Annamreddy Adeep Raj :ఆ నియోజకవర్గంలో ఎవరు గెలిచినా.. ఆ ఒక్కసారికే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Annamreddy Adeep Raj : Whoever wins in that constituency.. Only for that time..!
ఆ నియోజకవర్గానికి ఓ సెంటిమెంట్ ఉంది. అక్కడ ఎవరు గెలిచినా వన్‌టైమ్ సెటిల్ మెంట్ తప్ప సెకండ్ చాన్స్ ఉండదని చెబుతారు. ప్రస్తుత ఎమ్మెల్యేకూ ఆ గండం తప్పదనే ప్రచారం జరుగుతోంది. టికెట్ ఆశిస్తున్న సీనియర్ నేత సీన్లోకి రావడంతో ఎమ్మెల్యే ఫస్ట్రేషన్ పీక్స్‌కు వెళ్లినట్టు టాక్. అదెక్కడో ఈ స్టోరీలో చూద్దాం.
Also Read
అన్నంరెడ్డి అదీప్ రాజు. విశాఖ జిల్లా పెందుర్తి వైసీపీ ఎమ్మెల్యే. 2019లో ఆయన్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించే వరకు అదీప్ గురించి పెద్దగా ఎవరికీ అవగాహన లేదు. కానీ.. వైసీపీ వేవ్‌లో ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. టీడీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి బండారు సత్యానారాయణ మూర్తిని ఓడించడంతో హైలైట్ అయ్యారు అదీప్ రాజు. చిన్న వయసులో ఎమ్మెల్యే అయినప్పటికీ.. మూడేళ్లుగా నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసుకోవడంలో విఫలం అయ్యారనే ప్రచారం జరుగుతోంది. గ్రూపు రాజకీయాల వల్ల పెందుర్తిలోని వైసీపీ సీనియర్లు ఎమ్మెల్యేకు దూరంగా జరిగారు.
జనాల్లోకి వెళ్లకపోవడం.. ప్రభుత్వ పథకాలు కొందరికే అందుతున్నాయనే అపవాదుతో అదీప్‌రాజుపై వ్యతిరేకత పెరిగిందని చెబుతున్నారు. రెండున్నరేళ్ల తర్వాత పెందుర్తిలో ఎమ్మెల్యే పాదయాత్ర చేపట్టినా.. అది ప్రచారానికే పరిమితమైందనే టాక్ ఉంది. ఎమ్మెల్యే బంధువుల దందాలపై టీడీపీ ప్రశ్నలు.. రాజకీయ సెగలు రేపుతున్నాయి. రాతి చెరువు విషయంలో ఆరోపణలు గుప్పుమంటున్నాయి. తాడితానం గ్రామాన్ని కాలుష్యం నుంచి 15 రోజుల్లో చర్యలు చేపట్టి బయట పడేస్తామని విశాఖ సభలో సీఎం జగన్ చెప్పినా.. ఆ సమస్య పరిష్కారం దిశగా అదీప్ రాజు చొరవ తీసుకోలేదనే విమర్శలు ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు ఎమ్మెల్యేకు మైనస్ మార్కులు వస్తున్నాయని.. గ్రాఫ్ పడిపోవడంతో వచ్చే ఎన్నికల్లో టికెట్ కష్టమనే ప్రచారం జోరందుకుంది.
కాపు ఓటింగ్ ఎక్కువగా వున్న స్ధానం కావడంతో ఇక్కడ ప్రత్యామ్నాయం వెతుక్కోవడం అనివార్యమని వైసీపీ ఆలోచన చేసినట్టు భోగట్టా. అంతే మాజీ శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ బాబు సీన్లోకి వచ్చారు. 2009లో ప్రజారాజ్యం తరపున పెందుర్తి నుంచి… 2014లో యలమంచిలి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన పంచకర్ల.. ఇటీవల సీఎం జగన్‌ను కలిసి వచ్చారు. ఆ తర్వాత పెందుర్తిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు కూడా. అయితే పంచకర్ల హడావిడిపై ఎమ్మెల్యే అదీప్ రాజుకు చిర్రెత్తికొస్తోందట. అది కాస్తా బయట పెట్టేసుకున్నారు. పంచకర్లపై సెటైర్లు పేల్చారు. పంచకర్లను తాము వైసీపీ నేతగా పరిగణించడం లేదని.. తాము జగన్ సైనికులమైతే.. ఆయన జనసైనికుడని కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ఎమ్మెల్యేపై వైపీసీ పెద్దలు సీరియస్ అయ్యారట. ఉమ్మడి జిల్లాల వైసీపీ సమన్వయ కర్తగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లారట పంచకర్ల. దాంతో అదీప్ రాజును సుబ్బారెడ్డి గట్టిగా మందలించినట్టు ప్రచారం జరుగుతోంది.
ఇంకోవైపు అదీప్ రాజు అభ్యర్థి అయితే వచ్చే ఎన్నికల్లో తమ గెలుపు ఖాయమని టీడీపీ నేతలు లెక్క లేస్తున్నారట. దాంతో వైసీపీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయని సమాచారం. మొత్తానికి పెందుర్తి ఎపిసోడ్లో మొగుడు కొట్టినందుకు కాదు.. తోటికోడలు నవ్వినందుకు ఎక్కువ బాధపడినట్టుగా ఉందని ఎమ్మెల్యేను ఉద్దేశించి పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు వైసీపీ నేతలు.
తాజావార్తలు
-
Ram pothineni : Rapo 23 కోసం రూత్ లెస్ విలన్
-
Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్‌షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
-
Investment Tips: హోమ్ లోన్ తీర్చాలా? ఇన్వెస్ట్ చేయాలా? చేతికి బోనస్ వస్తే ఏది బెస్ట్ ఆప్షన్! నిపుణులు చెబుతున్నది ఇదే..
-
Ishan Kishan Celebration: స్టేడియం ఖాళీ చేయండి, ఇంటికి వెళ్లిపోండి.. సీఎస్కే అభిమానులను అవమానించిన ఇషాన్ ఇషాన్!
-
Chand Mera Dil: అనన్యా పాండే మూవీకి సెన్సార్ షాక్..10 సెకన్ల కిస్ సీన్ డిలీట్
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!