The Red Bag Review: ది రెడ్ బ్యాగ్ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.5 / 5
- MAIN CAST: రాధ్య, మోనిక, స్నేహ సింగ్, ఆకాంక్ష, కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాశి, గాయత్రి భార్గవి తదితరులు
- DIRECTOR: రవి కుమార్ సీరపు
- MUSIC: శేకర్ మోపురి
- PRODUCER: హరికృష్ణ సోమిశెట్టి
టాలీవుడ్లో క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌కు ఉమెన్ సెంట్రిక్ ఎమోషనల్ పాయింట్‌ను జతచేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన తాజా చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. టీజర్లు, ట్రైలర్లతో ఆసక్తిని రేకెత్తించిన ఈ ప్రాజెక్ట్, మెమరీ మేకర్స్ బ్యానర్‌పై హరికృష్ణ సోమిశెట్టి నిర్మాణంలో, దర్శకుడు రవి కుమార్ సీరపు రూపొందించగా నేడు (ఆగస్ట్ 21) థియేటర్లలో విడుదలైంది.ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది రివ్యూలో చూద్దాం.
ది రెడ్ బ్యాగ్ కథ
విన్నీ (రాధ్య) విదేశంలో మైక్ (కబీర్ సింగ్) నడిపే ఒక వ్యభిచార గృహంలో పని చేస్తుంటుంది. అదే సమయంలో ఈషా, బేబ్, ఈవ్ అనే ముగ్గురు యువతులు మూడు నెలల ఒప్పందంతో డబ్బుల కోసం అక్కడికి వస్తారు. అయితే గడువు ముగిసిన తర్వాత పాస్‌పోర్టులు, డబ్బులు ఇవ్వమని కోరగా.. మైక్ వారి కాంట్రాక్ట్ పత్రాలు చింపేసి పాస్‌పోర్టులు లాక్కుని హింసిస్తాడు. దీంతో ఆ ముగ్గురిలో ఒకరు ఆత్మహత్యకు యత్నించగా, విన్నీ వారిని కాపాడి సమస్యలను తెలుసుకుంటుంది. ఆ ముగ్గురు అమ్మాయిలు అసలు ఎందుకు ఆ ఊబిలోకి వచ్చారు? విన్నీ ఫ్లాష్‌బ్యాక్ ఏంటి? మైక్ కబంధ హస్తాల నుంచి వీరంతా ఒక రెడ్ బ్యాగ్‌తో ఎలా తప్పించుకున్నారు? చివరకు భారతదేశానికి క్షేమంగా చేరుకున్నారా లేదా? అనేదే మిగిలిన కథ.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
విశ్లేషణ**
ఒక సున్నితమైన సామాజిక అంశానికి క్రైమ్ ఛేజింగ్ డ్రామాను ముడిపెట్టి కథను సిద్ధం చేసుకున్న దర్శకుడు, దానిని ఆకర్షణీయంగా తెరకెక్కించడంలో మాత్రం తడబడ్డాడు. ప్రారంభ సన్నివేశాల్లో ఏఐ (AI) విజువల్స్, అనవసరపు సంభాషణలతో కథ నెమ్మదిగా సాగుతుంది. మొదటి భాగంలో వేశ్యాగృహ పరిసరాలు, పబ్ సెటప్‌తో సన్నివేశాలు కాస్త సాగదీసిన భావన కలిగిస్తాయి. అయితే ఆ ముగ్గురు అమ్మాయిలు వ్యభిచార వృత్తిని ఎంచుకోవడానికి వెనుక ఉన్న ఒక కారణం రివీల్ అయినప్పుడు సినిమాపై కాస్త సానుకూల దృక్పథం ఏర్పడుతుంది.
సెకండ్ హాఫ్‌లో అమ్మాయిలు రెడ్ బ్యాగ్‌తో తప్పించుకోవడం, వారి వెనుక విలన్ గ్యాంగ్ పడటం వంటి రెగ్యులర్ ఛేజింగ్ సీన్లతో నడిపించారు. టైటిల్లో ఉన్న ‘రెడ్ బ్యాగ్’ ప్రాధాన్యత కేవలం విలన్ వస్తువుగా పరిమితమై రొటీన్ ట్రాక్‌లోకి వెళ్లిపోయింది. గ్రీన్ మ్యాట్ విజువల్స్, పేలవమైన కార్ డ్రైవింగ్ సన్నివేశాలు విజువల్ అనుభూతిని దెబ్బతీశాయి. విదేశాల నేపథ్యం అన్నప్పటికీ చాలావరకు లోకల్ సెటప్‌లోనే సినిమాను నడిపించినట్లు స్పష్టంగా తెలుస్తుంది. అయితే మహిళలు ఇలాంటి ఊబిలో పడటానికి గల పరిస్థితులు, వారి పట్ల సమాజ వైఖరిని ప్రశ్నించే మెసేజ్ కథకు కొంత బలాన్నిచ్చింది.
నటీనటుల పనితీరు విషయానికి వస్తే రాధ్య విన్నీ పాత్రలో లీడ్ రోల్‌ను డీసెంట్‌గా పోషించి తన పరిధి మేరకు మెప్పించింది. మోనిక, స్నేహ సింగ్, ఆకాంక్ష గ్లామర్‌తో పాటు నటనలోనూ అక్కడక్కడా ఆకట్టుకున్నారు. కబీర్ సింగ్ ప్రతినాయకుడిగా మైక్ పాత్రలో తనదైన రఫ్‌నెస్ చూపించాడు. ప్రసాద్ బెహరా సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని కామెడీ బిట్స్‌తో ప్రేక్షకులకు కాస్త ఉపశమనం అందించాడు. రాశి & గాయత్రి భార్గవి గెస్ట్ రోల్స్‌తో కథాగమనానికి సహకరించారు.
సాంకేతిక విభాగం విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ విజువల్స్ కొన్ని సన్నివేశాల్లో రిచ్‌గా ఉన్నాయి. అయితే నేపథ్య సంగీతం సన్నివేశాల గాఢతను పెంచలేకపోయింది; కానీ రెండు మెలోడీ ట్రాక్స్ బాగున్నాయి. ఎడిటింగ్ విభాగం చాలా సాగదీత సన్నివేశాలకు కత్తెర వేయాల్సింది. గ్రాఫిక్స్ విషయంలో మరింత శ్రద్ధ వహించాల్సింది. నిర్మాణ విలువల పరంగా నిర్మాత పెట్టిన ఖర్చు స్క్రీన్‌పై కనిపిస్తుంది.
చివరిగా ‘ది రెడ్ బ్యాగ్’ కాన్సెప్ట్ డీసెంట్, బట్ దారితప్పిన క్రైమ్ ఛేజింగ్!
తాజావార్తలు
-
Harish Rao: రైతులకు ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే కుట్ర..? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
-
Explainer: విదేశీ పేదోళ్ల ముందు.. మన ధనికులు కూడా వేస్ట్!
-
Vaibhav Sooryavanshi: “ఇది నిరంకుశత్వం”.. గంభీర్‌పై వైభవ్ సూర్యవంశీ కోచ్ ఫైర్..
ట్రెండింగ్
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!