NTV Telugu Site icon

AI bot as CEO: మానవ చరిత్రలోనూ మొదటిసారి కావటం విశేషం

AI bot as CEO

AI bot as CEO

AI bot as CEO: విశ్వంలో విశేషం చోటుచేసుకుంది. మానవ చరిత్రలో మహాద్భుతం జరిగింది. దేవుడు చేసిన మనిషి స్థానాన్ని.. మనిషి చేసిన రోబో భర్తీ చేసింది. కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే ఏఐ చాట్‌బాట్‌ ఓ కంపెనీకి బాస్‌ అయింది. చైనాలోని హాంకాంగ్‌కు చెందిన ఆన్‌లైన్‌ గేమ్స్‌ డెవలపింగ్‌ సంస్థ నెట్‌డ్రాగన్‌ వెబ్‌సాఫ్ట్‌ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ కంపెనీ స్టాక్‌ మార్కెట్‌లో రికార్డు స్థాయిలో రాణించింది.

ప్రపంచంలోనే గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒక సంస్థ పగ్గాలను చేజిక్కించుకున్న ఈ చాట్‌బాట్‌ పేరు.. టాంగ్‌ యు. ఇటీవల ఎక్కువగా చాట్‌జీపీటీ గురించి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్‌ టెక్నాలజీ అప్‌డేట్‌గా అభివర్ణిస్తున్న చాట్‌జీపీటీ భవిష్యత్తులో ఎన్నో వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందని భావిస్తున్నారు. అయితే.. దానికన్నా చాలా ముందే ఏఐ చాట్‌బాట్‌ సీఈఓ కావటం చెప్పుకోదగ్గ విషయం.

read more: Salary Hike Time: వేతనాలు పెరిగే వేళాయెరా. అయితే.. ఈ టైంలో సంస్థలు ఏం ఆలోచిస్తాయంటే?

నెట్‌డ్రాగన్‌ వెబ్‌సాఫ్ట్‌ సంస్థ మల్టీప్లేయర్‌ ఇంటర్నెట్‌ గేమ్స్‌లో భాగంగా మొబైల్‌ అప్లికేషన్లను రూపొందిస్తుంది. ఈ కంపెనీ చైర్మన్‌.. డెజియన్ లియు. కార్పొరేట్‌ మేనేజ్‌మెంట్‌లో ఫ్యూచర్‌ అంతా ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌దేనని చెప్పారు. భవిష్యత్తులో తమ బిజినెస్‌ మొత్తం ఏఐ సాయంతోనే జరుగుతుందని తెలిపారు. ఈ లక్ష్యాన్ని చేరుకునే దిశగానే టాంగ్‌ యుని కంపెనీ హెడ్‌గా నియమించామని వివరించారు.

ఓపెన్‌, ఇంటరాక్టివ్‌ అండ్‌ ట్రాన్స్‌పరెంట్‌ మేనేజ్‌మెంట్‌ మోడల్‌ని నిర్మిస్తామని, ఈ మేరకు సీఈఓ టాంగ్‌ యుకి కావాల్సిన ఆల్గారిథమ్స్‌ని పెంచుతూనే ఉంటామని చైర్మన్‌ డెజియన్ లియు వెల్లడించారు. రానున్న రోజుల్లో మెటావర్స్‌ బేస్డ్‌ వర్కింగ్‌ కమ్యూనిటీని డెవలప్‌ చేస్తామని స్పష్టం చేశారు. ఈవిధంగా గ్లోబల్‌ మార్కెట్‌లోని ట్యాలెంట్‌లను ఆకర్షించటం ద్వారా మరింత పెద్ద టార్గెట్లను రీచ్‌ అవుతామని ఆశాభావం వ్యక్తం చేశారు.

వరల్డ్‌లోనే ఫస్ట్‌ టైమ్‌ ఒక కంపెనీకి హెడ్‌గా నియమితులైన ఈ హ్యూమనాయిడ్‌ రోబో.. ఆడ మనిషిని పోలి ఉంటుంది. అందుకే.. మిస్‌ టాంగ్‌ యు అని పేర్కొంటున్నారు. ఈ లేడీ లీడర్‌కి.. అప్పుడే.. కీలక బాధ్యతలు అప్పగించారు. ఉన్నత స్థాయి విశ్లేషణలను సమీక్షించటం, నాయకత్వ స్థాయిలో నిర్ణయాలు తీసుకోవటం, ప్రమాదాలను ముందే పసిగట్టడం, పని ప్రదేశాన్ని సమర్థవంతంగా తీర్చిదిద్దటం ఈమె చేయాల్సినవాటిలో కొన్ని.

24 బై 7 పనిచేసే సంస్థను ముందుండి నడుపుతూ.. ఒక్క రూపాయి కూడా శాలరీ తీసుకోని వన్‌ అండ్‌ ఓన్లీ ఎంప్లాయీ.. మిస్‌ టాంగ్‌ యునే కావటం గమనించాల్సిన అంశం. ఈమె.. ఈ కంపెనీలోని వివిధ ప్రక్రియలను సక్రమంగా పట్టాలెక్కించనున్నారు. క్వాలిటీ ఆఫ్‌ వర్క్‌ టాస్క్‌లను పెంపొందించటం ద్వారా సంస్థ కార్యకలాపాలను వేగవంతం చేస్తారు. రోజువారీ వ్యవహారాలను చక్కదిద్దటంతోపాటు సరైన నిర్ణయాలు తీసుకోవటానికి కావాల్సిన రియల్‌ టైమ్‌ డేటా హబ్‌గా వ్యవహరిస్తారు.

ఏఐ చాట్‌బాట్‌ మిస్‌ టాంగ్‌ యుని అధిపతిగా నియమించటం నెట్‌డ్రాగన్‌ వెబ్‌సాఫ్ట్‌ సంస్థకు తక్షణ ఫలితాన్ని ఇచ్చింది. ఈ కంపెనీ షేర్‌ విలువ ఒక్కసారిగా 10 శాతం పెరిగింది. గడచిన 6 నెలలతో పోల్చితే ఇప్పుడు హాంకాంగ్‌ స్టాక్‌ మార్కెట్‌ ఇండెక్స్‌లో అనూహ్యమైన పనితీరును కనబరిచింది. దీనికి ఇతరత్రా కారణాలు ఉన్నప్పటికీ తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం శుభసూచికగా నిలిచినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

Show comments