Team India Squad for West Indies Series: వెస్టిండీస్ పర్యటనకు సంబందించిన ఇండియన్ క్రికెట్ టెస్టు, వన్డే జట్లను ప్రకటించారు. ఈ ఫార్మాట్లలో రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. అజింక్య రహానె టెస్టుల్లో వైస్ కెప్టెన్‌గా, హార్దిక్ పాండ్యా వన్డేల్లో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. టెస్టు జట్టు నుంచి చెతేశ్వర్ పుజారాను తప్పించడం గమనార్హం. వచ్చే నెల నుంచి విండీస్ పర్యటనలో టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. రహానే రోహిత్‌కి టెస్టుల్లో వైస్ కెప్టెన్‌గా మారడంతో ఈ ఫార్మాట్‌లో టీమిండియా కెప్టెన్‌గా అవతరించేందుకు ఇప్పుడు అతనే అసలైన పోటీదారు అని తేలిపోయింది. అడా సమయంలో పుజారా ఫామ్ లేని కారణంగా జట్టు నుంచి తప్పుకున్నాడు.
ఫిబ్రవరి 2019 నుండి, పుజారా 35 టెస్ట్ ఇన్నింగ్స్‌లలో 29.98 యావరేజ్ తో 1769 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. ఇక వీరు కాకుండా, రితురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, ఫాస్ట్ బౌలర్ ముఖేష్ కుమార్ టెస్ట్ జట్టులోకి ప్రవేశించడం కూడా గమనించాల్సిన విషయం. కేఎస్ భరత్, ఇషాన్ కిషన్ ఈ టెస్టులో భారత్ వికెట్ కీపర్లుగా వ్యవహరించనున్నారు. మహ్మద్ షమీకి టెస్టు, వన్డే జట్ల నుంచి విశ్రాంతినిచ్చారు. అశ్విన్, జడేజా, అక్షర్‌లపై స్పిన్ బాధ్యత ఉంటుంది. అదే సమయంలో ఫాస్ట్ బౌలింగ్ బాధ్యత శార్దూల్, ముఖేష్, సిరాజ్, ఉనద్కత్, నవదీప్‌లపై ఉండనుంది.
ఇండియన్ టెస్టు సిరీస్ టీం
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రితురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ , అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ.
ఇండియన్ వన్డే సిరీస్ టీం
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రితురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్.
టీ20 జట్టును ప్రకటించలేదు
వెస్టిండీస్‌తో జరిగే మూడు టీ20ల సిరీస్‌కు బీసీసీఐ సెలక్టర్లు జట్టును ప్రకటించలేదు. దీంతో టీ20 జట్టులో భారీ మార్పులు చోటు చేసుకుంటాయని భావిస్తున్నారు. యశస్వి-రుతురాజ్, జితేష్ శర్మ, రింకు సింగ్ వంటి ఆటగాళ్లు జట్టులోకి రావచ్చని తెలుస్తోంది. టీ20 సిరీస్‌కు భారత జట్టును తర్వాత ప్రకటిస్తామని సెలక్టర్లు తెలిపారు.
T20 జట్టు నుంచి రోహిత్-కోహ్లీని తప్పిస్తారా?
చాలా కాలం తర్వాత ఐపీఎల్‌లోకి పునరాగమనం చేసిన మోహిత్ శర్మ కూడా టీమ్ ఇండియాలో చోటు దక్కించుకోవచ్చని భావిస్తున్నారు. ఐపీఎల్‌లో మోహిత్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అదే సమయంలో, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిని మరోసారి T20 జట్టు నుండి దూరంగా ఉంచవచ్చని అంచనాలు ఉన్నాయి. అయితే షమీతో పాటు సిరాజ్ కూడా పనిభారం, రాబోయే ODI ప్రపంచ కప్‌ను పరిగణనలోకి తీసుకుని T20 సిరీస్‌లో విశ్రాంతి తీసుకోవచ్చని అంటున్నారు.
భారత ఆటగాళ్లకు ఒక నెల విరామం
వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత భారత జట్టుకు దాదాపు నెల రోజుల విరామం లభించింది. జులై 12 నుంచి డొమినికా వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. రెండో టెస్టు జూలై 20 నుంచి ట్రినిడాడ్‌లో జరగనుంది. అదే సమయంలో జూలై 27 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. మొదటి, రెండో వన్డేలు (జూలై 29) బార్బడోస్‌లో జరగనుండగా, మూడో వన్డే ఆగస్టు 1న ట్రినిడాడ్‌లో జరగనుంది.
ఆగస్టు 3 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం
భారత్, వెస్టిండీస్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆగస్టు 3 నుంచి ప్రారంభం కానుంది. ట్రినిడాడ్‌లో తొలి టీ20, ఆగస్టు 6న గయానాలో రెండో టీ20, ఆగస్టు 8న గయానాలో మూడో టీ20, ఆగస్టు 12న ఫ్లోరిడాలో నాలుగో టీ20, ఆగస్టు 13న ఫ్లోరిడాలో ఐదో టీ20 జరగనుంది. అంటే అమెరికాలో కూడా రెండు టీ20 మ్యాచ్ లు చోటు చేసుకోనున్నాయి.
వెస్టిండీస్ పర్యటనలో టీం ఇండియా టెస్ట్ షెడ్యూల్
మొదటి టెస్ట్ మ్యాచ్ – జూలై 12 నుంచి 16 వరకు డొమినికా
రెండవ టెస్ట్ మ్యాచ్ – జూలై 20 నుంచి 24 వరకు, పోర్ట్ ఆఫ్ స్పెయిన్
వెస్టిండీస్ పర్యటనలో టీం ఇండియా వన్డే షెడ్యూల్
1వ ODI – 27 జూలై, బ్రిడ్జ్‌టౌన్
2వ ODI – 29 జూలై, బ్రిడ్జ్‌టౌన్
3వ ODI – 1 ఆగస్టు, పోర్ట్ ఆఫ్ స్పెయిన్
వెస్టిండీస్ పర్యటనలో టీం ఇండియా T20 షెడ్యూల్
1వ T20 – 3 ఆగస్టు, పోర్ట్ ఆఫ్ స్పెయిన్
2వ T20 – 6 ఆగస్టు, గయానా
3వ T20 – 8 ఆగస్టు, గయానా
4వ T20 – 12 ఆగస్టు, ఫ్లోరిడా
5వ T20 – 13 ఆగస్టు, ఫ్లోరిడా