Chevireddy Bhaskar Reddy : ఆ నియోజక వర్గంలో ఎమ్మెల్యే పిలిచినా కేడర్ కాలుబయట పెట్టడంలేదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chevireddy Bhaskar Reddy : ఎమ్మెల్యే అందుబాటులో లేకపోయినా.. అక్కడ కేడర్ ఫుల్ జోష్‌లో ఉండేది. అలాంటిది ప్రస్తుతం ఎక్కడివాళ్లు అక్కడే గప్‌చుప్. ఎమ్మెల్యే పిలుపి ఇచ్చినా.. కాలు బయట పెట్టడం లేదట. సమస్య తెలుసుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టినా.. పార్టీ శ్రేణుల నుంచి కదలిక ఉంటుందా అన్నది పెద్ద ప్రశ్న. ఆ నియోజకవర్గం ఏంటో.. ఎక్కడో ఈ స్టోరీలో చూద్దాం.
చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి బాస్కర్ రెడ్డి. ఎమ్మెల్యేగా వరసగా రెండుసార్లు గెలిచి లోకల్‌గా పట్టుసాధించారు. ఆయనలానే కేడర్ కూడా దూకుడే. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం భాస్కరరెడ్డి పిలుపు ఇస్తే చాలు కేడర్ వాలిపోయేది. అలాంటి చంద్రగిరి వైసీపీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా నైరాశ్యం కనిపిస్తోందట. మునుపటి జోష్ లేదన్నది పార్టీ వర్గాలు చెప్పేమాట. వైఎస్ఆర్ వర్ధంతి.. జయంతి.. సీఎం జగన్ పుట్టినరోజు.. వైసీపీ ప్లీనరీలు ఇలా కార్యక్రమం ఏదైనా గతంలోలా ఉత్సాహంగా పాల్గొనలేదని చంద్రగిరిలో అధికారపార్టీ శ్రేణులు కోడై కూస్తున్నాయి.
Also Read
పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో ఎమ్మెల్యేకు.. పార్టీ కేడర్‌కు మధ్య మొదలైన దూరం ప్రస్తుతం చాలా పెరిగిందట. మొదటి నుంచి వైసీపీ జెండా భుజానకెత్తుకున్న వారిని కాదని కొత్తగా పార్టీలో చేరిన వారికి పదవులు కట్టబెట్టడం సమస్య తెచ్చిపెట్టిందని టాక్. పదవులు పొందినవాళ్లు వాటిని అలంకార ప్రాయంగా చూస్తున్నారే తప్ప ఇతర కార్యక్రమాలేవీ పట్టించుకోవడం లేదట. ఇంకొందరు తమకు ఇష్టం లేని పోస్టులు ఇచ్చారని మౌనంగా ఉంటున్నారట. ఇలా ఎవరికి వారు తమకున్న సమస్యలతో మౌనవ్రతం పాటిస్తూ గ్యాప్ మెయింటైన్ చేయడం చర్చగా మారింది.
అయితే కేడర్ ఏవిషయంలోనైనా భయపడుతుందా అనే ప్రశ్నలు ఉన్నాయట. కరోనా సమయంలో ఆనందయ్య మందులు పంపిణీని భారీ ఎత్తున చేపట్టారు ఎమ్మెల్యే చెవిరెడ్డి. మూడు రాజధానులకు మద్దతుగా నారావారి పల్లెలో భారీ కార్యక్రమం చేపట్టి చర్చల్లో నిలిచారు. ఆ తర్వాతే సీన్ మారిపోయింది. ఏ కార్యక్రమం చేపట్టినా.. అధికారులు.. వేళ్లపై లెక్కపెట్టే నేతలు తప్ప పెద్దగా ఎవరూ ముందుకు రావడం లేదట. చివరకు ఎమ్మెల్యే కార్యాలయంలోనూ సందడి లేదని చెవులు కొరుక్కుంటున్నారు.
చంద్రగిరి వైసీపీలో వర్గపోరు ఎక్కువైందనే వాదనా ఉంది. అలాగే చేసిన పనులకు బిల్లులు రాక కొందరు.. అప్పులు చేసి వడ్డీలకు వడ్డీలు కట్టలేక మరికొందరు ఆర్థికంగా నలిగిపోతున్నారట. ఆ విషయాన్ని బయటకు చెప్పుకోలేక.. మింగలేక కక్కలేక ఉన్నారట. అందుకే ఎమ్మెల్యేతోనూ అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నట్టు చెబుతున్నారు. ఇటీవల కాలంలో వచ్చిన ఉపఎన్నికల హడావిడిలో ఎమ్మెల్యే చెవిరెడ్డి ఉండిపోవడం కూడా సమస్య తీవ్రతను పెంచిందనే అభిప్రాయం కొందరు నేతల్లో ఉందట. ఆలస్యంగానైనా సమస్య ఎమ్మెల్యే దృష్టికి వెళ్లడంతో ఆయన ఉలిక్కి పడ్డారట. ఇలాగే వదిలేస్తే.. చంద్రగిరిలో పట్టుకోల్పోతామనే ఆందోళనతో పరిస్థితులు చక్కదిద్దే పనిలో పడ్డారట.
అసంతృప్తితో ఉన్న చంద్రగిరి వైసీపీ నేతల జాబితాను సిద్ధం చేసినట్టు సమాచారం. అలాగే పదవుల విషయంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు ఉన్నాయో.. వ్యక్తం చేశారో తెలుసుకుంటున్నారట. వారితో మాట్లాడి పరిస్థితిని చక్కిదిద్దే పనిలో ఉన్నారట. మరి.. ఈ ప్రయత్నాలు ఎమ్మెల్యే చెవిరెడ్డికి ఏ మేరకు అక్కరకు వస్తాయో.. కేడర్ ఎంత వరకు సంతృప్తి చెందుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Story Board : ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లేనట్లేనా ?
-
Harish Rao : కరువు ముందే తెలుసు కదా.. నీళ్లెందుకు నిల్వ చేయలేదు.?
-
Off The Record: నామినేషన్ల వరకు హడావుడి.. ఆ తర్వాత హ్యాండ్సప్.. సీన్లోకి వస్తారనుకుంటే సైలెంట్ అయ్యారా?
-
OTR: కూటమి కంచుకోటలో అలజడి రేగుతోందా
-
Prabhas Fauzi Glimpse: హిట్లర్‌కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!