ఇథియోపియా నుండి వచ్చిన 65 ఏళ్ల పురుషుడికి పేస్ హాస్పిటల్స్ విజయవంతంగా చికిత్స అందించింది. ఈ పేషెంట్ కి గతంలో ఇతర ఆసుపత్రిలో నిర్వహించిన TURP (ట్రాన్స్‌యురెత్రల్ రిసెక్షన్ ఆఫ్ ప్రోస్టేట్ ) ప్రక్రియ తర్వాత సంక్లిష్ట యురేత్రల్ స్ట్రిక్చర్ మరియు బ్లాడర్ నెక్ కాన్‌ట్రాక్చర్ ఏర్పడింది. పేషెంట్ ని పేస్ హాస్పిటల్స్, హైటెక్ సిటీలో సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్టు & రీనల్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ విశ్వంభర్ నాథ్ పర్యవేక్షణలో పరిశీలించి చికిత్స అందించారు.
పేషెంట్ నిరంతర మూత్ర విసర్జన సమస్యలు (LUTS) మరియు మూత్రం విసర్జనలో తీవ్ర ఇబ్బందితో ఆసుపత్రికి వచ్చాడు. ఆపరేషన్‌కు ముందు చేసిన RGU (రెట్రోగ్రేడ్ యురేత్రోగ్రామ్)లో బల్బోమెంబ్రనస్ ప్రాంతంలో సన్నగా మారిన భాగం (stricture) కనిపించింది.
సమగ్ర వైద్య పరీక్ష అనంతరం, అత్యంత అనుభవజ్ఞుడైన డాక్టర్ అభిక్ దేబ్‌నాథ్, కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్ యూరాలజిస్టు, ఎండోయూరాలజిస్టు, ఆండ్రాలజిస్టు & కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ నేతృత్వంలోని యూరాలజీ బృందం స్పైనల్ అనస్థీషియా అధీనంలో సిస్టోస్కోపీతో డైరెక్ట్ విజువల్ ఇంటర్నల్ యురేథ్రోటమీ(DVIU) మరియు బ్లాడర్ నెక్ ఇన్‌సిజన్ (BNI) చేశారు. శస్త్రచికిత్సలో 6 Fr పరిమాణంలో ప్రాక్సిమల్ బల్బార్ యురేత్రల్ స్ట్రిక్చర్ మరియు సుమారు 10 Fr పరిమాణంలో బ్లాడర్ నెక్ స్టెనోసిస్ ఉన్నట్లు గుర్తించారు. మూత్ర ప్రవాహాన్ని పునరుద్ధరించడానికి 3 గంటల మరియు 9 గంటల స్థానాల్లో కోల్డ్ నైఫ్ ద్వారా నిర్దిష్టమైన చీలికలు చేశారు. మొత్తం ప్రక్రియ ఎలాంటి శస్త్రచికిత్సా లేదా శస్త్రానంతర సమస్యలు లేకుండా విజయవంతంగా పూర్తయ్యింది.
పేషెంట్ బాగా కోలుకుని, హీమోడైనమికల్‌గా స్థిరంగా ఉండగా అదే రోజు డిశ్చార్జ్ చేయబడాడు. స్ట్రిక్చర్ మళ్లీ ఏర్పడకుండా నిరోధించేందుకు అనుసరణ సూచనలు మరియు దీర్ఘకాలిక స్వీయ-క్యాలిబ్రేషన్ విధానం గురించి కూడా వివరాలు అందించారు. ఏడు రోజుల తర్వాత కాథెటర్ తొలగింపునకు ఫాలో-అప్ అపాయింట్‌మెంట్‌ను షెడ్యూల్ చేశారు.
ఈ విజయంపై మాట్లాడుతూ డాక్టర్ అభిక్ దేవ్‌నాథ్ తెలిపారు:
“పేషెంట్కి మూత్ర ప్రవాహాన్ని సురక్షితంగా, సమర్థవంతంగా పునరుద్ధరించడం మా ప్రధాన లక్ష్యం. ఒకే సెషన్‌లో DVIU మరియు BNI చేయడం ద్వారా సంక్లిష్టమైన post-TURP స్ట్రిక్చర్‌లను ఖచ్చితత్వంతో మరియు తక్కువ అసౌకర్యంతో చికిత్స చేయగలుగుతున్నాము. ఇతర ఆసుపత్రుల్లో విజయవంతం కాని చికిత్సల తర్వాత మాకు వచ్చే పేషెంట్ లకు ఇది వేగవంతమైన రికవరీ, తక్కువ ఆసుపత్రి నివాసం మరియు మెరుగైన జీవన నాణ్యతను అందిస్తుంది.”
ఈ కేసు అధునాతన ఎండోరోలాజికల్ విధానాల్లో పేస్ హాస్పిటల్స్ నైపుణ్యాన్ని, ఆధారిత వైద్యాన్ని (ఎవిడెన్స్-బేస్డ్ కేర్) అందించాలన్న అంకితభావాన్ని స్పష్టంగా చూపిస్తోంది. అలాగే ప్రత్యేకత గల యూరాలజీ చికిత్స కోసం హైదరాబాద్‌ను ఆశ్రయించే అంతర్జాతీయ పేషెంట్ లకు పేస్ హాస్పిటల్స్ యూరాలజీ విభాగం ఒక నమ్మకమైన, ప్రాధాన్యత పొందిన కేంద్రంగా ఎదుగుతున్న ప్రతిష్ఠను కూడా ఇది మరోసారి రుజువు చేస్తోంది.
మరింత సమాచారం కోసం సంప్రదించండి:
PACE హాస్పిటల్స్ – హైదరాబాదు, తెలంగాణ, ఇండియా
ఫోన్ లేదా వాట్సాప్: 040 48486868
https://www.pacehospital.com
https://www.pacehospital.com/urethral-strictures-treatment
https://www.pacehospital.com/turp-transurethral-resection-of-the-prostate-or-prostatectomy-patient-education
https://www.pacehospital.com/urology-doctors
https://www.pacehospital.com/urology