Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Special Focus On Kukatpally Zonal Commissioner Mamatha

బదిలీ ఆగడంపై చర్చల్లోకి వచ్చిన మమత…

Published Date :October 29, 2021 , 10:30 pm
By Manohar
బదిలీ ఆగడంపై చర్చల్లోకి వచ్చిన మమత…
  • Follow Us :
  • google news
  • dailyhunt

గ్రేటర్‌లో ఆ మేడమ్‌ స్పెషల్‌. మాములు స్పెషల్ కాదు.. వేరీ వేరీ స్పెషల్‌. బదిలీ అయినా.. గంటల్లోనే ఆ ఉత్తర్వులను మార్పించుకోగల ‘పవర్‌’ ఉందని నిరూపించారు. మరోసారి ఉద్యోగవర్గాల్లో చర్చగా మారారు ఆ అధికారి. ఉన్నచోటు నుంచి సీటు కదలకుండా పావులు కదిపిన ఆ మేడమ్‌ ఎవరు?

బదిలీ ఆగడానికి .. టీజీవో ప్రెసిడెంట్‌ పోస్టా? ఇంకేదైనా ఉందా?

వి. మమత. GHMCలో జోనల్‌ కమిషనర్‌. ఈ హోదా కంటే.. ఉద్యోగవర్గాల్లో మమత మరోరకంగా పాపులర్‌. తెలంగాణ గెజిటెడ్‌ సంఘం.. TGO అధ్యక్షురాలు. ఉద్యోగవర్గాల్లో మేడమ్‌ పవర్‌ ఫుల్‌ అని చెవులు కొరుక్కుంటారు కానీ.. ప్రభుత్వం ట్రాన్స్‌ఫర్‌ చేసినా.. ఆ ఉత్తర్వులు మార్పించుకోగలరని తాజాగా మరోసారి నిరూపించి చర్చల్లోకి వచ్చారు. ఇందుకు TGO అధ్యక్షురాలు అన్న హోదా కారణమా.. లేక ఇంకేదైనా ఉందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌.

మమత బదిలీ ఆగడంతో ఒక్కటే చర్చ..!

GHMCలో నాలుగు జోన్ల కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం 795 జీవో ఇచ్చింది. కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌గా ఉన్న మమతను ఎల్బీ నగర్‌ జోన్‌కు బదిలీ చేస్తున్నట్టు ఆ ఉత్తర్వుల్లో ఉంది. ఏమైందో ఏమో.. సాయంత్రానికి మరో 797 నెంబర్‌ జీవో బయటకు వచ్చింది. మమతను కూకట్‌పల్లిలోనే కొనసాగిస్తూ.. ఇక్కడకు రావాల్సిన పంకజ అనే మరో ఆఫీసర్‌ను ఎల్బీనగర్‌కు పంపారు. అంతే అప్పటి వరకు ట్రాన్స్‌ఫర్లు కామన్‌ అనుకున్నవారు కాస్తా.. ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆసక్తిగా చర్చించుకోవడం మొదలుపెట్టారు.

గతంలోనూ ఒకసారి ట్రాన్స్‌ఫర్‌పై రగడ..?

TGO ప్రెసిడెంట్‌గా అధికార, ఉద్యోగవర్గాల్లో మమత గురించి చర్చించుకున్నా.. ఈ దఫా మాత్రం బదిలీ ఆగడం ద్వారా ప్రత్యేక చర్చల్లోకి వచ్చారామె. బదిలీ ఆగడం.. కొత్త జీవోపై ప్రభుత్వ వర్గాల ఇచ్చే వివరణ ఉద్యోగులకు పెద్దగా కనెక్ట్ కావడం లేదట. ఎవరైనా ఈ మాట ప్రస్తావిస్తే.. ఇంకోమాట చెప్పండి.. అని సెటైర్లు వేస్తున్నారట. గతంలో కూడా డిప్యూటీ కమిషనర్‌ హోదాలో ఉన్నప్పుడు చందానగర్‌ నుంచి జూబ్లీహిల్స్‌కు బదిలీ చేస్తే అక్కడికి వెళ్లలేదట మమత. వెంటనే శేరిలింగంపల్లికి బదిలీ చేయించుకోవడంతో కొంత చర్చ జరిగింది. ఇప్పుడు మాత్రం అప్పటి చర్చను మించి చెవులు కొరుక్కుంటున్నారు ఉద్యోగ వర్గాలు.

కావాలని కుర్చీ కదిలించారా?

మేడమ్‌.. చాలా పవర్‌ఫుల్‌. ట్రాన్స్‌ఫర్‌ ఆగడానికి ఎక్కడ స్విచ్‌ నొక్కాలో బాగా తెలుసని ఒక్కటే గుసగుసలు. అంతా బాగానే ఉన్నా.. తెలిసి తెలిసి మమత కుర్చీని కదిల్చే ప్రయత్నం చేసింది ఎవరా అన్నది ఇప్పుడు హాట్‌ టాపిక్. ఆ ఆలోచన ఎవరికి వచ్చింది? ఎవరా పనిచేసింది? అన్నది చర్చగా మారింది. రొటీన్‌ బదిలీ అయితే ఫర్వాలేదు. కానీ.. విషయం తెలిసి కూడా కుర్చీ కదిలించే ప్రయత్నం చేశారని బయట పడితే మాత్రం.. కొత్త చర్చ ఖాయమని ఒక్కటే చెవులు కొరుకుడు. మరి..ఈ ఎపిసోడ్‌ ఇక్కడితో ఆగుతుందో.. ఇంకా మలుపులు తిరుగుతుందో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • kukatpally
  • Kukatpally Zonal Commissioner
  • Kukatpally Zonal Commissioner Mamatha

తాజావార్తలు

  • BPCL LPG ATM: గ్యాస్ కష్టాలకు చెక్.. దేశంలోనే తొలి ‘LPG ATM’ స్టార్ట్.. ఎక్కడో చూసేయండి!

  • AB de Villiers-RCB: ఆర్సీబీ దుమ్ము రేపడం ఖాయం.. వరుసగా రెండు, మూడు కప్పులు కొడుతుంది!

  • Iran: అలీ లారిజానీ హతం తర్వాత ఇరాన్ వ్యూహం మారిందా? గల్ఫ్ ఇంధన క్షేత్రాలే టార్గెటా?

  • Gold Rates: మార్కెట్లు పతనం వేళ మగువలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

  • Ugadi 2026: చైత్రం నుంచి ఫాల్గుణం వరకు.. ఈ ఏడాది పెళ్లిళ్లు, వ్యాపార గృహప్రవేశాలకు శుభ ముహూర్తాలివే!

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions