OTR : గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు ఎవరికి? రేవంత్ మనసులో ఏముంది?

Otr

Otr

తెలంగాణ గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ పదవులు ఎవర్ని వరించబోతున్నాయి? వాటి కోసం తెర మీదికి వస్తున్న కొత్త లెక్కలేంటి? కుల సమీకరణలు ఎలా ఉన్నాయి? రేస్‌లో ఉన్న నాయకులు ఎవరు? పోటాపోటీగా వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఏంటి? తెలంగాణ గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ సీట్ల భర్తీ విషయంలో ఎవరి లెక్కలు వారు వేసుకుంటూ పావులు కదుపుతున్నారు కాంగ్రెస్‌ నేతలు. ఈ కోటా కింద ప్రస్తుతం మూడు సీట్లు ఉన్నాయి. నవంబర్ మొదటి వారంలో ఖాళీ అవబోతున్న వీటి కోసం ఆశావహుల సంఖ్య భారీగానే ఉంది. ఇందులో ఒక సీటు పద్మశాలీలకు ఇస్తామని ఇప్పటికే ప్రకటించి ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరో సీటు కూడా బీసీలకే ఇవ్వాలంటూ వత్తిడి పెంచుతున్నారట PCC చీఫ్ మహేష్ గౌడ్. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో రెండు సీట్లు రెడ్లకు కేటాయించారు కాబట్టి…. గవర్నర్ కోటాలో రెండిటిని బీసీలకు ఇవ్వాలని ప్రెషర్ పెరుగుతోంది. అందులోనూ….బలమైన సామాజిక వర్గంగా చెప్పుకునే ముదిరాజ్‌లకు ఇవ్వాలనే డిమాండ్ కూడా వచ్చింది. ఒకవేళ రెండు సీట్లు బీసీ లకే ఇవ్వాల్సి వస్తే… ఇక ఒక్కటే మిగులుతుంది. ఆ ఒక్కదాని కోసం ఎస్సీ, బ్రాహ్మణ సామాజిక వర్గాల నేతలు పోటీ పడుతున్నారట. ఎవరికి వారు తమ తమ మార్గాల్లో జాగ్రత్తగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. SC సామాజిక వర్గం నుండి ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్న వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. చాలా రోజులుగా cm రేవంత్ రెడ్డి… వరంగల్ జిల్లాకు చెందిన దొమ్మాట సాంబయ్య పేరు పరిశీలిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఆయనకు ఏదో ఒక పదవి ఇవ్వాలని అనుకుంటున్నట్టు సమాచారం. ఇక సీఎం సొంత జిల్లాకు చెందిన విద్యాకమిషన్ మెంబర్ చారకొండ వెంకటేష్, కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్‌ కూడా రేసులో ఉన్నారు.

తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌కి సన్నిహితుడు, ఆమెతో కలిసి పంచాయతీ రాజ్ సంఘటన్ రాష్ట్ర అధ్యక్షుడిగా పాదయాత్ర చేసిన సీనియర్ నేత రాచమల్ల సిద్దేశ్వర్ కూడా తన ప్రయత్నాల్లో ఉన్నారట. ఆ రకంగా ఎవరి వేటలో వాళ్లు ఉన్నా…సామాజిక అంశాల్లో న్యాయం దక్కాలనే వాదనను కూడా తెరమీదకు తెస్తున్నారు నేతలు. అదే సీటు కోసం బ్రాహ్మణ సామాజిక వర్గం నుండి కూడా కొందరు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. పార్టీ సీనియర్ నాయకుడు, ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా ఉన్న హర్కర వేణుగోపాల్‌.. ఆ దిశగా సీఎం రేవంత్ మీద వత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. అదే సామాజిక వర్గానికి చెందిన దయాసాగర్ కూడా పార్టీ సీనియర్ నేతల ద్వారా పావులు కదుపుతున్నట్టు సమాచారం. మరోవైపు… కాంగ్రెస్ పార్టీ ఇన్సూరెన్స్ విభాగం చూస్తున్న పవన్ మల్లాది కూడా సీఎంనే నమ్ముకున్నారని అంటున్నారు. గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన బండారు శ్రీకాంత్ తన సామాజిక వర్గం నాయకులతో ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. మాజీ ఎమ్మెల్యే పండరి వెంకట్ రాజేశ్వర్ రావు మనవడే శ్రీకాంత్.మరోవైపు గజ్వేల్ నియోజకవర్గానికి మూడేళ్ళ నుంచి ఒక్క అధికారిక పదవి ఇవ్వలేదనే చర్చ కూడా నడుస్తోంది. ఇక్కడ ఇప్పటికే రెండు వర్గాల మధ్య పదవుల పంచాయితీ నడుస్తోంది. అలా… ఎవరికి వారు నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి కోసం సీరియస్ గా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. సీఎం రేవంత్ మనసులో ఏముందోగాని… ఎవరికి వారు లెక్కలు వేసుకుని జాబితాను సిద్ధం చేసుకుంటున్నారు. అససు అధిష్టానం మనసులో ఏణుంది? సీఎం రేవంత్ వ్యూహం ఏంటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌.