ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒకటే మాట వినిపిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. కరోనా వైరస్‌లోని ఒక వేరియంట్ ఇది. సార్స్ కోవ్ జాతిలో అనేక మ్యూటేషన్ల కారణంగా పుట్టుకొచ్చింది ఈవేరియంట్. ఇందులో 30కి పైగా మ్యూటేషన్లు ఉండటంతో వ్యాధిని వేగంగా వ్యాపింపజేస్తున్నది. ఒమిక్రాన్‌ను నిరోధించాలంటే స్పైక్ ప్రోటీన్లను తొలగించాలి. దీనికోసం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వం చెబుతూ వస్తున్నది.
Read: కరోనా వ్యాప్తికి ఇదే కారణమా…!
ఇక ఇదిలా ఉంటే, సార్స్ కోవ్ 2, డెల్టా వేరియంట్లు వ్యాప్తి చెందే సమయంలో శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపించే సమమంలో కొన్ని లక్షణాలు బయటపడుతున్నాయి. ఆ కొత్త లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒమిక్రాన్ వేరియంట్ రాత్రి వేళల్లో చురుగ్గా ఉంగుంది. తీవ్రమైన ఒళ్లు నొప్పులు, చెమట పట్టడం వంటివి దీని ప్రధాన లక్షణం. వాసన కోల్పోవడం, ముక్కు కారడం వంటివి ఒమిక్రాన్ బాధితుల్లో పెద్దగా కనిపించవు. కొంత మందిలో తలనొప్పి, స్వల్ప జ్వరం, అలసట వంటివి కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
