Site icon NTV Telugu

Off The Record: గేర్ మార్చిన జగన్.. ఆ నాయకులపై సీరియస్

Jagan (1)

Jagan (1)

Off The Record: వైసీపీలో వార్నింగ్‌ బెల్‌ మోగిందా? డైరెక్ట్‌గా ముఖ్య నాయకుల్ని ముందు పెట్టుకుని మరీ.. అధ్యక్షుడు జగన్‌ రెడ్‌ బజర్‌ నొక్కారా? పార్టీ కార్యక్రమాల విషయంలో సీరియస్‌గాలేని మమ బ్యాచ్‌ ఇక ఇంటికేనంటూ డైరెక్ట్‌గానే చెప్పేశారా? నేను గేర్‌ మార్చేశా.. మీరు స్పీడ్‌ అందుకోకుంటే.. కష్టమని ఏ సందర్భంలో చెప్పారు జగన్‌? ప్రస్తుతం ఆయన ప్లానింగ్ ఎలా ఉంది?

వైసీపీ… తాడేపల్లి సెంట్రల్ ఆఫీస్‌లో ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో పలు ఆసక్తికర పరిణామాలు జరిగినట్టు తెలుస్తోంది. పార్టీని కింది స్థాయి నుంచి బలోపేతం చేసే విషయంలో కొందరు నియోజకవర్గ ఇన్ఛార్జ్‌లు నిర్లక్ష్యంగా ఉంటున్నారని, వాళ్ళ పనితీరు ఆశించిన స్దాయిలో లేదని, జిల్లా అధ్యక్షులు కూడా నియోజకవర్గాల్లో ఏం జరుగుతోందో సరైన నివేదికలు ఇవ్వటం లేదని పార్టీ అధ్యక్షుడు జగన్‌ క్లాస్‌ తీసుకున్నట్టు సమాచారం. జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లతో పాటు పార్లమెంట్ పరిశీలకులతో సమావేశం నిర్వహించిన జగన్… వారిలో కొంతమందికి క్లాస్ పీకారని చెప్పుకుంటున్నాయి వైసీపీ వర్గాలు. కొందరు పార్లమెంట్ పరిశీలకులు నియోజకవర్గాల్లో తిరిగి జరుగుతున్న వాస్తవ పరిస్ధితులపై ఇచ్చిన నివేదికలకు, జిల్లా అధ్యక్షుల నివేదికలకు పొంతన లేదని.. కొన్ని చోట్ల ఇప్పటికీ ఉన్న గ్రూపుల సమస్యలను పరిష్కరించలేకపోతున్నారని పార్టీ అధ్యక్షుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

Police Constable Fraud: చీటీల పేరుతో జనానికి కుచ్చుటోపీ పెట్టిన ఖాకీ..

బూత్ లెవల్ కమిటీల ఏర్పాటుతో పాటు పార్టీ నిర్మాణం కూడా అనుకున్న సమయానికి పూర్తి కావాలని.. అలా కాకుండా అప్పటికప్పుడు చూద్దాంలే అనుకుంటూ… బూత్ కమిటీల్లో ఎవరో ఒకరి పేర్లు పెట్టేసి చేతులు దులుపుకుంటే… తర్వాత కఠిన చర్యలుంటాయని ముఖ్య నాయకుల్ని హెచ్చరించారట జగన్‌. కొంతమంది నియోజకవర్గాల ఇన్ఛార్జ్‌లతో పాటు జిల్లా అధ్యక్షుల పనితీరు కూడా సరిగా లేదని, గ్రామాల్లో తిరగకుంటే…సమాచారం ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించినట్లు తెలిసింది. పార్టీ మీద ఫోకస్ చేయని వారి విషయంలో ఇక ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవడం ఉండబోదని, పనిచేసే వారికే పెద్దపీట వేస్తామని క్లియర్‌గా, క్లారిటీగా చెప్పేసినట్టు సమాచారం.

ఓవైపు పార్టీని బలోపేతం చేసుకోవటంతో పాటు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాల్సి ఉంటుందని.. అందుకు అందరూ రెడీగా ఉండాలని దిశానిర్దేశం చేశారట జగన్‌. తాను అంతర్గతంగా సర్వేలు చేయించుకుని తెప్పించుకున్న నివేదికలతో…. పార్లమెంట్ పరిశీలకులు, జిల్లా అధ్యక్షులు ఇచ్చిన నివేదికల్ని పోల్చి చూసుకుని తేడాగా ఉన్న వాళ్ళకు సీరియస్‌ క్లాస్‌ ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. కొందరు నేతలు అసలు పార్టీ కార్యక్రమాలకు కూడా సరిగా హాజరుకావటం కావటం లేదని.. మరికొందరు వెళ్ళినా ఏదో.. మమ అనిపిస్తున్నారు తప్ప అవసరమైన స్థాయిలో బూస్టప్ తీసుకురాలేకపోతున్నారంటూ కుండబద్దలు కొట్టేశారట వైసీపీ అధ్యక్షుడు.

అలాంటి వారితో సమన్వయం చేసుకుని పార్టీ కార్యక్రమాలు స్పీడప్‌ చేయటంతో పాటు ఎప్పుడూ జనాల్లోకి వెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించినట్టు తెలిసింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్‌లు ప్రజల్లోకి ఎన్నిసార్లు వెళ్ళారు.. పార్టీ అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లు ఎన్నిసార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించారు వంటి డేటాను ముందు పెట్టుకుని మరీ… ఎవరి పనితీరేంటో నా దగ్గర ఫుల్‌ రిపోర్ట్స్‌ ఉన్నాయని చెప్పినట్టు తెలిసింది. దీంతో ఇచ్చిన డెడ్ లైన్‌ లోపు పనితీరు మార్చుకోని నియోజకవర్గాల ఇన్ఛార్జ్‌లను మార్చే అవకాశం ఉందని భావిస్తున్నాయి వైసీపీ వర్గాలు. అయితే… గత సమావేశాలకు భిన్నంగా ఈ మీటింగ్‌ జరగటంతో… చివరి అవకాశంగా నేతలకు క్లారిటీ ఇచ్చినట్టు భావిస్తున్నారు.

Hyderabad Tragedy: అలసిపోయిన అమ్మ.. చిన్న కొడుకు కళ్లెదుటే దారుణం!

కొందరు నేతలు బయటకు కూడా రాకుండా తూతూ మంత్రంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, పనిచేయని వారిని పక్కన పెట్టేయటమే మేలన్న అభిప్రాయం వ్యక్తమవుతోందట పై స్థాయిలో. జగన్ క్లాస్ తర్వాత నేతల పనితీరు మారుతుందా.. మారని నేతలపై ఆయన చెప్పినట్లు టైంవేస్ట్ ప్రోగ్రాం లేకుండా యాక్షన్ స్టార్ట్ అవుతుందా.. జగన్ లెక్క ఎలా ఉండబోతోందన్నది చూడాలంటున్నారు పొలిటికల్‌ పండిట్స్‌.

Exit mobile version