సిక్కోలు లెక్కలు మారుతున్నాయా? పుర పోరులో ఈసారి పిక్చర్ కాస్త డిఫరెంట్‌గా కనిపిస్తోందా? కూటమి కంగారుగా కనిపిస్తుంటే…. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తోందా? ఏంటా కేలిక్యులేషన్స్? అధికారంలో ఉండి కూడా… కూటమి లీడర్స్ అంతో ఇంతో టెన్షన్ పడటానికి కారణాలేంటి?
శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నగారా మోగింది. రెండు దశాబ్దాలుగా ఇక్కడ ఎలక్షన్స్ లేకపోవడంతో… మెదటిసారి మేయర్ పీఠం చేజిక్కింకునేందుకు అధికార, ప్రతిపక్షాలు గట్టిగా పావులు కదుపుతున్నాయి. వరుస విజయాలు ఇచ్చిన జోష్‌లో ఉన్నాయి కూటమి పార్టీలు. అటు విపక్షం వైసీపీ కూడా… మా లెక్కలు మాకున్నాయని అంటోంది. దీంతో… పొలిటికల్ హీట్ గట్టిగా పెరుగుతోంది. శ్రీకాకుళం మేయర్ స్థానాన్ని బీసీ మహిళకు కేటాయించారు. అటు కూటమి పొత్తులో భాగంగా ఇది జనసేన కోటాకు వెళ్ళింది. దీంతో జిల్లాలో డాక్టర్‌గా మంచి పేరున్న జనసేన నేత దానేటి శ్రీధర్ భార్య రాధారాణి బరిలో దిగారు.
కూటమి వేవ్‌తో పాటు తమ సామాజిక వర్గం కాళింగ ఓట్ బ్యాంక్ కలిసి వస్తుందన్నది శ్రీధర్ లెక్క అట.జనసేనకు సీట్ కేటాయించడంతో టిడిపి నేతలు మెదట్లో గరం గరంగా ఉన్నా… ప్రస్తుతం సమన్వయం కుదిరిందని చెబుతున్నారు కూటమి నేతలు. టీడీపీ ఎమ్మెల్యే గోండు శంకర్ కూడా జనసేన అభ్యర్ది రాధా రాణి గెలుపు బాధ్యతను భుజాన వేసుకున్నారు. ఐతే శ్రీకాకుళం పట్టణంలో.. టిడిపికి మంచి పట్టు ఉన్నా, జనసేనకు కనీస క్యాడర్ కూడా లేదని ఆ పార్టీ నేతలే ఒప్పుకుంటున్న పరిస్థితి. దీంతో…మేయర్ ఎన్నిక డైరెక్ట్ కావడం, జనసేన అభ్యర్థి ఎలక్షన్‌కు కొత్త కావడం లాంటివి ఎలాంటి ప్రభావం చూపిస్తాయోనన్న ఆందోళన కూడా ఉందని అంటున్నారు.
ఇక వైసీపీ మాత్రం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో పాగా వేసేందుకు పక్కా లెక్కతో వెళ్తున్నట్టు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. అందుకు సామాజిక సమీకరణలు కూడా కలిసి వస్తాయంటున్నారు. విలీన పంచాయతీలైన కిల్లిపాలెం , ఖాజీపేట , పెద్దపాడు , పాత్రుని వలస , కుశాలపురం , తోటపాలెం గ్రామాల్లో అత్యధిక శాతం వెలమలు ఉన్నారని, అది అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవికి కలిసి వస్తుందని అంటున్నారట ఫ్యాన్ లీడర్స్. 60 డివిజన్లలో పార్టీ బలంగా ఉందని, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, లక్ష్మీదేవి వర్గాలు రెండూ కలిసి పనిచేస్తున్నందున గెలుపు మాదేనన్న ధీమా ప్రతిపక్షంలో కనిపిస్తోందని చెప్పుకుంటున్నారు.
దివంగత మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ శ్రీకాకుళం పట్టణానికి చేసిన సేవలకు ప్రజలు పట్టం కడతారన్నది వైసీపీ వాయిస్. ఇలా అన్ని విధాలా టైట్ చేసి ఎన్నికలను ఎదుర్కొనేందుకు ధర్మాన పక్కా స్కెచ్ వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇన్నేళ్ళు టీడీపీలో ప్రత్యర్థిగా ఉన్న గుండ లక్ష్మీదేవిని తమ పార్టీలోకి ఆహ్వానించడంతో పాటు రాజకీయంగా అండగా ఉంటామన్న హామీలు ఇవ్వడంలో ధర్మాన బ్రదర్స్ సక్సెస్ అయ్యారన్నది స్థానికంగా వినిపిస్తున్న మాట. ఇక్కడ టిడిపి ప్రత్యక్షంగా పోటీ చేయకపోవడం గుండకు కలసి వస్తుందని అంచనావేస్తున్నారు. ఆవిర్భావం నుంచి టిడిపినే నమ్ముకున్న తమకు అవమానం జరిగిందని, అందుకే మారిపోయానని గుండ లక్ష్మిదేవి అన్న మాటలు శ్రీకాకుళంలో గట్టిగానే పనిచేసే సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు పరిశీలకులు.
దశాభ్దాలుగా టీడీపీలోనే ఉన్న గుండ ప్యామిలీకి శ్రీకాకుళం పట్టనంలో అన్ని వర్గాలతో మంచి సంబంధాలే ఉన్నాయి. కేవలం సొంత సామాజికవర్గం వెలమే కాకుండా , కీరోల్ పోసిస్తున్న ఇతర కులాల నుంచి కూడా ఆమెకు సపోర్ట్ ఉందని భావిస్తున్నారు. అందులో భాగంగానే వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారట. యాదవ, శ్రీశయన, వైశ్య సామాజికవర్గాల్లో గుండ ఫ్యామిలీకి ఉన్న ఆదరణ తమను గెలుపు తీరానికి చేరుస్తుందని నమ్ముతున్నారు వైసీపీ నాయకులు. టీడీపీలోని ఓ వర్గం నేతలు కూడా పార్టీ మారినా…. మాజీ ఎమ్మెల్యేని సపోర్ట్ చేస్తున్నారని, ఇవన్నీ కలిసి వస్తే… సిక్కోలులో బోణీ కొట్టడం పెద్ద మేటర్ కాదన్నది లోకల్ వైసీపీ ఇన్సైడ్ టాక్.

