Site icon NTV Telugu

Do Ghosts Really Exist: ఈ భూమి మీద నిజంగా దయ్యాలు ఉన్నాయా.. ?

Ghosts

Ghosts

Do Ghosts Really Exist: చాలా మందికి ఏదో ఒక సందర్భంలో వచ్చే ఒక సాధారణమైన అనుమానం.. ఈ భూమి మీద నిజంగానే దయ్యాలు, భూతాలు ఉన్నాయా.. అసలు మనిషి అనే వాడు చనిపోయిన తర్వాత అతని ఆత్మ దయ్యంగా మారుతుందా? ఒకవేళ ఆత్మగా మారిన ఆ మనిషి.. తనకు బతికి ఉన్నప్పుడు ఎవరి మీద అయిన కోపం, పగ ఉంటే వారి మీద కచ్చితంగా వాటిని తీర్చుకుంటాడా అనే ప్రశ్నలు వస్తుంటాయి.. ఈ స్టోరీలో దయ్యాల గురించి అసలు నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

READ ALSO: Trump: ‘‘ఆలస్యం చేయకుండా మాతో డీల్ కుదుర్చుకోండి’’.. మరో దేశానికి ట్రంప్ వార్నింగ్..

ఈ సందర్భంగా యునైటెడ్‌ కింగ్‌డమ్‌లోని మాంచెస్టర్‌ మెట్రోపాలిటన్‌ యూనివర్సిటీకి చెందిన సైకాలజిస్టు నీల్‌ డేగ్నల్‌ మాట్లాడుతూ.. దయ్యాలు ఉన్నాయని బలంగా నమ్మేవారు, వాటిని చూసే అవకాశం ఎక్కువగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే ఇలాంటి వారిలో మరికొన్ని లక్షణాలు కూడా ఉంటాయని చెప్పారు. “వాళ్లు ఏ విషయంలోనూ అస్పష్టతను, సందిగ్ధతను భరించలేరు. అసాధారణ సంఘటనలను, భావనలను విడిచిపెట్టరు. వాటికి పరిష్కారం కనుగొనాలనే ప్రయత్నిస్తారు. మిగతా వారితో పోలిస్తే ఊహల్లోనూ, సృజనాత్మకతలోనూ వాళ్లు ముందు ఉంటారు. మామూలు సంఘటనలు భయానకంగా మారడానికి అవి కారణమవుతాయి” అని ఆయన వివరించారు.

అలాగే పలువురు మానసిక నిపుణులు మాట్లాడుతూ.. ఒంటరితనం కూడా దయ్యాలు కనబడటానికి కొంత కారణమవుతుందని వివరించారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ నగరంలో లాక్‌డౌన్‌ సమయంలో ఈ రకమైన ఫిర్యాదులు అనేకం వచ్చాయని పలు నివేదికలు వెల్లడించాయి. అలాగే న్యూయార్క్‌లోనూ ఇలాంటి పరిస్థితితే కనిపించింది. ఇలా ఎందుకు జరిగిందనే మానసిక నిపుణులు వివరిస్తూ.. దీనికి విపత్తు వల్ల ఏర్పడిన ఒత్తిడి, ఒంటరితనమే కారణమని వెల్లడించారు. “మీరు నాలుగు గోడల మధ్య బందీగా ఉన్నప్పుడు, మనుషుల సహచర్యం కోరుకుంటున్నప్పుడు ఓ అతీంద్రియ శక్తి మీ వెంట ఉందనే ఆలోచన మీకు సాంత్వనను ఇస్తుంది. అది దైవమా, దయ్యమా అనేది మన ఆలోచనలకు అనుగుణంగా ఉంటుంది” అనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

READ ALSO: Virat Kohli: సెంచరీ మిస్ అయిన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన కింగ్ కోహ్లీ..

Exit mobile version