NTV Telugu Site icon

AI Software New Version: AI సాఫ్ట్‌వేర్‌ కొత్త వెర్షన్‌. రీసెంట్‌గా రిలీజ్‌ చేసిన ఓపెన్‌ ఏఐ

AI Software

AI Software

AI Software New Version: కృత్రిమ మేధతో పనిచేసే చాట్‌ జీపీటీ కొత్త వెర్షన్‌ అందుబాటులోకి వచ్చింది. అప్డేటెడ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ సాఫ్ట్‌వేర్‌ని ఓపెన్‌ ఏఐ సంస్థ ఇటీవల రిలీజ్‌ చేసింది. జీపీటీ-4గా పేర్కొనే ఈ ప్రొడక్ట్‌.. క్లిష్టమైన సమస్యలను కూడా.. గతంలో కన్నా ఎక్కువ ఖచ్చితత్వంతో పరిష్కరించగలదని పేర్కొంది. సమస్యల పరిష్కార సామర్థ్యాలు మరియు జనరల్‌ నాలెడ్జ్‌ దీనికి విస్తృతంగా ఉన్నాయని పేర్కొంది. శాన్‌ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేసే ఓపెన్‌ ఏఐ సంస్థ ఈ మేరకు ఒక వీడియోని షేర్‌ చేసింది.

read more: Indo-Russian mega meet: ఇండియా-రష్యా మెగా మీటింగ్‌

టెక్నాలజీకి సంబంధించి గతంలో లేని సరికొత్త కేపబిలిటీస్‌ని జీపీటీ-4లో పొందుపరిచారు. ఇంతకుముందు.. చాట్‌బాట్‌లో టెక్‌స్ట్‌ రూపంలో మాత్రమే ఇన్‌పుట్‌ ఇచ్చేందుకు వీలుంది. కానీ.. ఈ కొత్త వెర్షన్‌లో యూజర్లు ఇమేజ్‌లను సైతం అప్‌లోడ్‌ చేయొచ్చు. తద్వారా తమకు కావాల్సిన సమాచారాన్ని కోరొచ్చు. అంటే.. వినియోగదారులు ఇమేజ్‌లను అప్‌లోడ్‌ చేయటం వెనకున్న కారణాన్ని సైతం ఈ ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ ఒక మనిషి మాదిరిగా అర్థంచేసుకోగలదు.

ఇన్‌పుట్‌ని ఇమేజ్‌ల రూపంలో ఇచ్చినా.. టెక్‌స్ట్‌ రూపంలో ఇచ్చినా.. ఈ చాట్‌బాట్‌ మాత్రం తన సమాధానాన్ని కస్టమర్లకు టెక్‌స్ట్‌ రూపంలోనే ఇస్తుంది. వాస్తవానికి.. ఇది.. మనిషితో పోల్చితే తక్కువ సామర్థ్యమే కావొచ్చు. కానీ.. వివిధ ప్రొఫెషనల్‌ మరియు అకడమిక్‌ బెంచ్‌మార్క్‌లకు సంబంధించినంతవరకు.. ఈ కృత్రిమ మేధ.. మానవులతో సమానమైన పనితీరును కనబరుస్తుందని ఓపెన్‌ ఏఐ కంపెనీ తన వెబ్‌సైట్‌లో తెలిపింది. కొత్త ఫీచర్‌కి.. చూసే.. సామర్థ్యం కూడా ఉందని పేర్కొంది.

అయితే.. ఈ.. న్యూ టెక్నాలజీని ప్రస్తుతానికి వినియోగదారులకు ఉచితంగా అందించట్లేదు. చాట్‌ జీపీటీ ప్లస్‌ అనే సబ్‌స్క్రిప్షన్‌ సర్వీస్‌ ద్వారా వాడుకోవచ్చు. ఈ మేరకు యూజర్లు నెలకి 20 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. కాకపోతే.. ఈ అధునాతన సాంకేతికత.. జీపీటీ 3 పాయింట్‌ 5 వెర్షన్‌ కంటే చాలా మెరుగైన సేవలందిస్తుందని మాత్రం చెప్పొచ్చని ఓపెన్‌ ఏఐ కంపెనీ వెల్లడించింది. అమెరికాలోని ఒక లా-స్కూల్‌ గ్రాడ్యుయేట్లు ప్రొఫెషనల్‌ ప్రాక్టీస్‌కి ముందు పాల్గొన్న బార్‌ ఎగ్జామ్‌ని చాట్‌ జీపీటీ కూడా రాసిందని తెలిపింది.

ఈ పరీక్షలో చాట్‌జీపీటీ కొత్త వెర్షన్ టాప్-10 పర్సెంట్‌లో నిలవగా.. పాత వెర్షన్ మాత్రం.. బిలో-10 పర్సెంట్‌ ర్యాంక్‌ పొందిందని OpenAI వివరించింది. రెండు వెర్షన్లు కూడా చూడటానికి ఒకేలా కనిపిస్తాయి గానీ వాటి పనితీరు మాత్రం భిన్నంగా ఉంటుంది. జీపీటీ-4 చాట్‌బాట్‌.. విశ్వసనీయంగా, సృజనాత్మకంగా పనిచేస్తుంది. మరియు మరింత సూక్ష్మమైన సూచనలను కూడా పాటించగలదని ఈ ఉత్పత్తి తయారీ సంస్థ OpenAI పేర్కొంది.

Show comments