Site icon NTV Telugu

Nizamabad: ఆర్.ఎస్. బ్రదర్స్ నిజామాబాద్‌లో సరికొత్త షోరూమ్‌కు శుభారంభం

Nizamabad

Nizamabad

Nizamabad: మార్చి 5 నాడు నిజామాబాద్లో సరికొత్త షోరూమ్‌ను ప్రారంభించడం ద్వారా ఆర్.ఎస్. బ్రదర్స్ మరో మైలురాయిని సగర్వంగా చేరుకుంది. సౌత్ ఇండియాలో ఆర్.ఎస్. బ్రదర్స్ బ్రాండ్ తన పేరు ప్రఖ్యాతల్ని విస్తరించి, కుటుంబ షాపింగ్ అవసరాలను తీర్చే విశ్వసనీయ సంస్థగా, ఏకైక గమ్యంగా, నిజామాబాద్ నడిబొడ్డున ఓల్డ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎదుట, ఆర్.పి. రోడ్లో విజయకేతనం ఎగురవేస్తోంది. దార్శనికులైన శ్రీ పి. వెంకటేశ్వర్లు, శ్రీ ఎస్. రాజమౌళి, శ్రీ టి. ప్రసాదరావు, దిగంగత పి. సత్యనారాయణ గార్లు నెలకొల్పిన ఆర్.ఎస్. బ్రదర్స్ – సంప్రదాయాన్ని, ఆధునిక జీవనశైలిని మేళవించిన ఒక సుప్రసిద్ధ బ్రాండ్గా రూపు సంతరించుకొని వైవిధ్యంలో, నాణ్యతలో, విశ్వసనీయతలో, అందుబాటు ధరలలో కుటుంబంలోని అన్నితరాల వారినీ ఆకర్షిస్తూ, అలరిస్తోంది.

మార్చి 5 నాడు నిజామాబాద్లో జరిగిన ప్రారంభోత్సవానికి స్థానిక వినియోగదారులు పెద్ద సంఖ్యలో విచ్చేయడం విశేషం. నూతనత్వాన్ని ఆశించే ప్రతీ ఒక్కరికీ నిర్వాహకులు సాదరంగా స్వాగతం పలికారు. శ్రీమతి కె. ఉమారాణి ముదిరాజ్ గారు, మేయర్, నిజామాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ముఖ్య అతిథిగా విచ్చేసి నూతన షోరూమ్ను ప్రారంభించారు. ప్రఖ్యాత నటి నిధి అగర్వాల్ ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి, కొత్త కాంతులు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “నిజామాబాద్ లోని ఆర్.ఎస్. కుటుంబంలో మమేకం కావడం ఆనందంగా ఉంది. ఇక్కడ ఉన్న కలెక్షన్లు అద్భుతంగా ఉన్నాయి. వివాహాది శుభకార్యాలు మొదలుకుని, పర్వదినాల వరకు ప్రతీ వేడుకకూ అచ్చంగా సరిపోయే వెరైటీలు ఆర్.ఎస్. బ్రదర్స్ వారి నిజామాబాద్ షోరూమ్లో మీకోసం సిద్ధంగా ఉన్నాయి” అన్నారు. ఆర్.ఎస్.బి. రిటైల్ ఇండియా లిమిటెడ్ డైరెక్టర్లు నిజామాబాద్ లో ఈ సరికొత్త షోరూమ్ శుభారంభ కార్యక్రమాన్ని కనులవిందుగా నిర్వహించడం తమకు గర్వకారణం అన్నారు. వివిధ తరాలకు, వయసులకు, వర్గాలకు చెందిన కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా అనేక రకాల వెరైటీలను అందించడం తమకు అనందంగా ఉందని వారన్నారు. ఈ సందర్భంగా ఛైర్పర్సన్ & హోల్ టైం-డైరెక్టర్ శ్రీ పొట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ- “ప్రతీ సరికొత్త షోరూమ్ తో పాటు పర్వదినాలకు, వివాహ వేడుకలకు కొత్త వెరైటీలను కస్టమర్ల హృదయాలకు చేరువగా తీసుకురావడం మాకు గర్వకారణం” అన్నారు.

మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సీర్ణ రాజమౌళి ప్రసంగిస్తూ- “దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాషన్లను సేకరించి మా నిజామాబాద్ కస్టమర్లకు అందిస్తున్నాం” అన్నారు. హోల్-టైం డైరెక్టర్ శ్రీ తిరువీధుల ప్రసాదరావు- “నిజామాబాద్ లో లభించిన అపూర్వ ఆదరణ మా ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. మా నాణ్యతా ప్రమాణాలను మరింత ఉన్నత స్థాయికి చేర్చేందుకు నిరంతర కృషి కొనసాగుతుంది. ఒకేచోట అన్ని వెరైటీలను అందిస్తామన్న మా వాగ్దానాలు నిలబెట్టుకునే దిశగా ఆర్.ఎస్. బ్రదర్స్ ప్రయాణం కొనసాగుతుంది” అన్నారు. నిజామాబాద్ షోరూమ్ మహిళలు, పురుషులు మరియు పిల్లల వస్త్రాలకు సంబంధించి అతితక్కువ ధరలకే విభిన్నమైన, విస్తృతమైన కలెక్షన్లను ప్రదర్శిస్తోంది. ఈ షోరూమ్ ప్రముఖ ఫ్యాషన్ వస్త్రాలతో పాటు, ఒక సమగ్రమైన లైఫ్ స్టైల్ విభాగాన్ని కూడా పరిచయం చేస్తోంది. ఇందులో బెడ్రూమ్ మరియు లివింగ్రూమ్ అవసరాలకు తగ్గట్టుగా అద్భుతమైన హోమ్ ఫర్నిషింగ్స్ మరియు స్టైలిష్ విండో ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు, వినియోగదారులు ఇక్కడ విశాలమైన హోమ్నీడ్స్ విభాగాన్ని కూడా చూడవచ్చు. ఇందులో హై-ఎండ్ కుక్వేర్ మరియు గృహోపకరణాల నుండి స్టేషనరీ, టాయ్స్ & స్పోర్ట్స్ మరియు లగేజీ వరకు అన్నీ లభిస్తాయి. ఇది కుటుంబానికి అవసరమైన ప్రతి వస్తువు ఒకేచోట దొరికే ఒక పరిపూర్ణమైన గమ్యస్థానం. కంచిపట్టుచీరలు మొదలుకుని, డిజైనర్ లెహంగాలు, విలాసవంతమైన వెస్ట్రన్ వెరైటీలు, పిల్లలను, మహిళలను, పురుషులను ప్రత్యేకంగా అలరించే అన్నిరకాల వైవిధ్యభరిత వస్త్రాలు నిజామాబాద్లో శుభారంభం చేసుకున్న ఆర్.ఎస్. బ్రదర్స్ షోరూమ్లో ఉన్నాయి. ముఖ్యంగా పవిత్ర రంజాన్ పర్వదినాన్ని, వివాహ శుభకార్యాలను పురస్కరించుకుని అన్ని రకాల కలెక్షన్లు ఈ సరికొత్త షోరూమ్లో లో నిజామాబాద్ వాసుల కోసం ప్రత్యేకంగా కొలువుదీరి ఉన్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్.ఎస్. బ్రదర్స్ నిర్వాహకులు నిజామాబాద్ లోని అన్ని వర్గాల కస్టమర్లను సాదరంగా ఆహ్వానిస్తున్నారు.

Exit mobile version