NTV Telugu Site icon

Etela Rajender : ఆ ఎమ్మెల్యే అసెంబ్లీ సమావేశాలకు ఎందుకు దూరంగా ఉన్నారు..?

Etela Rajendra

Etela Rajendra

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అసెంబ్లీ సమావేశాలకు ఎందుకు వెళ్లలేదు? ఆయనకు అందిన సమాచారం ఏంటి? ముందు జాగ్రత్త పడ్డారా.. లేక ఇంకేదైనా కారణం ఉందా? రాజకీయ వర్గాల్లో చర్చగా ఉన్న ఆ అంశం ఏంటి? లెట్స్‌ వాచ్‌..!

తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం వర్సెస్‌ బీజేపీ ఎమ్మెల్యేలు అన్నట్టు ఉంది. గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బిజెపి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. ఈ అసెంబ్లీ సెషన్ కి అనుమతి ఇస్తారా లేదా అనే ఉత్కంఠ కనిపించింది. అయితే బీజేపీ శాసనసభ్యులు మొదటి రోజు సమావేశానికి హాజరు అయ్యారు. కాకపోతే bac మీటింగ్‌కు బీజేపీకి ఆహ్వానం పంపలేదు. దీంతో ఎమ్మెల్యేలు సభాపతిని, ప్రభుత్వాన్ని టార్గెట్‌గా కొన్ని కామెంట్స్‌ చేశారు. అసెంబ్లీ స్పీకర్‌పై ఈటల వాడిన పదజాలంపై అధికారపక్షం తీవ్రంగా మండిపడింది. ఈటల క్షమాపణ చెప్పాలని మంత్రి ప్రశాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. లేదంటే చర్యలు ఉంటాయని చెప్పారు. అయితే క్షమాపణకు ససేమిరా అన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు.

శాసన సభ సమావేశాలు తిరిగి ప్రారంభమైన సందర్భంగా బీజేపీ సభ్యులపై మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. సభ నుంచి ఈటలను సస్పెండ్‌ చేస్తారని.. సభలోకి రానివ్వకపోవచ్చని అసెంబ్లీ వర్గాల్లో టాక్‌ వినిపించింది. పోలీసులు కూడా భారీగానే మోహరించారు. ఆ సమాచారం అందడం వల్లే ఈటల అసెంబ్లీకి రాలేదని తెలుస్తోంది. ఈటల కూనడా తనను సస్పెండ్‌ చేస్తారని భావించి ఉంటారని పార్టీ వర్గాలు అనుకుంటున్నాయట. అందుకే అసెంబ్లీకి వెళ్లడం ఎందుకు అని భావించి దూరంగా ఉన్నట్టు కొందరు విశ్లేషిస్తున్నారు. అయితే శాసనసభ సమావేశాల్లో ఆ విషయమే ప్రస్తావనకు రాలేదు.

తాజా సమావేశాల్లో ఇద్దరు ఎమ్మెల్యేలలో రఘునందన్‌ రావు మాత్రమే శాసన సభకు వచ్చారు. అలా అని ఈటల ఇంటికో.. హైదరాబాద్‌కో దూరంగా లేరు. బీజేపీ ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభ సభలో పాల్గొన్నారు. ఆ సభలో తీవ్ర విమర్శలే చేశారు. అంతేకాదు.. సినీ నటుడు.. కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు అంత్యక్రియల్లోనూ ఈటల పాల్గొన్నారు. సంజయ్‌ పాదయాత్ర సందర్భంగా సూరారంలో నిర్వహించిన బీజేపీ సభలో సీఎం కేసీఆర్‌ లక్ష్యంగా మరోసారి మాటల దాడి చేశారు ఈటల. అదీ అసెంబ్లీ అంశం బ్యాక్‌డ్రాప్‌లోనే ఆ వ్యాఖ్యలు ఉండటంతో.. సభకు రాకపోవడానికి.. ఆయన స్పందించిన దానికి లింక్‌ ఉందనే చర్చ నడుస్తోంది.

 

తాజా పరిణామాలు చూశాక.. ఈటల ఎపిసోడ్‌ ఎలాంటి మలుపు తిరుగుతుందో అనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో పెరుగుతోంది. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.