Site icon NTV Telugu

Off The Record : రేవంత్ రెడ్డి సర్ప్రైజ్ డిసిషన్..? ప్రభుత్వ సలహాదారు పదవి ఎవరికీ..!

Tg

Tg

తెలంగాణ ప్రభుత్వ ముఖ్య సలహాదారు పదవి ఎవర్ని వరించబోతోంది? వేం నరేందర్‌రెడ్డి రాజీనామా చేసిన పోస్ట్‌ను ఎవరికి ఇవ్వబోతున్నారు? ఆ విషయమై సీఎం రేవంత్‌రెడ్డి కాస్త డిఫరెంట్‌గా ఆలోచిస్తున్నారా? ఆయన ఆలోచనల గురించి బయట జరుగుతున్న ప్రచారం ఏంటి? ఆ లెక్కలు ఎలా ఉన్నాయి? డిఫరెంట్‌ థింకింగ్‌ అంటే ఎలా ఉండబోతోంది? లెట్స్‌ వాచ్‌. తెలంగాణ ప్రభుత్వంలో ఎంత మంది సలహాదారులు ఉన్నా… వేం నరేందర్ రెడ్డికి ఉన్న ప్రయారిటీ వేరు. సీఎం రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడాయన. నమ్మకస్తుడు కూడా అవ్వడంతో పాటు అన్ని విషయాలను నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళగలిగిన చనువు, చొరవ ఉన్నాయి ఆయనకు. అయితే… ఇటీవల ఆయనకు రాజ్యసభ సభ్యత్వం దక్కింది. కాంగ్రెస్‌ అధిష్టానాన్ని ఒప్పించి… తన మిత్రుడికి రాజ్యసభ సీటు ఇప్పించుకోవడంలో సక్సెస్ అయ్యారు రేవంత్. ఇక రాజ్యసభ సీటుకు నామినేషన్‌ వేయడానికి ముందే తన ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేశారాయన. దాంతో….ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి ప్లేస్‌లో వచ్చే సలహాదారు ఎవరనే చర్చ జోరుగా జరుగుతోంది కాంగ్రెస్‌ వర్గాల్లో. వ్యక్తిగతంగా ముఖ్యమంత్రితో సాన్నిహిత్యం విషయంలో వేంను ఎవరూ రీ ప్లేస్‌ చేసే పరిస్థితి ఉండదు. కానీ…ఆయన రాజీనామా చేసిన సలహాదారు పదవిపై మాత్రం చాలామందే ఆశలు పెంచుకుంటున్నారు.

పాలమూరు జిల్లాకు చెందిన ఓ mla ఇటీవలికాలంలో తన అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇప్పుడీ పదవి మీద ఆయన కన్నేశారట. అలాగే సీఎంకి సన్నిహితంగా ఉండే కొందరు నేతలు కూడా ఆ ప్లేస్ కోసం తెగ తాపత్రయపడుతున్నట్టు సమాచారం. కానీ… ముఖ్యమంత్రి ఆలోచన మాత్రం వేరుగా ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ప్రభుత్వ సలహాదారు పదవి ఇస్తే ఎలా ఉంటుందంటూ డిఫరెంట్‌గా థింక్‌ చేస్తున్నారట ఆయన. అందుకు తగ్గట్టే మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతకు ఛాన్స్‌ ఇవ్వవచ్చన్న చర్చలు సైతం నడుస్తున్నాయి కాంగ్రెస్‌లో. అందులో భాగంగానే వరంగల్ జిల్లాకు చెందిన నాయకుడి పేరు ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. మాదిగ సామాజిక వర్గానికి రాజ్యసభ సీటు ఇవ్వాలనే ఒత్తిడి వచ్చింది. కానీ కుదర్లేదు. అందుకే సలహాదారు పదవిని ఆ సామాజికవర్గానికి, అందులోనూ సీఎం రేవంత్‌కు దగ్గరగా ఉండే నాయకుడికి ఇవ్వాలన్న సమాలోచనలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ సలహాదారుగా ఎవరికి అవకాశం ఇస్తారన్నది ఒక ఎత్తయితే…పార్టీలో మాత్రం ఆశావహులు చాలామందే ఉన్నారు. ఎవరికి వారు తెగ ప్రయత్నాలు చేసేసుకుంటున్నారు కూడా. కానీ…. రేవంత్ రెడ్డి మనసులో ఏముందో తెలుసుకోలేక గందరగోళపడుతున్నారు చాలామంది. మొత్తం మీద ఈసారి సలహాదారు పదవి మాత్రం రొటీన్‌కు భిన్నంగా ఉండవచ్చన్న అంచనాలు ఆసక్తి రేపుతున్నాయి.

Exit mobile version