టీఎన్జీవో నేతల వైఖరిపై ఉద్యోగులు గుర్రు…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చాలా కాలంగా అందరూ ఆ సంఘాలనే టార్గెట్ చేస్తున్నారు. వాళ్లూ.. వీళ్లు చెప్పడమేంటి.. మా నాయకులు అంతే అన్నవారూ లేకపోలేదు. ఇప్పుడు సమస్యలను వదిలేసి.. సభలకు ప్లాన్ చేస్తుండటంతో మళ్లీ విమర్శలు మొదలయ్యాయి. ఇంతకీ ఏంటా సంఘాలు? అంతా ఎందుకు రుసరుసలాడుతున్నారు?
విపక్షాల విమర్శలపై ఉద్యోగ సంఘాల నేతలు మౌనం!
Also Read
తెలంగాణలో ఉద్యోగ సంఘాల తీరు ఇటీవల కాలంలో తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. గతంలో ఉద్యోగ సంఘాల నాయకులను ఏమైనా అనాలంటే.. ఏ పార్టీ నాయకులైనా వెనకా ముందు ఆలోచించేవారు. ఇప్పుడా గీతలు చెరిగిపోయాయి. విపక్ష పార్టీలు గట్టిగానే అందుకుంటున్నాయి. కాంగ్రెస్‌లో మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ మొదలుకుని మాజీ మంత్రి జీవన్ రెడ్డి.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి లాంటి వాళ్లంతా ఉద్యోగ సంఘాల నేతలను ఏకి పడేస్తున్నారు. ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల నేతలు వత్తాసు పలుకుతున్నారన్నది కాంగ్రెస్ నేతల ప్రధాన ఆరోపణ. ఒకప్పుడు ప్రభుత్వాలను శాసించి డిమాండ్లు సాధించుకున్న ఉద్యోగ సంఘాలు నేడు.. బెగ్గింగ్ స్థాయికి దిగజారిపోయాయని విమర్శల డోస్ పెంచారు జీవన్‌రెడ్డి. ఆ విమర్శలను పెద్దగా పట్టించుకోకుండా ఉద్యోగ సంఘాల నేతలు సైలెంట్‌గా ఉండిపోయారు. కానీ.. తాజగా చేసిన కొన్ని తీర్మానాలతో మళ్లీ చర్చల్లోకి వచ్చారు TNGO, టీజీవోల నాయకులు.
కరీంనగర్ నుంచి కృతజ్ఞతా సభలు పెడతారట!
30శాతం ఫిట్‌మెంట్ ఇవ్వడంతో ప్రభుత్వానికి కృతజ్ఞతగా రాష్ట్రవ్యాప్తంగా సభలు నిర్వహించాలని TNGO నిర్ణయించింది. కరీంనగర్ జిల్లా నుంచి సభలు మొదలుపెట్టాలని షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. ఫిట్‌మెంట్ ఇచ్చినందుకు సభలు పెట్టడం తప్పులేకపోయినా.. అది ఇచ్చి చాలా రోజులైంది. పైగా కరీంనగర్ నుంచి సభలు పెట్టడమంటే దానివెనక రాజకీయం కోణం ఉందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి పార్టీలు.
సమస్యలపై కొట్లాడకుండా..సభ లేంటని ఉద్యోగులు పెదవి విరుపు!
ఫిట్‌మెంట్‌లో అనేక కొర్రీలు ఉన్నాయన్నది ఉద్యోగుల ఆరోపణ. వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూనే.. సభలు పెట్టడం ఏంటన్న చర్చ ఆయా సంఘాల్లో ఉందట. ఉద్యోగులకు కార్పొరేట్ వైద్యం అందించాలనే డిమాండ్ చాలాకాలంగా ఉంది. PRCలో సూచించినట్టుగా వెంటనే జీవోలు విడుదల చేయాలని కూడా కోరుతున్నారు. జిల్లాల వారీగా ఉద్యోగుల విభజన.. పెరిగిన పనిభారం.. కొత్త ఉద్యోగాల భర్తీ.. ప్రమోషన్లు.. బదిలీలపై కొర్రీలు.. పొరుగు రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ ఉద్యోగులు.. కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు.. ఇలా అనేక ప్రాబ్లమ్స్ పెండింగ్‌లో ఉన్నాయన్నది ఎంప్లాయిస్ మాట. వీటిపై గట్టిగా కొట్లాడాల్సిన నాయకులు.. సభలు ప్లాన్ చేయడం ఏంటని TNGO, TGO సంఘాల్లోనే కొందరు పెదవి విరుస్తున్నారట. ఇంకేదో ఆశిస్తూ.. సంఘాల నాయకులు గట్టిగా అడగడం మానేశరని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పోకడలు ఆ అనుమానాలను బలపరిచేలా ఉన్నాయని చెవులు కొరుక్కుంటున్నారట ఉద్యోగులు.
ప్రభుత్వంతో ఘర్షణ కోరుకోని ఉద్యోగ సంఘాల నేతలు!
ఉద్యోగుల ఒత్తిడి ఎలా ఉన్నా.. ప్రభుత్వంతో ఘర్షణ వైఖరి కాకుండా.. స్నేహపూర్వంగా పని చేసుకోవాలన్నది TNGO, TGO నేతల ఆలోచనగా మరికొందరు చెబుతున్నారు. ఈ విషయంలో ఎవరి వాదన ఎలా ఉన్నా.. సమస్యలు గాలికొదిలేశారనే అభిప్రాయం ఉద్యోగుల్లో బలంగా నాటుకుపోయింది. ఇది గమనించిన విపక్ష పార్టీలు సైతం ఉద్యోగ సంఘాల నేతలను విమర్శించడానికి వెనకాడటం లేదట. మరి.. కృతజ్ఞతా సభలు మొదలయ్యాక ఇంకేం జరుగుతుందో చూడాలి.
- Tags
- telangana
- tngo
- tngo employees
తాజావార్తలు
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!