జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వ్యూహాలు రొటీన్‌కు భిన్నంగా ఉన్నాయా? పోల్ మేనేజ్‌మెంట్‌లో ప్రధాన పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయా? గతంలో చూడని, వినని కొన్నిటిని చూడబోతున్నామా? అత్యంత కీలకమైన రాబోయే మూడు రోజుల్లోనే పొలిటికల్ స్క్రీన్ మీద ఆ దృశ్యాలు కనిపిస్తాయా? ఎలా ఉండబోతున్నాయి ప్రధాన పార్టీల పోల్ ఎత్తుగడలు? ఏంటా సంగతులు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ప్రచార ముగింపు గడువు దగ్గర పడుతోంది. దాంతో…ప్రధానరాజకీయ పార్టీలన్నీ తదుపరి అంశం మీద దృష్టి పెడుతున్నాయి.
నేతలు చేసే గిమ్మిక్కులన్నీ ఇవాల్టి నుంచే మొదలు కాబోతున్నాయి. ప్రతిపక్ష పార్టీ ఇప్పటికే ఆ పని మొదలుపెట్టగా… మిగతా రెండు కూడా అందుకు సిద్ధమవుతున్నట్టు చెప్పుకుంటున్నారు. నామినేషన్ వేసినప్పటి నుంచి ప్రచారం ముగిసే వరకు ఒక ఎత్తు. ప్రచారం ముగిసినప్పటి నుంచి పోలింగ్ రోజు ఉదయం వరకు మరో ఎత్తు. ఇంకా చెప్పాలంటే… ఆ టైంలో జరిగేదే అసలు తంతు. జూబ్లీహిల్స్‌ను ఎట్టిపరిస్థితుల్లో కొట్టాలన్న కసిగా ఉన్నాయి కాంగ్రెస్, బీఆర్‌ఎస్. దాంతో… డబ్బు ప్రభావం ఎక్కువగా ఉండవచ్చన్న అంచనాలు పెరుగుతున్నాయి. తెలంగాణలో గతంలో ఉప ఎన్నికలు జరిగినప్పుడు డబ్బులు పంచలేదంటూ ఓటర్లు రోడ్డెక్కిన సందర్భం ఉంది.
దీంతో…. జూబ్లీహిల్స్‌లో ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ కూడా అలాంటి దృశ్యాల్ని చూడబోతామా? లేక పట్టణ ఓటరు సైలెంట్‌గా తాను చేయాల్సినపని చేసుకు పోతాడా అన్న చర్చలు నడుస్తున్నాయి. ఓటర్ల సంగతి ఎలా ఉన్నా.. రాజకీయ పార్టీలు మాత్రం పెద్ద ఎత్తున ప్రలోభాలకు తెరలేపేట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. దాంతో…ఇప్పుడు మాటలన్నీ పోల్ మేనేజ్‌మెంట్ గురించే నడుస్తున్నాయి.అన్ని రాజకీయ పార్టీలు ఓటర్‌ని పోలింగ్ కేంద్రం దాకా తీసుకువచ్చే ప్రయత్నాల్లో సీరియస్‌గా ఉన్నాయట. ప్రతిపక్షంలో ఉన్న ఓ పార్టీ ఇప్పటికే తన పనిని మొదలుపెట్టేసినట్టు తెలుస్తోంది. ఇక అధికార పార్టీ ఇవాల్టి నుంచి ఆ పనిలో మునిగితేలబోతున్నట్టు సమాచారం. మూడో పార్టీ తనదైన శైలిలో పావులు కదుపుతోందట. ఆ పార్టీ సంగతి ఎలా ఉన్నా… టగ్ ఆఫ్ వార్ గా భావిస్తున్న రెండు రాజకీయ పార్టీలు మాత్రం నిమిషానికో ఎత్తుగడతో పొలిటికల్ స్క్రీన్‌ను రక్తికట్టిస్తున్నాయి.
ప్రతీ పార్టీ పోల్ మేనేజ్మెంట్‌లో ఎంత ఖర్చు చేస్తోందని ప్రత్యర్థులు గమనించడం, తాము దానికంటే ఎక్కువ ఇచ్చి ప్రలోభాలకు గురిచేయడం పోల్ మేనేజ్‌మెంట్‌లో సాధారణంగా జరిగే తంతే. జూబ్లీహిల్స్‌లో ఉన్న నెక్ టు నెక్ సిచ్యుయేషన్ కారణంగా…. ఈసారి ఇంకొంచెం ఎక్కువ అన్నట్టుగా ఉన్నాయట ప్రధాన రాజకీయపక్షాలు. బోరబండ, రహమత్ నగర్, యూసఫ్ గూడ లాంటి బస్తీలే టార్గెట్‌గా రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నట్టు సమాచారం. ప్రచారం చేసేదంతా ఒక ఎత్తయితే… ఫైనల్‌గా ఓటరు పోలింగ్ బూత్ దాకా రావడానికి చేసే ప్రయత్నాలు వేరే లెవెల్. అన్ని పార్టీలు ఇప్పుడా ప్రయత్నాల్లో మునిగి తేలుతున్నాయట.ఐతే ఎవరు ఎలాంటి ఆపరేషన్ చేస్తున్నారు..? మనం ఎలా అడుగులు వేయాలంటూ… ఎత్తులకు పై ఎత్తులు వేస్తుండటంతో… పోల్ మేనేజ్‌మెంట్‌లో ఎవరు పైచేయి సాధిస్తారోనని ఉత్కంఠగా గమనిస్తున్నాయి రాజకీయవర్గాలు.
