Site icon NTV Telugu

Chicha Ka Australia Tour: రాహుల్ సిప్లిగంజ్ ఆస్ట్రేలియా టూర్..

Chicha Ka Australia Tour

Chicha Ka Australia Tour

Chicha Ka Australia Tour: రాహుల్ సిప్లిగంజ్ ప్రత్యేకంగా పరిచయం అక్కరలేని పేరు. నాటునాటు సాంగ్‌తో ఏకంగా ఆస్కార్ అవార్డ్ విజేతగా నిలిచి భారత సినీలోకానికి పరిచయమయ్యారు. ఆయన ఆస్ట్రేలియాలో భారీ లైవ్ ఫెర్ఫామెన్స్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఓల్డ్ మాంక్ ఎంటర్‌టైన్‌మెంట్స్, హ్యాష్‌ట్యాగ్ ఇండియా మ్యాగజైన్ మరియు వాసవి గ్రూప్ సహకారంతో రాహుల్ సిప్లిగంజ్ ఆస్ట్రేలియాలో తన మొట్టమొదటి అంతర్జాతీయ ప్రత్యక్ష ప్రదర్శనను ఈ నవంబర్ 25న ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లోని టింబర్ యార్డ్‌లో ఇవ్వనున్నారు.

ఆస్ట్రేలియాలో దాదాపుగా 2 లక్షల మంది తెలుగు కమ్యూనిటీ ఉంది. వీరికి రాహుల్ సంగీత ప్రదర్శన మరుపురాని అనుభూతి ఇవ్వనుంది. ‘‘ చిచా కా ఆస్ట్రేలియా టూర్’’ పేరుతో అక్కడ అభిమానులతో ఇంటరాక్ట్ అవ్వనున్నారు. ఈ కార్యక్రమం కోసం తాను ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని, తనతో పాటు 17 మంది ఆర్టిస్టుల టీం ఆస్ట్రేలియా వెళ్తున్నామని, ఇది ప్రేక్షకులకు ఒక రకమైన అనుభూతిని ఇస్తుందని రాహుల్ సిప్లిగంజ్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ ఈవెంట్‌కి సంబంధించి వాసవి గ్రూప్ ఒక స్పాన్సర్‌గా ఉంది. వాసవి గ్రూప్ తరుపున మార్కెటింగ్ హెడ్ కుస్లవ్ రెడ్డి ప్రెస్ మీట్‌కి హాజరయ్యారు.

Exit mobile version