NTV Telugu Site icon

Be careful of ChatGPT: చాట్‌జీపీటీతో పర్సనల్‌ డేటాను షేర్‌ చేస్తే ఏమవుతుందో చూడండి

Be careful of ChatGPT

Be careful of ChatGPT

Be careful of ChatGPT: ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌తో పనిచేసే చాట్‌జీపీటీ.. అద్భుతాలు చేస్తోందంటూ వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. కానీ.. ఈ సరికొత్త సాంకేతికతలో కూడా కొన్ని లోటుపాట్లు బయటపడుతున్నాయి. అడిగిన సమాచారాన్ని లోపాలు లేకుండా ఇవ్వటంలో ఈ చాట్‌బాట్‌ తడబడుతున్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి.

ఇదొక లోపం కాగా.. ఈ కృత్రిమ మేధతో షేర్‌ చేసుకునే మన పర్సనల్‌ డేటాకు ప్రైవసీ లేకపోవటం మరో లోపం. ఏఐ ప్లాట్‌ఫామ్స్‌తో పంచుకునే మన వ్యక్తిగత సమాచారాన్ని అవి వ్యాపార నిమిత్తం సేకరించి పెట్టుకుంటున్నాయి. అవసరమైనప్పుడు థర్డ్‌ పార్టీలకు ఇవ్వనున్నాయి. చాట్‌జీపీటీ ప్రైవసీ పాలసీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది.

Royal Enfield New Record: వాడు నడిపే బండీ.. రాయల్‌ ఎన్‌ఫీల్డు. సేల్స్‌లో కొత్త రికార్డు

అందువల్ల.. చాట్‌జీపీటీ లాంటి వేదికలపై మన విలువైన వేటాను వెల్లడించొద్దని నిపుణులు సూచిస్తున్నారు. పేరు, ఫోన్‌ నంబర్‌, ఇ-మెయిల్‌ అడ్రస్‌, పేమెంట్లు తదితర ఇన్ఫర్మేషన్‌ని కృత్రిమ మేధ సర్వీసులతో పంచుకోవద్దని పేర్కొంటున్నారు. ఏఐ టూల్స్ వల్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందని, ఈ నేపథ్యంలో యూజర్లు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు.

కృత్రిమ మేధ ఆధారంగా రూపొందించిన వేదికల కారణంగా మన ప్రైవసీకి పలు మార్గాల్లో ప్రమాదం పొంచి ఉందని సైబరోప్స్ అనే ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ సంస్థ ఫౌండర్ అండ్ సీఈఓ ముకేష్‌ చౌదరి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు మూడు సమస్యల గురించి వివరించారు. అందులో ఒకటి.. యూజర్‌ ప్రొఫైలింగ్‌. అంటే.. ఏఐ ప్లాట్‌ఫామ్స్‌.. యూజర్‌ చాటింగ్‌ను బట్టి అతని బిహేవియర్‌ని విశ్లేషిస్తుంది.

తద్వారా తమకంటూ ప్రత్యేకమైన ప్రొఫైల్‌ని రూపొందిస్తుంది. తర్వాత.. కొన్ని సంస్థల ఉత్పత్తుల ప్రచారం కోసం మరియు ఇతర అవసరాల కోసం ఆ ప్రొఫైల్‌ని వాడుకుంటుంది. రెండో సమస్య.. డేటా షేరింగ్‌. ఇందులో భాగంగా రీసెర్చ్‌ కోసం మరియు అడ్వర్టైజింగ్‌ కోసం వినియోగదారుల వ్యక్తిగత సమచారాన్ని ఉపయోగించుకుంటుంది. వ్యాపార సంస్థలతో లేదా ఇతర కంపెనీలతో కలిసి ఆ డేటాను పరస్పరం పంచుకుంటుంది.

ఫలితంగా.. ఇరు వర్గాలూ ప్రయోజనం పొందుతాయి. ఇక.. మూడో సమస్య.. థర్డ్‌ పార్టీ యాక్సెస్‌. యూజర్‌ డేటాని ఔట్‌సైడ్‌ డెవలపర్లు తమ వ్యక్తిగత అవసరాల కోసం వాడుకునేందుకు ఏఐ సిస్టమ్స్‌ అనుమతించటాన్నే థర్డ్‌ పార్టీ యాక్సెస్‌ అంటారు. అంటే.. వ్యక్తిగత సమాచార గోప్యతను ఆయా సంస్థలు ఉల్లంఘిస్తాయన్నమాట. తద్వారా.. అనధికారిక వ్యక్తులు మన వివరాలను వాడుకుంటారు.

కృత్రిమ మేధ వేదికల భద్రతా విధానాల్లో లోటుపాట్లను దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. పాస్‌వర్డ్‌లను స్ట్రాంగ్‌గా రూపొందించకపోవటం మరియు యూజర్‌ డేటాను ఎన్‌స్క్రిప్ట్‌ చేయకపోవటం ద్వారా పరోక్షంగా సమాచార చౌర్యానికి దారితీస్తాయన్నమాట. చాట్‌జీపీటీ అనేది ఇంటర్నెట్‌లోని మూలమూలలకీ వెళ్లిపోయి ప్రతిదాన్నీ చదివేస్తుంది.

ఈ మేరకు మన నుంచి అనుమతి కూడా తీసుకోదు. అంతటితో ఆగకుండా.. అలా సేకరించిన సమాచారాన్ని ఇష్టమొచ్చినట్లు అమ్ముకుంటుందని వీ4వెబ్‌ సైబర్‌సెక్యూరిటీ అనే సైబర్‌క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్స్‌ అండ్‌ డిజిటల్‌ ఫోరెన్సిక్స్‌ సంస్థకు చెందిన రితేష్‌ భాటియా వెల్లడించారు. ఇదిలా ఉండగా.. మన దేశంలో ఇప్పటికీ కూడా.. వ్యక్తిగత సమాచార భద్రతకు సంబంధించిన ప్రత్యేక చట్టం లేకపోవటం గమనించాల్సిన విషయం.

కాకపోతే.. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టంలోని 43-ఏ అనే సెక్షన్‌ కింద మాత్రం ఒక క్లారిఫికేషన్‌ ఉంది. అదేంటంటే.. ఏదైనా సంస్థ తమ వినియోగదారుల సమాచార భద్రతకు సంబంధించి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ మేరకు కొన్ని చర్యలు చేపట్టాలి. కస్టమర్ల డేటాను పరిరక్షించటంలో విఫలమైతే బాధితుడికి నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది.

చాట్‌జీపీటీ.. ఈ సెక్షన్‌ కిందికి రాదు కాబట్టి అది బాధ్యత వహించదు. అదే సమయంలో.. యూజర్ల డేటాను పరిరక్షిస్తామని, అవసరమైన సమయంలో మాత్రమే థర్డ్‌ పార్టీతో షేర్‌ చేసుకుంటామని చెబుతోంది. కాబట్టి మన వ్యక్తిగత సమాచారం అనధికారిక వ్యక్తుల చేతుల్లోకి వెళ్లినప్పటికీ చాట్‌జీపీటీ చేసేది చట్టానికి వ్యతిరేకం కాదు. అందువల్ల మన ప్రైవసీకి మనదే బాధ్యతని మర్చిపోవద్దు.