Site icon NTV Telugu

Off The Record : ఆయన అనుకున్నది ఒకటైతే మరొకటి జరిగిందా? పార్టీ మారీ పరేషాన్ అయ్యారా?

Rs Praveen

Rs Praveen

ఆయన అనుకున్నది ఒక్కటైతే..మరొకటి జరిగిందా? పార్టీ మారి పరేషాన్ అయ్యారా?ఇక్కడే ఉంటా ..నేను లోకల్ అన్న నేతకు హైకమాండ్ హ్యాండిచ్చిందా? ఆరోపణలు చేసిన ఆ నేత ఉంటే నేనుండనని వెళ్లిన ఆయన మళ్లీ రీ ఎంట్రీకి కారణామేంటి? ఏయ్ బిడ్డా ఇదినా అడ్డా.. ఇక్కడి నుంచి పోటీ చేస్తానన్న నేత సైలెంట్ అయ్యారా? ఫలానా నేత రాకుండా అడ్డుపడతానన్న ఆ లీడర్ చివరికి మెత్తబడ్డారా?లేక అదిష్టానం ఆయన ఒత్తిడిని లైట్ తీసుకుందా? ఇంతకీ పార్టీ ఆలోచనేంటీ..బౌన్స్ బ్యాక్ ఎవ్వరికి,ఉద్వాసన పలికిందెవ్వరిని?

కొమురం భీం జిల్లాలోని సిర్పూర్ టి నియోజకవర్గ బీఆర్ఎస్‌లో కొంతకాలంగా అలజడి కొనసాగుతుంది.. ఎంపీ ఎన్నికలకంటే ముందు బీఆర్ఎస్ ను వీడిన మాజీ ఎమ్మెల్యే కోనప్ప కాంగ్రెస్‌లోకి వెళ్లారు.సిర్పూర్ నియోకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థిగా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేసి ఆతర్వాత బీఆర్ఎస్ కండువా కప్పేసుకున్నారు..ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ,కోనప్ప లకు రాజకీయ పరంగా శత్రుత్వం ఉంది.ఒకరంటే ఒకరికి అసలు పడదు.పైగా ఆయన బీఆర్ఎస్ లోకి తీసుకోవడం వల్లనే తాను కాంగ్రెస్ లోకి వెళ్లానని కోనప్ప పదేపదే చెప్పడం అదే సమయంలో కోనప్పను టార్గెట్ చేస్తూ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేయడం పరిపాటిగామారింది. ఈక్రమంలో కోనప్పకు కాంగ్రెస్ సరైన ప్రాధాన్యం కల్పించకపోవడం తనకు పార్టీ లోని కొంతమంది నాయకుల వ్యవహార శైలి నచ్చక దూరమయ్యాయని ప్రకటించారు.కొద్ది రోజుల నుంచి ఆయన మాత్రం ఇండిపెండెంట్ గా బరిలో దిగుతానంటూ కేడర్‌ను ఒకే వేదికపైకి తెచ్చుకున్నారంట.కానీ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తుండటంతో ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ,కోనప్ప మద్య మాటల యుద్దం పెరిగిపోయింది.ఈక్రమంలోనే కోనప్ప.. ప్రవీణ్ ను వ్యతిరేకించినా ఏనాడు బీఆర్ఎస్ లోని అధిష్టానం పెద్దలు మరీ ముఖ్యంగా ,కేసీఆర్ ,కేటీఆర్ లను ఎప్పుడు ఏమనకపోగా దేవుడంటూ కోనప్ప వ్యాఖ్యానిస్తూ వచ్చారంట.

ఇలాంటి పరిణామాలతో ఎక్కడో తేడా కొడుతుందని భావించిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీలోకి కోనప్ప రానివ్వను..నేను ఇక్కడే ఉంటా..ఇక్కడి నుంచే పోటీ చేస్తా అంటూ బల్లగుద్ది మరీ బీఆర్ఎస్ కార్యకర్తలకు అభయమిచ్చాడంట.. కోనప్ప రీ ఎంట్రీ అయితే ఆర్ ఎస్ ప్రవీణ్ అచ్చంపేటకు పంపిస్తారనే టాక్ సైతం రావడం..ఆయన్ను నమ్ముకున్న వారిలో హైరానా మొదలైందంట..ఇదే సమయంలో ప్రవీణ్ అనుచరులకు భరోసా కల్పించేలా ఆయన మాత్రం కోనప్పను తీసుకోరని సిర్పూర్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ కరాఖండీగా చెప్పేశారట.

సీన్ కట్ చేస్తే… ఆల్ ఆఫ్ సడెన్ గా కోనప్ప బౌన్స్ బ్యాక్ అయ్యారు కేటీఆర్ ,హరీష్ రావులు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఆర్ ఎస్ పీని ఒప్పించారా…లేక అక్కడి నుంచి తప్పించారా అనే చర్చ సైతం నడుస్తుంది. ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నియోజకవర్గంలో గతంలోనే ఇంటి నిర్మాణం చేసుకున్నారు..పైగా బీఆర్ఎస్ లో చేరాక ఇక ఇక్కడే పోటి చేస్తానంటూ చాలాసార్లు చెప్పడం క్యాడర్ ,కోనప్ప వ్యతిరేక వర్గం అంతా ఆయన వెంట నడిచారంట..తీరా చూస్తే కోనప్ప మళ్లీ కారు పార్టీలోకి రావడం…జనరల్ సీటు నుంచి మళ్లీ కోనప్పను బరిలో దింపి ఆర్ ఎస్ ప్రవీణ్ ను మాత్రం తన సొంత జిల్లా నుంచి పోటీ చేయించాలనే ఆలోనచలో ఉన్నట్టు సొంత పార్టీలో చర్చ సాగుతుందంట..అచ్చంపేట నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన గువ్వల బాలరాజ్ ఇటీవలే బీజేపీ తీర్థం పుచ్చుకోగా ఆర్ ఎస్పీకి ఆ నియోజకవర్గ ఇంఛార్జి ఇవ్వడం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వు నియోజకవర్గం నుంచి పోటీలో నిలపాలని అధిష్టానం బావించడం అందులో భాగంగానే కోనప్పను మళ్లీ పార్టీలోకి తీసుకున్నట్లు చర్చ ఊపందుకుందంట.

ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కొంత కాలంగా.. కట్టేకాలేవరకు సిర్పూర్‌లోనే ఉంటానంటూ చెప్పుకొస్తున్నారు. కానీ అధిష్టానం నిర్ణయం ఆయనకు దెబ్బకొట్టిందా…పైకి అలా మాట్లాడినా లోపల మాత్రం తన సొంత జిల్లాలోనే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారా…అందుకే కోనప్పకు తిరిగి గులాబీ కండువా కప్పేశారా సేరా అనేది రాజకీయవర్గాల్లో జరగుతున్న చర్చ..లేదు స్థానిక సంస్థ ఎన్నికలే లక్ష్యంగా కోనప్పను చేర్చుకున్నా…ఆర్ ఎస్ ప్రవీణ్ వెంటనడిచిన వారంతా కోనప్పతో మింగిలౌతారా…సిర్పూర్ నుంచి ఆర్ ఎస్పీని క్రమంగా జరిపేసి గొడవలకు తావిలేకుండా చూస్తారా అనేది ఆసక్తికరమే..

ఎందుకంటే కోనప్ప అంటే నచ్చని వాళ్లు లేదా వ్యతిరేక వర్గం వారంతా ఆర్ ఎస్ వెంట వెళ్లారు.అటు అధికార పార్టీతోపాటు స్థానికంగా బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు. ఆ రెండు పార్టీలతో పోరాడడమే కాకుండా కోనప్పకు సొంత పార్టీలోనే మరో వర్గంను సైతం దారికి తెచ్చుకోవాల్సిన పరిస్థితి లేకపోలేదు…అయితే ఇప్పటికిప్పుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ను జరిపేస్తారా..లేక కొద్ది రోజులు అలా ఉంచి కోనప్ప చేయి తిరిగే వరకు వేచిచూస్తారా…లేదంటే అంతా ఆయనచేతికే పగ్గాలిచ్చి ఆర్ ఎస్ పీ సేవలను రాష్ట్రం అంతా వినియోగించుకోవడంతోపాటు అచ్చం పేటకు పరిమితం చేస్తారా అనేది మాత్రం బీఆర్ఎస్ అధిష్టానం ఆపార్టీ నేతల నిర్ణయమే ఫైనల్ ..పార్టీ భవిష్యత్ ఏవిధంగా ఉంటుందో చూడాలి.

Exit mobile version