NTV Telugu Site icon

సీపీఐ నారాయణ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేస్తారా?

CPI నారాయణ స్టయిలే వేరు. ఎప్పుడు ఎక్కడ ఉంటారో.. ఎవరి మీద విరుచుకుపడతారో ఎవరికీ అర్థం కాదు. అలాంటి నారాయణకు ఒక్కటే కోరిక మిగిలిపోయిందట. ఇప్పటికీ అది అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఈసారి మాత్రం గట్టిప్లాన్‌తో వర్కవుట్‌ చేయాలని అనుకుంటున్నారట ఆ కామ్రేడ్‌.

అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నుంచి పోటీ చేయాలని కలలు!

సీపీఐ నారాయణ ఏం చేసినా సంచలనమే. ఆయన చేసిన పనులు క్షణాల్లో వైరల్ అవుతాయి. తాజా రాజకీయ పరిణామాలపై స్పందిస్తు మెయిన్ స్ట్రీమ్‌లో ఉంటారు. కానీ.. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి నెగ్గాలన్న కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది. గతంలో చాలా ఎన్నికల్లో బరిలో నిలిచినా ఫలితం దక్కలేదు. 1999 తిరుపతి ఎమ్మెల్యేగా.. అదే తిరుపతి మున్సిపల్ చైర్మన్‌గా కూడా గతంలో పోటీ చేశారు. 2014 ఎన్నికల్లో తెలంగాణలోని ఖమ్మం నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లోనైనా అసెంబ్లీలో కాలుపెట్టి అధ్యక్షా అనాలని కలలు కంటున్నారట నారాయణ. దీనికోసం సొంత ఊరున్న నగరి నియోజకవర్గంపై నారాయణ కన్నేశారనే టాక్ చిత్తూరు పొలిటికల్‌ సర్కిల్స్ ఓ రెంజ్‌లో నడుస్తోంది. నగరిలో రోజా వైసీపీ నుంచి పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. మూడోసారి ఆమెకు అవకాశం ఇవ్వకుండా తాను ఎంటర్ అవ్వాలనే ఆలోచనలో నారాయణ ఉన్నారట.

Read: మనసున్న మనిషి… సోనూ సూద్!

సొంతూరు ఐనంబాకలోనే ఉంటున్నారట
ఉపాధి కూలీలతో ముచ్చట్లు… నగరి చుట్టుపక్కలే ధర్నాలు!

ప్రత్యర్థులపై మాటల తూటలు పేల్చే ఇద్దరు నేతలు నేరుగా తలపడితే ఎలా ఉంటుందనే చర్చ అప్పుడే నగరిలో మొదలైంది. నగరిలో పోటీకోసమే ఈ మధ్య నారాయణ ఎక్కవగా సొంతూరైన నగరి మండల ఐనంబాకంలో ఉంటున్నారట. దానికి తగ్గట్టు వరసగా నగరి, తిరుపతి, చిత్తూరు కేంద్రంగానే ధర్నాలు, ఆందోళనలతో రచ్చ చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం నగరిలో ఉపాధి కూలీగా మారారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆయన అక్కడి కూలీలతో కలసి పనిచేశారు. ఉపాధి హామీ కూలీల కష్టాలు తెలుసుకోవడానికే పనిలో పాల్గొన్నానని నారాయణ చెప్పుకొన్నారు. ఆపై నగరిలో ఓ ఫ్యాకర్టీ తెరిపించాలంటూ ధర్నాకు దిగారు. మామిడి రైతుల కోసం చిత్తూరు కలెక్టరేట్‌ వద్ద.. పెట్రోలు ధరలపై తిరుపతిలో ధర్నాలు చేశారు. ఇలా చెప్పుకొంటూ పోతే నగరితోపాటు చూట్టుపక్కల ప్రధాన ప్రాంతాలలో ధర్నాలకు చేపట్టారు నారాయణ. నగరిలో ఇంటిలో ఉన్న సమయంలోను అక్కడి ప్రజలతో మాట్లాడుతూ టచ్ ఉంటున్నారు. వారి సమస్యలను పరిష్కరిస్తూన్నారని సమాచారం.

నగరిలో సొంత సామాజికవర్గం ఓట్లు కలిసి వస్తాయా?

నగరిలోని బలమైన తన సామాజికవర్గం ఓటర్లు ఎక్కవగా ఉండటంతో అది కూడా ప్లస్‌ అవుతుందని ఆయన సన్నిహితులు అనుకుంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో సీపీఐ ఒంటరిగా పోటీ చేసింది. ఈసారి ఆ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో తెలియదు. పొత్తు ఉన్నా.. లేకున్నా.. నారాయణ పోటీకి దిగడానికి సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరి.. ఈ కమ్యూనిస్ట్‌ సీనియర్‌ నేత ఆలోచన ఎలా ఉందో చూడాలి.

https://www.youtube.com/watch?v=68g40VmjCcQ