Site icon NTV Telugu

R.S. Brothers : 15వ షోరూమ్ హైదరాబాద్ వనస్థలిపురంలో శుభారంభం

Rsb

Rsb

R.S. Brothers : ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఫ్యాషన్, షాపింగ్ ప్రేమికులకు తెలిసిన ప్రముఖ బ్రాండ్ R.S. Brothers తమ 15వ షోరూమ్‌ను సెప్టెంబర్ 26న హైదరాబాద్ వనస్థలిపురం, బొమ్మిడి ఎలైట్ టవర్స్ సమీపంలో శుభారంభం చేసింది. కుటుంబసమేత షాపింగ్ కోసం ప్రత్యేకంగా రూపకల్పన చేసిన ఈ షోరూమ్ విస్తృత శ్రేణి వస్త్రాలు, ఫ్యాన్సీ, వెడ్డింగ్ కలెక్షన్లతో ఆకట్టుకుంటోంది. షోరూమ్ ప్రారంభోత్సవానికి ప్రముఖ సినిమా జంట అక్కినేని నాగచైతన్య మరియు శోభిత ధూళిపాల ప్రారంభించారు.

 

నాగచైతన్య షోరూమ్ గురించి మాట్లాడుతూ, “R.S. Brothers పేరు వింటే సంప్రదాయం, విశ్వసనీయత, సరికొత్త ఫ్యాషన్‌లు గుర్తుకు వస్తాయి. ఈ షోరూమ్ వనస్థలిపురం వాసులకు అద్భుతమైన షాపింగ్ అనుభూతి అందిస్తుంది” అని తెలిపారు. శోభిత ధూళిపాల కూడా షోరూమ్ లోని వస్త్రాలను ప్రశంసిస్తూ, “వేడుకలు, వివాహం, ఫెస్టివల్‌లకు అవసరమైన అన్ని వస్తువులు కుటుంబంలోని ప్రతి తరానికి అందుబాటులో ఉంటాయి” అన్నారు.

Exit mobile version