NTV Telugu Site icon

Jilebi review: జిలేబి రివ్యూ

Jilebi Review

Jilebi Review

Jilebi Movie review: ఒకప్పుడు సూపర్ హిట్లు ఇచ్చిన డైరెక్టర్ విజయ భాస్కర్ రీ ఎంట్రీ ఇస్తూ చేసిన సినిమా జిలేబి. ఈ సినిమాతో విజయ భాస్కర్ తన కొడుకు శ్రీ కమల్ ను హీరోగా పరిచయం చేయడం గమనార్హం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో రాజశేఖర్ కుమార్తె శివాని రాజశేఖర్ హీరోయిన్ గా నటించడం. అలా ఆసక్తికరమైన కాంబినేషన్ తో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం.

కథ:
కమల్ (శ్రీ కమల్) అనే కుర్రాడికి జి లక్ష్మి భారతి అలియాస్ జిలేబి (శివానీ రాజశేఖర్)తో పరిచయం అవుతుంది. ఆ పరిచయం వల్ల కొన్ని కీలకమైన పరిణామాలు చోటుచేసుకుంటాయి. జిలేబి రహస్యంగా అబ్బాయిల హాస్టల్‌లోకి ప్రవేశించగా ఆమె పారిపోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో అక్కడే ఉండవలసి వస్తుంది. దీంతో ఆమె ఆమె కమల్ సహాయాన్ని కోరగా బుజ్జి (సాయి కుమార్ బబ్లూ), బాబీ (అంకిత్ కొయ్య), వాషింగ్టన్ (వైవా సన్నీ)లు కూడా ఆమె హాస్టల్ లో ఉన్నట్టు కనిపెడతారు. ఈ క్రమంలో జిలేబి తండ్రి ఎంఎల్ఏ రుద్ర ప్రతాప్ రానా (మురళీ శర్మ) వల్ల ఎదురైన పరిస్థితులు ఏంటి.. ఈ హాస్టల్ వార్డెన్ ధైర్యం (రాజేంద్ర ప్రసాద్) ఏం చేశాడు? చివరికి ఆమె ఎలా బయటకు వచ్చింది అనేది సినిమా కథ.

విశ్లేషణ: డైరెక్టర్ విజయ్ భాస్కర్ కంబ్యాక్ సినిమా అయిన ఈ జిలేబీ అన్ని వర్గాల వారికి కనేక్ అయ్యే అవకాశాలు తక్కువ. సినిమాను మంచి ఎంటర్టైన్మెంట్ గా చూపించే క్రమంలో కొంతవరకు ఇబంది పడ్డారు. కొన్నిసీన్లు బోరింగ్ అనిపించినా కూడా మొత్తం మీద ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. నిజానికి ఇది చాలా చిన్న లైన్ ను అల్లుకుని చేసిన సినిమా. ఇలాంటి ప్రయత్నాలు ఎక్కువ మలయాళ పరిశ్రమలోనే జరుగుతున్నాయి. అయితే కధతో ప్రేక్షకలను అలరించే ప్రయత్నం చేసి కొంతవరకు సక్సెస్ అయ్యాడు డైరెక్టర్. యూత్ ను బేస్ చేసుకుని ఈ సినిమా చేసినట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్ కంటే ఎందుకో సెకండాఫ్ ఇంట్రెస్టింగ్ అనిపించింది.

ఎవరెలా చేశారంటే:
విజయ్ భాస్కర్ కుమారుడు శ్రీ కమల్ ఈ సినిమాతో హీరోగా పరిచయం కాగా మొదటి ప్రయత్నంలోనే అందర్నీ మెప్పించే ప్రయత్నం చేసి కొంతవరకు సక్సెస్ అయ్యాడు. శివానీ రాజశేఖర్ తన పాత్రలో లీనమైంది. బబ్లూ సాయి కుమార్, అంకిత్ కొత్త, వైవా సన్నీ, మురళీ శర్మ, రాజేంద్ర ప్రసాద్ వంటి వారు తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే.. డైరెక్టర్ విజయ్ భాస్కర్ ఎంచుకున్న పాయింట్ బాగుంది కానీ తెరకెక్కించే క్రమంలో కొంత పట్టు తప్పింది. డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. మణిశర్మ గురించి చెప్పేది ఏముంది ఆయన అందించిన పాటలు, బీజీ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్ పాయింట్. నిర్మాణ విలువలు సినిమాకు రిచ్ నెస్ తీసుకొచ్చాయి.

ఫైనల్ గా
జిలేబీ అందరికీ నచ్చకపోయినా టార్గెట్ చేసుకున్న యూత్ ను ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి.