NTV Telugu Site icon

leo movie review: లియో మూవీ రివ్యూ

Leo Movie Review

Leo Movie Review

నటీనటులు : విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ వాసుదేవ్ మీనన్,, ప్రియా ఆనంద్, మడోన్నా సెబాస్టియన్ తదితరులు
సంగీతం : అనిరుధ్ రవిచందర్
నిర్మాతలు : ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళనిసామి
దర్శకత్వం : లోకేష్ కనగరాజ్
విడుదల తేదీ: అక్టోబర్ 19, 2023

ఖైదీ, విక్రమ్ లాంటి సినిమాలు చేసి లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ నిర్మించి మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. అలాంటి ఆయన విజయ్ తో సినిమా చేస్తున్నాడు అని అనౌన్స్ మెంట్ వచ్చినప్పటి నుంచి సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడూ ఈ సినిమా కూడా లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమే అని ప్రచారం జరగడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. ఇక రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో మెరిశాడు అనే ప్రచారం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా మీద ఆసక్తి పెంచింది. ఇక దానికి తోడు సంజయ్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్, త్రిష వంటి వారు నటించారని తెలియడంతో ఈ సినిమా కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

లియో కథ ఏంటి?
పార్తీబన్(తలపతి విజయ్) హిమాచల్ ప్రదేశ్ లో ఓ చిన్న పట్టణంలో భార్య సత్య (త్రిష), ఒక కుమార్తె కుమారుడితో కలిసి సంతోషంగా జీవిస్తూ ఉంటాడు. కాఫీ షాప్ నడుపుతూనే యానిమాల్ యాక్తివిస్ట్ గా ఉంటూ ఒక సారి ఊరి ప్రజల నుంచి హైనాను, హైనా నుంచి ఊరి ప్రజలను కాపాడతాడు. ఆ తర్వాత ఒక గాంగ్ నుంచి కుమార్తెను కాపాడుకునే క్రమంలో వారిని తలలో కాల్చి చంపుతాడు. ఆయనకి శిక్ష వేయకుండా విడుదల చేసిన విషయం మీడియాలో హైలైట్ కావడంతో పార్తీబన్ ఫోటోలు పేపర్లలో వస్తాయి..దీంతో అతడిని వెతుకుతూ తెలంగాణలోని ఆంటోనీ దాస్ (సంజయ్ దత్) అతని తమ్ముడు హరోల్డ్ దాస్(అర్జున్ సర్జా) & గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్ వస్తారు. అక్కడ లియో దాస్ (విజయ్)ను వెనక్కి తీసుకు వెళ్లడానికి వచ్చామని ఇన్నాళ్లు మరణించాడని అనుకున్నానని, అయితే పార్తీబన్ పేరుతో హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్నాడని చెబుతారు. దీంతో అసలు లియో ఎవరో తెలుసుకునే పనిలో పడతారు పర్థిబాన్ అండ్ ఫ్యామిలీ. అసలు లియో ఎవరు? పార్ధీపన్ కు లియోకు ఉన్న సంబంధం ఏమిటి? లియో అనకుని పార్ధీపన్ వెనక దాస్ అండ్ కో ఎందుకు పడుతోంది? నిజంగానే లియో పార్ధీపన్ ఒకరేనా? అసలు నిజం ఏమిటి..చివరకు ఏమైంది? లోకేష్ ఖైదీ, విక్రమ్ సినిమాలకు ఈ సినిమాకి లింక్ ఎంటి అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

అసలు ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో ఉంటుందా? లేదా? అనే విషయం ఎక్కడా లీక్ కాకుండా సినిమా మీద ఆసక్తి పెంచారు. అయితే ఖైదీలో నెపోలియన్, విక్రమ్ లో వేశ్య పాత్రలు ఈ సినిమాలో కూడా కనిపించాయి. క్లైమాక్స్ లో ‘విక్రమ్’ కమల్ హాసన్ నుంచి ‘లియో’కి ఫోన్ రావడంతో ఈ సినిమా LCUలో భాగమే. అయితే సినిమా విషయానికి వస్తే ఈ సినిమా కథ కొత్తది ఏమీ కాదు, కానీ సాధారణ కథను కూడా స్టైలిష్ హా5 తెరకెక్కించడంతో పాటు రేసీ స్క్రీన్ ప్లేతో సినిమాలో లీనం అయ్యేలా చేయడంలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఆరితేరి పోయాడు. ‘లియో’ కూడా ఆయన శైలిలోనే ఉంది కానీ అది సినిమా మొత్తం ఉన్నట్టు అనిపించలేదు. లోకేష్ సినిమాలు అంటేనే ఫుల్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్లు అనిపిస్తాయి కానీ ‘లియో’ని ఒక ఎమోషనల్ కంటెంట్ ఉన్న సినిమాగా తెరకెక్కించారు. లోకేష్ సినిమాల్లో ఉండే యాక్షన్ డోస్ తక్కువ అనిపించినా సినిమా కథనంతో ఇంట్రెస్ట్ పెంచేశాడు డైరెక్టర్. ఇంటర్వెల్ ముందు వరకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు కానీ ఒక్కొక్క పాత్ర ఎంట్రీ ఇస్తున్న కొద్దీ సినిమా మీద ఇంట్రెస్ట్ పెరిగేలా రాసుకున్నాడు. ముందు వచ్చే హైనా సీన్ , కాఫీ షాప్ ఫైట్, కార్ చేజింగ్ ఫైట్ సీన్ ప్రేక్షకులకు భలే థ్రిల్ ఇస్తాయి. ఇంటర్వెల్ తర్వాత అసలు కథ మొదలై పార్తీబన్, లియో ఇద్దరూ ఒక్కరూ వేర్వేరు వ్యక్తులా అనే విషయం మీదనే సాగడంతో కాస్త సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది కానీ చివరికి క్లైమాక్స్ కూడా సాగదీత అనిపిస్తుంది. అయితే ఫస్టాఫ్ ఉన్నట్టే సెకండ్ హాఫ్ ను కూడా నడిపి ఉంటే సినిమా స్దాయి ఉంటే నెక్ట్స్ లెవల్ అనిపించేది. అంతా బాగానే ఉన్నా సంజయ్ దత్, అర్జున్ సర్జా వంటి వారు ఉన్నపుడు ఫ్లాష్ బ్యాక్ ను ఇంకా బలంగా రాసుకుని ఉంటే సినిమా వేరే లెవల్ అనిపించేది..

ఇక ఎవరెలా చేశారు అనే వివరాల్లోకి వెళితే ముందుకు నటీనటుల విషయానికి వద్దాం.విజయ్ నటన గురించి చెప్పేది ఏముంది ? ఎప్పటిలాగే చెలరేగిపోయాడు కానీ కొన్ని సీన్స్ లో అయితే కొన్ని సీన్స్ లో విజయ్ కొత్తగా కనిపిస్తాడు. ఇక అంటోని దాస్ గా జంజయ్ దత్ , హెరాల్డ్ దాస్ అర్జున్ ఇద్దరూ రాక్షసులు లాంటి వారిగా లుక్స్ పరంగా అరిపించారు. త్రిష కూడా తన పాత్రకు న్యాయం చేసింది. పార్దీబన్ కొడుకు సిద్దార్ద్ గా మలయాళ మేధ్యూ ధామస్ అదరగొట్టాడు. గౌతమ్ మీనన్, ప్రియా ఆనంద్, మడోన్నా సెబాస్టియన్ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు. ఖైదీ ఫేమ్ నెపోలియన్ జార్జ్ మర్యన్ అదే కానిస్టేబుల్ పాత్రతో అదరకొట్టాడు. టెక్నికల్ అంశాల విషయానికి వస్తే… మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తరువాత ప్రధాన అసెట్. ఫైట్ సీన్లు, క్లైమాక్స్ ఫైట్ సీన్ లో కెమెరా మూమెంట్స్ కెమెరా పనితనం ఏంటో చూపించాయి. అనిరుధ్ రవిచందర్ నేపథ్య సంగీతం సినిమాకి ప్రధాన బలం. సెకండ్ హాఫ్ ఎడిటింగ్ మీద దృష్టి పెట్టీ ఉండాల్సింది. పాటల్లో తెలుగు సాహిత్యం మీద ఫోకస్ పెట్టి ఉండాల్సింది. ప్రొడక్షన్ వేల్యూస్ మంచిగా ఉన్నాయి.

ఫైనల్లీ.. లియో రొటీన్ కధతో ఉన్న లోకేష్ మార్క్ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ విత్ ఎమోషన్స్.. సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ కోసం థియేటర్లలో చూడాల్సిన సినిమా ఇది.

Show comments