Site icon NTV Telugu

Star Hospitals : హైదరాబాద్‌లో ‘హార్ట్ ఫెయిల్యూర్’ క్లినిక్ ప్రారంభం

Star

Star

హైదరాబాద్ గచ్చిబౌలి నానక్ రాం గూడ లోని స్టార్ హాస్పిటల్స్ గుండె సంబంధిత వ్యాధుల పట్ల అవగాహన కల్పించేందుకు ‘స్టార్ హార్ట్ ఫెయిల్యూర్ క్లినిక్’ను నేడు ప్రారంభించారు. ఈ సందర్బంగా స్టార్ హాస్పిటల్స్ మేనేజంగ్ డైరెక్టర్ డాక్టర్ గోపిచంద్ మన్నం మాట్లాడుతూ.. ఇండియాలో గుండె సంబంధిత సమస్యలు మరింత క్లిష్టంగా మారుతున్నాయి..పశ్చిమ దేశాల్లో గుండె సంబంధిత వ్యాధులు 70ఏళ్ల వయస్సులో కనిపిస్తే మన దేశంలో 50-60ఏళ్ల మధ్య కనిపిస్తున్నాయి.. దీనికి కారణం హార్ట్ ఎటాక్ వస్తుంది అని తేలుసు కాని హార్ట్ ఎటాక్ సమస్యలు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అవగాహన లేకపోవడం కారణం అన్నారు.. అందుకే స్టార్ హస్పటల్ గుండే సంబందీత వ్యాధుల పట్ల అవగాహన కల్పించేందుకు హార్ట్ ఫెయిల్యుర్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు..

Mystery : 70,000 ఏళ్ల రహస్యం.. తమిళనాట దొరికిన తొలి మానవుడి DNA.!

అనంతరం అడ్వాన్స్ హార్ట్ ఫెయిల్యుర్ &ట్రాన్స్ప్లాంట్ కార్డియలోజిస్ట్ డాక్టర్.సురేష్ ఎర్ర మాట్లాడుతూ భారతదేశంలో ముఖ్యంగా పని చేసే వయస్సు గల వారిలో గుండె వైఫల్యం కేసులు గణనీయంగా పెరిగిపోతున్న నేపథ్యంలో, స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్‌లో “స్టార్ హార్ట్ ఫెయిల్యూర్” క్లినిక్‌ను ప్రారంభించిందన్నారు..భారతదేశం గుండె వైఫల్యం కేసులలో “నిశ్శబ్ద విస్ఫోటాన్ని” ఎదుర్కొంటోందని, ప్రస్తుతం సుమారు 8-10 మిలియన్ల మంది గుండే సంబందీత వ్యాధులతో జీవిస్తున్నారన్నారు..ప్రతి సంవత్సరం 1.8 మిలియన్ల కొత్త కేసులు నిర్ధారణ నమోదు అవుతున్నాయి..గత ఐదేళ్లలో గుండె జబ్బుల చికిత్స క్లెయిమ్‌లు దాదాపు రెట్టింపు అవ్వడం మరియు ఆకస్మిక గుండె మరణాలు విపరీతంగా పెరగడం ఈ ప్రమాదకర ధోరణికి నిదర్శనమన్నారు..తెలంగాణలో మాత్రమే 2022లో 282 గుండె మరణాలు నమోదయ్యాయని, వీటిలో ఎక్కువ మంది 30 నుండి 50 సంవత్సరాల వయస్సు గల పురుషులు ఉన్నారని ఆయన తెలిపారు..హైదరాబాద్‌లో పెరుగుతున్న రక్తపోటు, మధుమేహం, ఊబకాయం మరియు ఒత్తిడి కారణంగా ఇది గుండె సంబంధిత ప్రమాదాలకు కేంద్రంగా మారిందని అన్నారు..

Andhra King Taluka: రామ్ రాసిన పాటని అనిరుధ్ పాడితే?

Exit mobile version