NTV Telugu Site icon

Off The Record: తెలంగాణ కాంగ్రెస్‌ ప్లానింగ్‌ రొటీన్‌కి భిన్నంగా ఉండబోతోందా?

Off The Record: తెలంగాణ కాంగ్రెస్ ఇప్పటికే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టింది. షెడ్యూల్ వచ్చాక అగ్ర నాయకులందరినీ తిప్పాలని డిసైడ్ అయింది. ఇక్కడ కూడా కర్ణాటక తరహాలోనే కాంగ్రెస్ ముఖ్య నాయకులందరితో ముమ్మరంగా ప్రచారం చేయించాలని నిర్ణయించింది. రాహుల్ గాంధీ, ప్రియాంకల ప్రచార పర్వం మొదలైపోయింది. మహిళా సమస్యలపై ములుగు సభలో చర్చించారు ఇద్దరు అగ్రనేతలు. ఇదే వేదిక నుంచి మహిళలకు భరోసా ఇచ్చింది కాంగ్రెస్. ములుగు సభ తర్వాత ప్రియాంక ఢిల్లీ వెళ్ళగా…. రాహుల్ వరుసగా మూడు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. ఇప్పటికే ఆరు గ్యారెంటీల పేరుతో జనంలోకి వెళ్ళింది కాంగ్రెస్‌. సోనియా గాంధీ వాటిని ప్రకటించగా… రాహుల్‌, ప్రియాంకల టూర్‌తో ప్రచారాన్ని పీక్స్‌లోకి తీసుకువెళ్ళే ప్లాన్‌లో ఉంది పార్టీ. ములుగు నుంచి మొదలుపెట్టిన బస్సు యాత్ర నిజామాబాద్ వరకు కొనసాగనుంది.

పార్టీ బలహీనంగా ఉందని చర్చ జరుగుతున్న కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో మొదటి విడత ప్రచారాన్ని ప్రారంభించింది. ఆరు గ్యారెంటీల హామీ జనంలోకి వెళ్ళిందని నమ్ముతున్న టి కాంగ్రెస్‌… అగ్ర నేతల టూర్‌తో బూస్ట్‌ ఇవ్వాలనుకుంటోంది. అయిుతే… అదే సమయంలో ప్లాన్‌ ఎంతవరకు వర్కౌట్‌ అవుతుందన్న సందేహాలు కూడా ఉన్నాయట కొందరిలో. తెలంగాణ వాదానికి ఛాంపియన్‌గా ఇప్పటికే బీఆర్‌ఎస్‌కు ప్రొజెక్షన్‌ వచ్చి ఉన్నందున… రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా మాకో అవకాశం ఇవ్వండని కాంగ్రెస్‌ చేస్తున్న విన్నపాన్ని జనం నమ్ముతారా అన్న డౌటే అందుకు కారణం అంటున్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం కాంగ్రెస్ గ్రాఫ్ బాగానే పెరిగిందంటున్నారు పరిశీలకులు. అయినా అది అధికార పీఠందాకా తీసుకెళ్తుందా అన్న విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదంటున్నారు.

ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ హామీలను టార్గెట్‌ చేస్తోంది టి కాంగ్రెస్‌. నిరుద్యోగుల అంశాన్ని ఎందుకు మేనిఫెస్టోలో పెట్టలేదంటూ… ఆ వర్గాన్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నంలో ఉంది. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలకు కొంత మొత్తాన్ని అదనంగా జత చేసి గతంలో పథకాలు ప్రకటించిన బీఆర్‌ఎస్‌…. నిరుద్యోగుల విషయంలో అలా ఎందుకు చేయలేకపోయిందన్నది టి కాంగ్రెస్‌ క్వశ్చన్‌. సానుకూల అంశాలను ఎక్కడా వదలకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు అగ్రనేతల సభలతో దూసుకుపోవాలన్నది పార్టీ ప్లాన్‌గా కనిపిస్తోంది. రాహుల్, ప్రియాంక ఇద్దరూ పూర్తిస్థాయిలో తెలంగాణ ఎన్నికల ప్రచారాన్ని తమ భుజాల మీద వేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనికి తోడు పోలింగ్‌ టైం దగ్గరపడుతున్నప్పుడు ఒక భారీ బహిరంగ సభ పెట్టి సోనియాను ఆహ్వానించాలని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ఒకసారి అధికారం ఇవ్వమని ఆమెతోనే అప్పీల్‌ చేయించాలన్న ప్లాన్‌ ఉన్నట్టు తెలిసింది. లోక్‌సభ ఎన్నికలు కూడా సమీపిస్తున్న టైంలో… తెలంగాణలో గెలిచి సానుకూల వాతావరణాన్ని సృష్టించుకోవడం చాలా అవసరం అని భావిస్తున్న కాంగ్రెస్‌ ప్లాన్స్‌ ఏ మేరకు వర్కౌట్‌ అవుతాయో చూడాలి. అన్నిటికీ మించి రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా మాకో అవకాశం ఇవ్వండన్న విన్నపాన్ని జనం ఎలా రిసీవ్‌ చేసుకుంటారన్న ఆసక్తి పెరుగుతోంది.

Telangana Congress Bus Yatra Day 2 | Rahul Gandhi | Priyanka Gandhi | NTV