Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Ysrcp Leaders Waiting For Jagan Cabinet Berth

Jagan Cabinet Berth: జగన్ ఫ్రేమ్‌లో పట్టేదెవరు?

Published Date :March 25, 2022 , 4:25 pm
By NTV WebDesk
Jagan Cabinet Berth: జగన్ ఫ్రేమ్‌లో పట్టేదెవరు?
  • Follow Us :
  • google news
  • dailyhunt

త్వరలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అని ముఖ్యమంత్రి స్పష్టంగా తేల్చి చెప్పేయటంతో బెర్త్ కోసం కొందరు, ఎర్త్ పడకుండా మరి కొందరు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పార్టీ కోర్ట్ టీమ్ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు.

కేబినెట్‌లో కొందరు ఇళ్లకు
వైసీపీలో మంత్రి పోస్ట్ కోసం లాబీయింగ్ పతాకస్థాయికి చేరింది. మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినప్పుడే పదవీకాలం రెండున్నర ఏళ్లు అని సీఎం జగన్ ఎమ్మెల్యేలకు స్పష్టంగా చేప్పేశారు. మంత్రివర్గాన్ని దాదాపుగా పునర్వ్యస్థీకరించి కొత్తవారికి అవకాశం కల్పిస్తామన్నారు. అధినేత చెప్పిన సమయం రానే వచ్చింది. ప్రస్తుతం కేబినెట్‌లో ఉన్నవాళ్లలో కొందరు ఇంటికి వెళ్లక తప్పదు.

కోర్‌టీమ్‌ సభ్యుల గుడ్‌లుక్స్‌ కోసం తాపత్రయం
కొన్ని సమీకరణల వల్ల ఒకరిద్దరికి మినహాయింపు ఉంటుందని సీఎం జగన్ చెప్పటంతో మరింత ఉత్కంఠ పెరుగుతుంది. ఆ మినహాయింపులో కేబినెట్‌ బెర్త్‌ను కాపాడుకునేందుకు కొందరు మంత్రులు ప్రయాసలు పడుతున్నట్టు సమాచారం. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి వంటి కోర్‌ టీమ్‌ సభ్యుల గుడ్‌లుక్స్ కోసం తెగ శ్రమిస్తున్నారట. వీరితోపాటు కొత్తగా మంత్రి పదవి ఆశిస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం కోర్‌ టీమ్‌ సభ్యుల ఆఫీసులకు క్యూ కడుతున్నారు.

సీఎం దృష్టిలో పడేందుకు కొత్త పంథాలు
ఉగాది నాటికి జిల్లాల విభజన అధికారికంగా జరగనుండటంతో మంత్రివర్గ కూర్పులో ఆ సమీకరణాలు కూడా కీలంగా మారబోతున్నాయి. ఈ తూకంలో నిలిచేది ఎవరు.. గెలిచేది ఎవరు అన్నదే ప్రశ్న. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో ఏదో రకంగా సీఎం దృష్టిలో పడేందుకు ఎమ్మెల్యేలు.. మంచి మార్కులు కొట్టి పదవి పదిలం చేసుకునేందుకు కొందరు మంత్రులు కొత్త పంథాలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు అమాత్యులు తమను కేబినెట్‌లో కొనసాగించాలని పార్టీ ముఖ్య నేతలను నేరుగానే అడిగేస్తున్నారట.

విన్నపాలు వర్కవుట్‌ అవుతాయా?
ప్రస్తుతం ఈ విజ్ఞప్తులు.. ఎమ్మెల్యేల ఫీట్లు పార్టీలో చర్చగా మారాయి. ఎమ్మెల్యేలు ఏ ఇద్దరు ముగ్గురు కలిసినా వీటిపైనే చర్చ. మరి.. అధికారపార్టీలో ఈ విన్నపాలు ఎంతవరకు వర్కవుట్‌ అవుతాయో.. ఎవరి ఆశలను నెరవేరతాయో చూడాలి. సీఎం జగన్‌ ఫ్రేమ్‌లో పట్టేదెవరో కూడా వేచి చూడాల్సిందే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap Cabinet
  • cm jagan
  • Jagan Cabinet Berth
  • minister posts
  • off the record

తాజావార్తలు

  • Sanju Samson: ఆయన్ను కలిశా, సెంచరీ చేశా.. ప్రతి మ్యాచ్‌కు ముందు కలిస్తే బాగుండు!

  • Story Board: మమత మరోసారి సీఎం అవుతారా..? బీజేపీ గెలుపు ఉట్టి కొడుతుందా?

  • Asha Bhosle: లెజెండరీ సింగర్ ఆశా భోస్లేకు గుండెపోటు.. బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో 92 ఏళ్ల సింగర్!

  • Ayush Mhatre ‘రిటైర్డ్ ఔట్’.. CSK వ్యూహం వెనుక అసలు కారణం ఇదే..!

  • Telangana : MPTC, ZPTC ఎన్నికల షెడ్యూల్ ఇంకెప్పుడు.?

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions