NTV Telugu Site icon

Atal Bihari Vajpayee: “అటల్‌” మీకు “సలాం”..

Atal Bihari Vajpayee

Atal Bihari Vajpayee

Atal Bihari Vajpayee: ప్రసంగించడం ఓ కళ అయితే దానికి కేరాఫ్ అడ్రస్‌ ఆయన. సభ ఏదైనా చమత్కారం జోడించి శ్రోతలు చూపు తిప్పుకోలేనంత అందంగా మాట్లాడే వ్యక్తి. పోఖ్రాన్ అణుప్రయోగంతో దేశాన్ని పవర్ఫుల్ గా తీర్చిదిద్ది అగ్రరాజ్యానికి మనమేం తక్కువ కాదని నిరూపించిన నాయకుడు. ఆయనే బీజేపీ నేత, స్వాతంత్ర సమరయోధులు, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్. ఈరోజు ఆయన 98వ జయంతి.

డిసెంబరు 25, 1924 లో జన్మించిన అటలు కవిత్వం అంటే ఆసక్తి, క్విట్ ఇండియా మూమెంట్ లో పాల్గొని 23 రోజులు జైలులో ఉన్నారు. వాజ్ పేయీ, ఆయన తండ్రి క్లాస్మేట్స్. ఇద్దరూ కాన్పూర్ లోని డీఏవీ కాలేజీలో చదివారు. విదేశాంగ మంత్రి, ప్రధానిగా పని చేసిన అటల్ 4 రాష్ట్రాల్లోని 6 లోక్సభ స్థానాలకు ఎంపీగా పనిచేసిన ఏకైనా నేతగా నిలిచారు. ఆయన సేవలను గుర్తిస్తూ భారతరత్నతో సత్కరించిన కేంద్రం ఏటా ఈరోజుని ‘గుడ్ గవర్నెస్ డే’గా పరిగణిస్తోంది.

Read also: Tsunami in Indonesia: ప్రకృతి బీభత్సానికి 18 ఏళ్లు..

భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని విజయ శిఖరాలకు చేర్చడంలో వాజ్‌పేయి పాత్ర చాలా ముఖ్యమైనది. 1990వ దశకంలో, వాజ్ పేయి బీజేపీ ముఖ్యమైన వ్యక్తిగా మారారు. 1996లో కేంద్రంలో మొదటిసారిగా.. బీజేపీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. అప్పుడు అటల్ బిహారీ వాజ్‌పేయి కేవలం 13 రోజులు మాత్రమే ప్రధానమంత్రిగా పదవిలో ఉన్నారు. పార్లమెంటులో పూర్తి మెజారిటీ రాకపోవడంతో ఆయన ప్రభుత్వం పడిపోయింది. అయితే, 1998లో అటల్ మళ్లీ ప్రధానమంత్రి పదవికి ఎన్నికయ్యారు. అనంతరం 1999 నుంచి 2004 వరకు మూడోసారి భారత ప్రధాని, వాజ్ పేయి అనగానే 1998లో పోఖ్రాన్ అణుపరీక్ష, 1999 కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం ప్రతి భారతీయుడి మదికి గుర్తుకొస్తాయి.

ఆయన హయాంలోనే 2001 డిసెంబర్‌లో పార్లమెంటు భవనంపై దాడి జరిగింది. వాజ్ పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఢిల్లీ-లాహోర్ బస్సు సర్వీస్ ఫిబ్రవరి 1999లో ప్రారంభించబడి.. ఇది భారతదేశం, పాకిస్తాన్ మధ్య సంబంధాలలో ఒక చారిత్రాత్మక చర్య అంటూ ప్రశంసలు అందుకుంది. ఇక, వాజ్ పేయి 1957లో తొలిసారిగా ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్ నుంచి జనసంఘ్ టిక్కెట్‌పై గెలిచి లోక్‌సభకు చేరుకున్న అనంతరం అటల్ బిహారీ వాజ్‌పేయి వివిధ ప్రాంతాల గ్వాలియర్, న్యూఢిల్లీ, లక్నో నుంచి 10 సార్లు లోక్‌సభకు ఎన్నికై..ఎమర్జెన్సీ తర్వాత 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జనతా పార్టీ విజయం సాధించింది.

Read also:Tunisha Sharma: బాలీవుడ్‌లో విషాదం.. షూటింగ్ సెట్‌లోనే నటి ఆత్మహత్య..!

మొరార్జీ భాయ్ దేశాయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా అటల్ బిహారీ వాజ్ పేయి పనిచేసిన ఆయన ఆ సమయంలో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో హిందీ భాషలో ప్రసంగించిన మొదటి నాయకుడు వాజ్‌పేయి. అయితే..అప్పటి వరకూ ఈ ప్రపంచ వేదికపై ఎవరూ హిందీలో ప్రసంగం చేయలేదు. అటల్‌ ని భారత ప్రభుత్వం మార్చి 27, 2015న దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’తో సత్కరించింది. అటల్ బిహారీ వాజ్‌పేయి 1924 డిసెంబర్ 25న గ్వాలియర్‌లోని షిండే కా బడా ప్రాంతంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కృష్ణ బిహారీ వాజ్‌పేయి, కృష్ణ బాజ్‌పేయి. వాజ్‌ పేయి తండ్రి ఉపాధ్యాయుడు. ఆయనకు ముగ్గురు అన్నలు, ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. అటల్‌ బడాలో 8వ తరగతి వరకు చదివిన అటల్ గ్వాలియర్‌లోని విక్టోరియా కాలేజీ నుంచి డిగ్రీ పట్టాను పుచ్చుకున్నా అటల్‌.. కాన్పూర్‌లోని DAV కళాశాల నుండి రాజనీతి శాస్త్రంలో మాస్టర్ డిగ్రీ పట్టా తీసుకున్నారు. అటల్ బిహారీ అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స తీసుకుంటూ 16 ఆగస్టు 2018న వాజ్‌పేయి మృతిచెందారు.
Chalapati Rao Passed Away: కన్నుమూసిన.. టాలీవుడ్ బాబాయ్

Show comments