OTR : Congress లిస్ట్‌లో ఆ రెండు జిల్లాలదే సస్పెన్స్.. రంగారెడ్డి, సంగారెడ్డి డీసీసీ రేసు..!

Cong

Cong

ఆ రెండు జిల్లాల కాంగ్రెస్‌ అధ్యక్షుల నియామకం ఎందుకు ఆగింది..? పార్టీ, ప్రభుత్వ పరంగా అత్యంత కీలకమైన జిల్లాలే ఎందుకు ఆగిపోయాయి? రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్‌కు, లోకల్‌ లీడర్స్‌కు మధ్య సఖ్యత లేదా? అదే నిజమైతే విభేదాల్ని ఎందుకు పరిష్కరించుకోలేకపోతున్నారు? ఏవా రెండు జిల్లాలు? వాటి గురించి పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? అత్యంత కీలకమైన రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం ఇప్పటి వరకు జరగలేదు. మిగిలిన చోట్ల దాదాపుగా పూర్తయిపోయింది. మిగతా తెలంగాణ మొత్తం ఒక లెక్కగా ఉంటే… ఈ రెండు జిల్లాలు మాత్రమే మరో లెక్క అన్నట్టు ఉండటం, ఆగిపోవడానికి కారణం ఏంటంటూ పార్టీలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అంతర్గత పోటీ పెరిగిందా..? లేక నాయకుల మధ్య సఖ్యత లేదా..!? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా అధ్యక్ష నియామకం విషయంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌కు, స్థానిక నాయత్వానికి మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటం వల్లే వాయిదా పడుతున్నట్టు తెలుస్తోంది. మహేశ్వరం నియోజకవర్గం టికెట్ ఆశించిన పారిజాతకి dcc ఇవ్వాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. మహేశ్వరం నుండి పోటీ చేయాలన్న టార్గెట్‌తోనే అప్పట్లో ఆమె బీఆర్‌ఎస్‌ నుండి బయటకు వచ్చారు. కానీ ఆఖరి నిమిషంలో టికెట్ దక్కలేదు. అందుకే ఇప్పుడు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలనే ఆలోచనలో ఉంది పీసీసీ. ప్రభుత్వ పెద్దలది కూడా అదే ఆలోచన అట.

కానీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ మాత్రం మరో పేరు ప్రతిపాదిస్తున్నట్టు సమాచారం. దీంతో రంగారెడ్డి జిల్లా అధ్యక్ష నియామకం వాయిదా పడుతోందంటున్నారు. కానీ.. ఇన్నాళ్లు పార్టీ అధ్యక్ష పదవి భర్తీ చేయకపోతే.. నష్టం ఎవరికి..? పెద్దోళ్ళు ఆ మాత్రం ఆలోచించలేకపోతున్నారా అన్నది కేడర్‌ ప్రశ్న. ఇక సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలిగా ప్రస్తుతం నిర్మలా జగ్గారెడ్డి ఉన్నారు. కొత్త అధ్యక్ష నియామకం ఇంకా పూర్తవలేదు. దాంతో… మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భార్య అయిన నిర్మలా జగ్గారెడ్డినే కొనసాగించాలని పార్టీ ఆలోచిస్తోందా..? లేక ఇంకేదైనా అభిప్రాయం ఉందా అన్నది అర్ధం రావడం లేదు. ఆ విషయంలో ఎంత ఎదురు చూసినా అధికారిక ప్రకటన మాత్రం రావట్లేదు. సంగారెడ్డి అధ్యక్ష పదవి విషయంలో జిల్లాలో ఏకాభిప్రాయం కూడా వచ్చింది. ఇక్కడ నిర్మలా జగ్గారెడ్డికి వద్దంటేనే మరో పేరు తెరమీదకు వస్తుంది. కానీ… అలా వద్దనే వాతావరణం కూడా కనిపించలేదు. అయినా సరే అధికారిక ప్రకటనలో జాప్యం ఎందుకో అర్ధం కావడం లేదని అంటున్నాయి పార్టీ వర్గాలు. మొత్తానికి రెండు జిల్లాల్లో కీలకమైన నాయకులు ఉన్నారు. కానీ పదవుల భర్తీ మాత్రం జరగడం లేదు. అది పోటీవల్లనా… లేక భిన్నమైన ఆలోచలు కారణమా అన్నది తేలాల్సి ఉంది. పదవులు భర్తీ చేయకపోతే పార్టీ ..ప్రభుత్వ యాక్టివిటీ ఎలా ముందుకు పోతుందో ఆలోచించాలంటున్నాకు కార్యకర్తలు.