Free Cancer Screening: ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మల్లారెడ్డి క్యాన్సర్ హస్పిటల్ లో సాధారణ ప్రజలకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ తో పాటు ఐ సర్వైప్ ను ప్రారంభించారు.. మల్లారెడ్డి నారయణ క్యాన్సర్ పేషెంట్స్ సపోర్ట్ గ్రూప్ కి పెట్టిన పేరే ఈ ఐ సర్వైప్ అన్నారు.. క్యాన్సర్ ను మొదట్లోనే గుర్తించి చికిత్స చేయడం ఈ ఐ సర్వైప్ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఈ ఐ సర్వైప్ మల్లారెడ్డి హస్పిటల్ ద్వారా క్యాన్సర్ పేషెంట్స్ సర్వైవర్స్ గ్రూపు ని నార్త్ హైదరాబాద్ లో మొదిటిసారిగా ఏర్పాటు చేశారన్నారు. మల్లారెడ్డి హస్పిటల్ లోని క్యాన్సర్ భాదితులు ఈ ఐ సర్వైప్ కార్డును పొందిన రోగులకు జీవితకాలానికి 50 శాతం, క్యాన్సర్ నివారణ ఆరోగ్య పరీక్షలకి 15 శాతం, ల్యాబ్, రెడీయాలజీ, బెడ్ చార్జీలను 10 శాతం ప్రతి 2 నెలలకోసారి నిర్వహించి డిస్కౌంట్స్ అందిస్తున్నామన్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్ ప్యాకెజీ 10 వేల కంటే ఎక్కువైన ఒక ప్యాకెజీని క్యాన్సర్ నివారణ కార్యక్రమంలో భాగంగా ఉచితంగా పొడగించినట్టు హస్పిటల్ యాజమాన్యం తెలిపారు.
Read Also: Top Headlines @ 5 PM: టాప్ న్యూస్
ఈ సందర్భంగా డాక్టర్ భద్రారెడ్డి మాట్లాడుతూ తమ హస్పిటల్ లో హైదరాబాద్ లోనే ది బెస్ట్ ప్రపంచస్థాయి పరికాలతో కూడిన అత్యాధునిక మిషనరీతో పాటు అంకాలజీ, మల్టీ డిసాప్లీనరీ సూపర్ స్పెషాలటీ డాక్టర్ లు అందుబాటులో ఉన్నారన్నారు. మల్లారెడ్జి హస్పిటల్ క్యాన్సర్ బ్లాక్ లో ప్రతిరోజు 10 నుండి 6 వరకు ఉచిత శిబిరాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యంగా ఈ క్యాన్సర్ ఒక సంక్లిష్ట వ్యాధి అన్నారు. ఈ క్యాన్సర్ ప్రతియేడాది పెరుగుతూ పబ్లిక్ ని కలవరపెడుతుందన్నారు. దీనికి ముఖ్యంగా ప్రజల జీవనశైలితో పాటు, స్మోకింగ్, మద్యం సేవించడం, టాక్సీన్ పర్యావరణ బహిర్గతం ద్వారా క్యాన్సర్ ప్రమాదాలు పెరుగుతున్నాయన్నారు. ఈ క్యాన్సర్ వ్యాదిసోకిన ఎవరు అధైర్య పడకుండా ఉండేందుకే తమ మల్లారెడ్డి క్యాన్సర్ హస్పిటల్ లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులను నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలందరూ తమ జీవనశైలినీ మార్చుకుని తమతో పాటు తమకుటుంబాల్లో నిజమైన మార్పును తీసుకురావాలన్నారు.