ఏడాదిగా గుర్తింపు పొందింది.