NTV Telugu Site icon

Horseshoe Crab: ఓరి నాయనో.. పీత ధర 11 లక్షలా..!

Horseshoe Crab

Horseshoe Crab

Horseshoe Crab: పీతలు దీని ఈ పేరు వింటేనే చాలా మందికి నోరూరిపోతుంది. ఈ పీతలు అంటే ఇష్టపడని వాళ్లు చాలా తక్కువ మంది. వీటిలో పులుసు, రసం, ఇగురును చాలా మంది ఇష్టంగా తింటారు. ఇక పీతను తినాలని అనుకుంటే మాత్రం దాని ధర మహా అయితే 200 రూపాయల నుంచి 1000 రూపాయలు వరకు ఉంటుంది. పీతలు చాలా సహజంగా కూడా దొరుకుతుంటాయి. అయితే నేను చెప్పే పీత ధర వింటే దిమ్మదిరగాల్సిందే అదేంటి అనుకుంటున్నారా అవునండి బాబు దీని అక్షరాల 11 లక్షలు. వామ్మో ఏంటీ పీత దర 11 లక్షలా? ఇదేమైనా బంగారమా లక్షల్లో పెట్టి కొనడానికి అనుకుంటున్నారా? అలాగే అనుకోండి .. అన్ని లక్షల దరవున్న ఆపీత పేరు హార్స్ షూ అని పిలిచే పీత మాత్రం చాలా ఖరీదైనది. కానీ దీన్ని వండుకుని తినేందుకు ఉపయోగించరు. ఆపీతలోని ఉండే రక్తం కోసం వీటిని కొనుగోలు చేస్తుంటారు.

Read also: Fake Currency: నకిలీ కరెన్సీ అడ్డాగా పాతబస్తీ.. మహిళ సహా ముగ్గురు అరెస్ట్

మరీ ప్రశ్న మొదలైంది కదూ.. అదేంటి అందరూ మాంసం కోసం పీతలను కొనుగోలు చేస్తారు కానీ రక్తం కోసం ఏంటని అనుకుంటున్నారా? వీటి కంటే వీటి రక్తానికి ఎక్కువ డిమాండ్. అయితే.. దాదాపు లీటర్ హార్స్ షూ ధర 11 లక్షల ఉంటుంది మరి. పీతల రక్తానికి ఇంత ధరా అని ఆశ్చర్యపోకండి.. హార్స్ షూ పీతలు డైనోసర్ల కంటే కూడా పాత కాలం జీవి. ఇది.. భూమిపై దాదాపు 450 మిలియన్ల సంవత్సరాల నుంచి ఉంటున్నాయి. అంతేకాదండోయ్‌ ఈ పీతలు ఇండియన్, అట్లాంటిక్, పస్ ఫిక్ సముద్రాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. అదికూడా వసంత కాలం నుంచి మే, జూన్ వరకు అధిక ఆటుపోట్ల సమయంలో దర్శనం ఇస్తుంటాయి. అయితే.. ఈ పీతలు ఇప్పటి వరకు లక్షలాది మంది ప్రాణాలను కాపాడాయి.

Read also: RSS Rally: భైంసాలో ఆర్ఎస్ఎస్ ర్యాలీ.. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ

ఇక మనుషులకు ఇచ్చే టీకాలు, సూది మందులు, నరాల ద్వారా ఎక్కించే మందులు, శరీరంలోకి అమర్చే ఇంప్లాంటెడ్ పరికరాల తయారీ సమయంలో ఏదైనా కల్తీ జరిగిందా.. వాటిలో బ్యాక్టీరియా ఉందా అనేది ఈ పీతల రక్తం ద్వారా తెలుస్తుంది. అందువల్లే.. శాస్త్రవేత్తలు 1970ల నుండి ఈ జీవి రక్తాన్ని ఉపయోగిస్తున్నారు. ఇక ఈ పీతల రక్తం జీవ సంబంధమైన విషాలకు చాలా సున్నితంగా ఉండటమే కాకుండా.. బయోమెడికల్ ఉపయోగం కోసం ప్రతి సంవత్సరం సుమారు 50 మిలియన్ల హార్ష్ షూ పీతలను ఉపయోగిస్తున్నారు. కాగా.. దీని ఒక లీటర్ ధర రూ.11 లక్షల వరకు ఉంటుంది..ఈ పీతల రక్తం నిజానికి నీలి రంగులో ఉంటుంది. అయితే.. వీటి రక్తంలో ఒక ప్రత్యేక రసాయనం ఉండటమే కాకుండా.. ఇది బ్యాక్టీరియా చుట్టూ పేరుకుపోతుంది, వాటిని బంధిస్తుంది. కాబట్టే ఈ పీతకు ఇంత ధర.
BRS Party: బీఆర్ఎస్ లో ఎలా చేరాలి..? ఓ అభిమాని ట్విట్ కు కవిత రిప్లై

Show comments