NTV Telugu Site icon

TDP : కొంత జిల్లాలో పార్టీ అధినేతకు నాయకులు కనపడటం లేదా..?

Chitoor

Chitoor

సొంత జిల్లా చిత్తూరులో సత్తాచాటాలని కసితో ఉన్నారు టిడిపి అధినేత చంద్రబాబునాయుడు. గత ఎన్నికలలో 14 స్దానాలకుగాను 13చోట్ల గెలిచి టిడిపికి షాక్ ఇచ్చింది వైసిపి. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీడీపీని కోలుకోని విధంగా దెబ్బకొట్టింది అధికార పార్టీ. ఇక అప్పటి నుండి సొంత జిల్లాలో పట్టుసాదించాలని సీరియస్‌గానే దృష్టి పెట్టారట చంద్రబాబు. తిరుపతి, చిత్తూరు, కుప్పం, పలమనేరు, నగరి, సత్యవేడు, శ్రీకాళహస్తీ లాంటి నియోజకవర్గాలు పార్టీకి కంచుకోటగా ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాల్లో చాలాచోట్ల ఇంఛార్జ్‌లు లేకుండానే పార్టీ నడుస్తోంది. ఉన్న ఇంచార్జ్ లు వద్దు అన్నా.. చేసేది లేక పాత వారినే కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. టిడిపి నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ అని చెప్పుకునే పార్టీ పెద్దలు.. ప్రస్తుతం జిల్లాలో నాయకుల కోసం వెతుకులాడే పరిస్థితి వచ్చిందని చర్చ జరుగుతోంది.

కుప్పం, పలమనేరు ,నగరి,శ్రీకాళహస్తీ,పీలేరు,చంద్రగిరి,పుంగనూరులో ఇంఛార్జీలతో పార్టీ పటిష్టంగా ఉంది. మదనపల్లెలో ప్రస్తుత ఇన్ చార్జ్ దోమ్మలపాటి రమేష్, తంబళ్ళపల్లె ఇం చార్జ్ మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్‌లను పార్టీ కేడర్‌ తీవ్ర స్ధాయిలో వ్యతిరేకిస్తోంది. వాళ్లు వద్దు అని కేడర్‌ మొత్తుకుంటోందట. అయినా ఇప్పటికిప్పుడు మార్చే పరిస్థితి లేదని.. పార్టీ వారినే కోనసాగిస్తోందని తెగ ఆవేదన చెందుతున్నారట తెలుగు తమ్ముళ్లు. జిడి నెల్లూరు ఇన్ చార్జ్ ఉన్నా… ఎన్నికల నాటికి ఎమ్మెల్యే అభ్యర్థి కోసం వెతకాల్సిన పరిస్థితి. సత్యవేడు,పూతలపట్టు,చిత్తూరులో ఇన్ చార్జ్ లు లేరు. ఇక్కడ ఇంచార్జ్‌ల కోసం గాలిస్తున్నరట. జిల్లాలో చాలా చోట్ల పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలే అయినా.. పార్టీని నడిపించేవారే కంపించడం లేదనేది.. టీడీపీ వర్గాల్లో టాక్‌. తిరుపతి కంచుకోట అయినా ఇం చార్జ్ సుగుణమ్మపై కేడర్‌ గుర్రుగా ఉందట. ఇక్కడ జెబి శ్రీనివాస్ సహా ఇతర సీనియర్ నేతలు మాకు ఒక అవకాశం ఇవ్వాలంటూ లోకేష్ వద్ద అప్లేకేషన్ లు కూడా పెట్టారట.

వచ్చే ఎన్నికలలో సీట్లు గెలవాలంటే.. సరైన ఇన్ చార్జ్‌లను ఇప్పుడే ప్రకటించాలని కేడర్‌ కోరుతోంది. సరైన నేతలు లేరంటూ జిల్లా సీనియర్ నేతలు చెప్పడం కూడా కేడర్‌కు నచ్చడం లేదట. మొత్తానికి చంద్రబాబు సొంత జిల్లాలో గెలుపు అంత ఈజీ కాదనే టాక్ సొంత పార్టీలోనే బలంగా వినపడతొందట. మరి, లీడర్లను తయారు చేసే పార్టీ అని చెప్పే నేతలు.. ఎలాంటి యాక్షన్‌ ప్లాన్‌ అమలు చేస్తారో చూడాలి.

 

కొంత జిల్లాలో పార్టీ అధినేతకు నాయకులు కనపడటం లేదా..? l Off the Record l NTV