ఆ ఎమ్మెల్యేను వదల బొమ్మాలి అంటూ ఆ మహిళా నేత వెంటాడుతోందా? ఇప్పటికే టీజర్ చూపించిన అమె… ఇప్పుడు ట్రైలర్ సైతం వదలడంతో ఆ నియోజకవర్గ కూటమి నేతల్లో హాట్ హాట్ గా చర్చలు నడుస్తున్నాయా?ఇప్పుడే ఇలా ఉంటే త్వరలోనే అసలు సినిమా చూపిస్తానంటూ ఆమె చెప్పడం వెనుక అంతర్యమెంటి? ఆ నియోజకవర్గంలో అసలు ఏం జరగబోతోంది..వదల బొమ్మాలి అంటూ ఆ ఎమ్మెల్యేను వెంటాడుతున్న ఆ మహిళ నేత ఎవరు? తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇప్పుడు ఓ లేఖ కూటమి నేతలను తెగ భయపెడుతోందట. ఎన్నికల ముందు నుంచే హాట్ హాట్ గా ఈ నియోజకవర్గంలో రాజకీయాలు నడిచాయి. పొత్తులో భాగంగా సీటు ఎవరికి వస్తుందన్న పంచాయితీ.. తెగేదాకా లాగిన కూటమి పార్టీ పెద్దలు..చివరికి టీడీపీకే సీటు కేటాయించడంతో బొజ్జల సుధీర్ రెడ్డి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు. అంతవరకు బాగానే ఉన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోజు నుంచి కూడా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా పరిస్థితి నెలకొంది ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సుధీర్ రెడ్డికి అప్పటి జనసేన పార్టీ ఇన్చార్జిగా ఉన్న వినూత కోట దంపతులకు మధ్య తీవ్రస్థాయిలో అంతర్గత విభేదాలు నెలకొన్నాయనేది బహిరంగ రహస్యమే. ఊహించని రీతిలోకారు డ్రైవర్, పీఏ కూడా అయిన రాయుడి హత్య కేసులో వినూత దంపతులు జైలుపాలయ్యారు. తర్వాత పార్టీ సైతం ఆమెను జనసేన నుంచి బహిష్కరించింది..జైలుకు వెళుతున్న సమయంలో రాయుడు హత్యకు,ఇలా జైలు పాలు అవ్వడానికి కారణం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వినూత భర్త చంద్రబాబు. కొన్ని రోజుల తర్వాత వినూత బెయిల్ పై బయటికి వచ్చారు.తర్వాత ఆమె ఏం మాట్లాడకపోవడం పోవడంతో ఇక అంతా సద్దుమణిగిందిలే అనుకున్నారు.కానీ తాజాగా శ్రీకాళహస్తి ఆలయ ఛైర్మన్ ఎంపిక వ్యవహారం మాత్రం జనసేనలో చిచ్చు రేపింది.
ఈ దఫా నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు వినూత బహిరంగ లేఖ రాసి, ఆయన్ని నిలదీయడం తీవ్ర చర్చనీయాంశమైంది. తనపై కుట్ర చేసి, జైలుకు పంపడంలో సాయిప్రసాద్ ప్రధాన పాత్ర పోషించారని వినూత రాజకీయ బాంబ్ పేల్చారు. కొట్టే సాయి ప్రసాద్‌కు పదవి ఇవ్వడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని,త్వరలో అన్ని ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని ఆమె లేఖ రాసి మరోసారి సంచలనానికి తెరలేపారు. ఆమె ఆవేదన అటు ఉంచితే చివరిలో త్వరలోనే తనకు జరిగిన అన్యాయంపై పూర్తి ఆధారాలతో మీడియా ముందుకు వస్తాను అని ప్రకటించడం శ్రీకాళహస్తి కూటమి నేతల్లో కొందరి నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేసిందట… ఇప్పటికే తాము ఇలా హత్య చేసేంతవరకు వెళ్లడానికి కారణం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అని ప్రకటించిన వినూత దంపతులు ఇప్పుడు తాజాగా కొట్టే సాయి సైతం సుధీర్ రెడ్డికి అనుచరుడే అనే లాగా లేఖలో ప్రస్తావించడంపై మరింత చర్చకు దారి తీసింది. రాయుడు ఆడియో మెసేజ్ లు, వీడియోలు, కాల్ డేటా సైతం ఉన్నాయని అంటున్నారట.
ఇప్పుడు వాటిని అస్త్రాలుగా ప్రయోగించడానికి సిద్ధమవుతున్నారని ప్రచారం గట్టిగానే నడుస్తుందట… దీంతో ఎమ్మెల్యే అనుచూర్లలోనూ టెన్షన్ మొదలైనట్టుగా సమాచారం… ఒకవేళ ఆమె గనుక వదల బొమ్మాలి అంటూ సుధీర్ రెడ్డికి సంబంధించిన వ్యవహారంపై తగిన ఆధారాలతో ముందుకు వస్తే ఏంటని చర్చలు శ్రీకాళహస్తి పొలిటికల్ సర్కిల్లో హాట్ హాట్ గా మారాయట. ఒకవేళ అదే జరిగితే మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి కాళహస్తి కూటమినేతల వ్యవహారం చర్చగా మారే అవకాశం ఉంటుందని భావిస్తున్నారట పార్టీ సీనియర్ నేతలు.
