Care Hospitals Walkathon: పుట్టుకతో వచ్చే గుండెజబ్బులవల్ల పిల్లల్లో పెరుగుతున్న సంఘటనలు మరియు మరణాల గురించి అవగాహన పెంచే లక్ష్యంతో, కేర్ హాస్పిటల్, బంజారాహిల్స్ ఆధ్వర్యంలో ఇవాళ నెక్లెస్ రోడ్‌లో వాకథాన్ నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన డాక్టర్ రాధారాణి.. జెండా ఊపి ఈ వాకథాన్‌ను ప్రారంబించారు. ఈ వాకథాన్‌లో 100 మందికిపైగా గుండెలోపాలతో బాధపడుతున్న పిల్లలు, వారితల్లిదండ్రులు, వైద్యులు మరియు ఆసుపత్రి సిబ్బంది వాకథాన్‌లో పాల్గొన్నారు. డా.తపన్దాష్, డా.కవిత చింతల్లా, డా.ప్రశాంత్పాటిల సమక్షంలో డాక్టర్ రాధారాణి కూడా వాకథాన్‌లో పాల్గొన్నారు.
పుట్టుకతో వచ్చే గుండెజబ్బు (CHD) అనేది పుట్టుకతో వచ్చే గుండె నిర్మాణంలో లోపంవల్లకలుగుతాయి. 100 మంది పిల్లలలో ఒకరికి గుండెలోపాలతోపుడుతున్నారు. పిల్లలమరణాలకు ఇది ప్రధాన కారణాలలో ఒకటి. పుట్టుకతో కొంత మంది పిల్లలకి గుండెలో రంద్రాలు ఉంటాయి. కొన్నిసార్లు వీరికివెంటనే ఆపరేషన్ చేసి సమస్యని పరిష్కరిస్తే మరికొంత మందికి మాత్రం కొన్ని రోజుల తర్వాత అంటూ వాయిదా వేస్తారు. గుండె సమస్యలు ఉన్న పిల్లల్లో కొంత మంది బ్లూబేబీస్కూడా ఉంటారు. శస్త్రచికిత్సలరేటు దాదాపు 100% ఉంటుంది మరియు సంక్లిష్ట గుండెలోపాల విషయంలో 90% కంటే ఎక్కువ మంది పిల్లలు ఇప్పటికీ నయమవుతున్నారని కాబట్టి గుండె జబ్బులతో పుట్టిన పిల్లల తల్లి దండ్రులు భయాందోళన చెందవద్దని బంజారాహిల్స్ డియాట్రిక్కార్డియాక్సర్జరీ కేర్ హాస్పిటల్ రెక్టర్మరియుహెచ్‌ఓడి డాక్టర్ పన్దాష్ ఈ సందర్భంగా తెలిపారు.
సాధారణంగా శరీరంలో ముఖ్యఅవయవం గుండె. గుండె నిజాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి, ఏవయసువారైనా ముందు నుంచి గుండె విషయంలో జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో.. సాధారణంగా కొంత మంది పిల్లలు పుట్టుకతోనే గుండెసమస్యలతో పుడతారు. వీరివిషయంలో తల్లిదండ్రులకి పూర్తిఅవగాహన ఉండాలి. ఎటువంటి ఆలస్యం లేకుండా సకాలంలో స్క్రీనింగ్, రోగనిర్ధారణ మరియు చికిత్స యొక్క ప్రాముఖ్యతను అర్థంచేసుకోవాలి అని డా.కవిత కన్సల్టెంట్పీడియాట్రిక్కార్డియాలజిస్ట్ తెలిపారు. శ్రీ నీలేష్ గుప్తా హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కేర్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ మాట్లాడుతూ, ఈ రోగులలో అనారోగ్యం మరియు మరణాలను తగ్గించడానికి పుట్టుకతో వచ్చే హార్ట్ డిసీజ్ ఉన్న పిల్లలకు ప్రపంచ స్థాయి గుండె సంరక్షణను తక్కువ ఖర్చుతో అందించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నామున్ని ఆయన తెలిపారు.
కాగా, కేర్ హాస్పిటల్స్ గ్రూప్ భారతదేశంలో 6 రాష్ట్రాల్లోని 8 నగరాల్లో 16 హెల్త్‌కేర్ సదుపాయాలను నిర్వహిస్తున్న మల్టీ-స్పెషాలిటీ హెల్త్‌కేర్ ప్రొవైడర్. హైదరాబాద్, భువనేశ్వర్, విశాఖపట్నం, రాయ్‌పూర్, నాగ్‌పూర్, పూణే, ఇండోర్ & ఔరంగాబాద్‌లలో నెట్‌వర్క్ కలిగి ఉంది. దక్షిణ మరియు మధ్య భారతదేశంలో ఒక ప్రాంతీయ మరియు టాప్ 5 పాన్-ఇండియన్ హాస్పిటల్ చెయిన్‌లలో ఒకటిగా పరిగణించబడుతుంది, CARE హాస్పిటల్స్ 2700 పడకలతో 30కి పైగా క్లినికల్ స్పెషాలిటీలలో సమగ్ర సంరక్షణను అందిస్తోంది. ప్రస్తుతం, CARE హాస్పిటల్స్ దక్షిణాసియా మరియు ఆఫ్రికా అంతటా తన సేవలను విస్తరింపజేసే ప్రభావంతో నడిచే హెల్త్‌కేర్ నెట్‌వర్క్ అయిన ఎవర్‌కేర్ గ్రూప్ ఆధ్వర్యంలో పనిచేస్తోంది.