జిల్లా అధ్యక్ష పదవులపై టీఆర్‌ఎస్ నేతల్లో ఎన్నో ఆశలు మొలకెత్తాయి. అధిష్టానాన్ని చేరుకుని.. జిల్లా కుర్చీని సంపాదించడానికి ప్రయత్నాలూ స్టార్ట్ అయ్యాయి. రేపో, మాపో జిల్లా అధ్యక్షుల పేర్లు కూడా డిక్లేర్ అవుతాయని ఆశిసంచారు. కానీ! లాస్ట్ మినట్‌లో గులాబీ బాస్ వ్యూహం మారినట్టు తెలుస్తోంది. పార్టీకి జిల్లా స్థాయిలో అధ్యక్షుడు అవసరమా? అని లోచిస్తున్నట్టు తెలుస్తోంది. అధ్యక్షుడి స్థానంలో మరో పదవిని తీసుకురావాలని ఆలోచిస్తోంది. ఇంతకీ టీఆర్‌ఎస్ కొత్త వ్యూహం ఏంటి?
జెండా పండుగతో పార్టీ సంస్థగత నిర్మాణంను మొదలు పెట్టింది టిఆర్ఎస్. గ్రామ, మండల, మున్సిపాలిటీ లలో ఇప్పటికే పార్టీ కమిటీల ఏర్పాటు పూర్తయ్యింది. జిల్లా అధ్యక్షుల నియామకం చేపట్టాలనే ఆలోచన కూడా చేసింది గులాబీ పార్టీ. గతంలో జిల్లా స్థాయిలో పార్టీకి అధ్యక్షుడు ఉండాలా లేక కోఆర్డినేటర్ ఉండాలా అన్న అంశంపై కొంత కాలం చర్చ జరిగింది. ఆ అంశంపై చర్చకు ఫుల్ స్టాప్ పెడుతూ ఇటీవలే జిల్లాస్థాయిలో అధ్యక్షుల నియామకం ఉంటుందని ప్రకటించింది. కానీ! ఇప్పుడు మళ్లీ ప్లాన్‌ను మార్చుకుంది.
జిల్లాకు అధ్యక్షుడిని నియమించేకంటే, పార్టీ కో-ఆర్డినేటర్‌ను నియమించాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లా స్థాయిలో అధ్యక్షుడు ఉంటే, గ్రూపులు, వాటితో తగాదాలు వచ్చే ఛాన్స్ ఉందని, ఇది పార్టీపైన ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని టీఆర్‌ఎస్ భావిస్తోన్నట్టు సమాచారం. ఇటు టిఆర్ఎస్ మొదటి నుంచి నియోజకవర్గముకు ఎమ్మెల్యేనే సుప్రీం అని స్పష్టం చేస్తూ వస్తుంది. ఒక వేళ జిల్లా అధ్యక్షుల నియామకం చేపడితే, సమాంతరంగా మరో వ్యవస్థతో రాజకీయ సమస్యలు రావచ్చని టిఆర్ఎస్ తన వ్యూహాన్ని మార్చుకున్నట్టు చర్చ జరుగుతోంది.
టీఆర్‌ఎస్ కొత్త వ్యూహంపై పార్టీలో చర్చ మొదలైంది. గ్రూపు తగాదాల కోసమే పార్టీ వెనక్కి తగ్గిందా? లేక మరేదైనా రీజన్ ఉందా? అన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీలో చేరిన కొత్త నేతలతో, పాత నాయకులకు మధ్య గ్యాప్‌లున్నాయి. రాష్ట్రస్థాయి ప్రజా ప్రతినిధులు ఉన్న నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలున్నాయి. ఇవన్నీ పార్టీని ఇబ్బంది పెడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగా జిల్లా అధ్యక్షలు వస్తే లేనిపోని సమస్యలు కొనితెచ్చుకున్నట్టే అవుతుందని గులాబీ పార్టీ ఆలోచిస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.
జిల్లా అధ్యక్షుల నియామక ప్రకటనతో టిఆర్ఎస్లో ఆశావహులు ప్రయత్నాలు మొదలుపెట్టారు.నామినేటెడ్ పదవులు రాని నేతలు జిల్లా అధ్యక్ష పదవి కోసం తమకు తెలిసిన నాయకుల సాయంతో ప్రయత్నాలు చేసారు. మరి టిఆర్ఎస్ తాజా ఆలోచనతో అధ్యక్ష పదవులు ఆశించిన వారికి నిరాశే మిగిలే అవకాశం కనిపిస్తోంది.
