NTV Telugu Site icon

Konaseema Thugs Movie Review: కోనసీమ థగ్స్ మూవీ రివ్యూ

Konaseema1

Konaseema1

కొరియోగ్రాఫర్ గా జాతీయ అవార్డ్ తో పాటు తమిళనాడు, కేరళ రాష్ర్ట ప్రభుత్వ అవార్డులు గెలుపొందిన బృందా దర్శకత్వం వహించిన రెండవ చిత్రం ‘థగ్స్’. దుల్కర్ సల్మాన్ తో రూపొందిన తొలి చిత్రం ‘హే సినామిక’తో విమర్శకుల ప్రశంసలు పొందిన బృందా ద్వితీయ యత్నంగా హ్రిదూ హరూన్ తో తెలుగు, తమిళ భాషల్లో తీసిన సినిమా ఇది. తెలుగో ‘కోనసీమ థగ్స్’ పేరుతో శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఎలాంటి స్పందన లభిస్తుందో చూద్దాం.

తునికి చెందిన అనాథ శేషు (హ్రిదు హరూన్) కథ ఇది. తన ప్రేయసి (అనస్వర రాజన్)పై దాడి చేసిన రౌడిని అనుకోకుండా చంపి హంతకుడిగా జైలుకు వెళతాడు శేషు. అక్కడ కాకినాడకి చెందిన గూండా దొర (బాబీ సిన్హా) ని కలుస్తాడు. ఇద్దరూ జైలు నుండి తప్పించుకోవాలని నిర్ణయించుకుంటారు. మరి శేషు ప్లాన్ వర్కవుట్ అవుతుందా? దొర ప్లాష్‌ బ్యాక్ ఏంటి? హత్య చేసిన శేషుని వెంటాడుతున్నది ఎవరు? జైలు సిబ్బంది ఎందుకు శేషుని చంపాలనుకుంటారు? జైలు నుంచి తప్పించుకోవాలనుకున్న శేషు, దొరకు సహకరించింది ఎవరు? వారు తప్పించుకోగలిగారా? అన్నదే ఈ చిత్ర కథాంశం.

డైరెక్ట్ నెరేషన్ కాకుండా ఇంటర్స్ కట్స్ లో ఫ్లాష్‌ బ్యాక్ స్టోరీని అక్కడక్కడా కలుపుతూ వెళ్ళటం, అది స్లో నేరేషన్ లో ఉండటం వల్ల ఆడియన్స్ ఎంగేజ్ అవటం కష్టమైన విషయం. బోరింగ్‌గా ఉన్నప్పటికీ ఇంటర్వెల్ బ్లాక్ తో కొద్దిగా ఆసక్తి పెరుగుతుంది. ఇక రెండో సగంలో హీరో శేషు జైలు నుండి పారిపోవటంలో భాగం ఎంచుకున్న పద్ధతి కొత్తతరహాలో సాగుతుంది. ఇందులో వచ్చే యాక్షన్ పార్ట్ కొంత ఆకట్టుకునేలా సాగుతుంది. కథనం కొంత మేరకు ‘విచారణై’ను గుర్తుకు
తెస్తుంది.

హీరోగా హ్రిదు హరూన్ నటన పర్వాలేదనిపించేలా ఉంది. అయితే భావోద్వేగాలను పండించటంలో తను సఫలీకృతుడు కాలేకపోయాడు. బాబీ సింహాకు ఇలాంటివి కొట్టిన పిండే. ఇందులో తన పాత్ర అతనికి కేక్‌వాక్ లాంటిది. హీరోయిన్ అనశ్వర రాజన్ స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువే. ఉన్న సీన్స్ లో కూడా తన ఉనికి ఏ మాత్రం చాటలేక పోయింది. ఇతర నటీనటులు మాత్రం తమ పాత్రల పరిథి మేరకు చక్కగానే చేశారు. దర్శకురాలిగా బృందా ఎందుకున్న పాయింట్ మంచిదే కానీ దానిని స్క్రీన్ పై ప్రెజెంట్ చేయటంలో సక్సెస్ కాలేక పోయింది. ప్రత్యేకించి తొలి భాగం పూర్తిగా బోర్ గా సాగుతుంది. ఇక సాంకేతికంగా ఈ సినిమా బాగుందని చెప్పాలి. ప్రియేష్ గురుసామి సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. సినిమా మూడ్ ని ఎలివేట్ చేయటంలో తన కెమెరా ఎంతగానో వగలు పోయింది. లైటింగ్ ప్రేక్షకులు ఇన్ వాల్వ్ అయ్యేలా చేసింది. ఇక సంగీత దర్శకుడు శామ్ సిఎస్ పాటలు ఏమాత్రం ఆకట్టుకునేలా లేవు. అయితే తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్రాణం అనే చెప్పాలి. మొత్తానికి ఇది ఒక నార్మల్ యాక్షన్ డ్రామా చిత్రం.

ప్లస్ పాయింట్స్ :
ప్రియేష్ కెమెరా పనితనం
శ్యామ్ సి.ఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్
నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్:
స్లో నేరేషన్
కథనం ఆకట్టుకునేలా లేకపోవడం
మిస్ గైడ్ చేసే టైటిల్

ట్యాగ్ లైన్:పారిపోయిన ఖైదీలు

Show comments