Site icon NTV Telugu

Off The Record : బాలకృష్ణ కామెంట్స్ పై మెగా బ్రదర్స్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు

Balakrishna

Balakrishna

అసెంబ్లీలో బాలకృష్ణ కామెంట్లపై మెగా బ్రదర్స్..ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు.చిరంజీవి పై వ్యాఖ్యలు చేస్తుంటే..వెంటనే స్పందించాల్సిన పవన్ ఎందుకు మౌనం వహించారు.దీని వెనుక రాజకీయ అంశాలే ప్రధాన కారణమా?వేరే ఇంకేమైనా ఉన్నాయా..?అన్నింటికి క్విక్ రెస్పాండ్ అయ్యే మెగా బ్రదర్ నాగబాబు సైతం ఎందుకు మౌనంగా ఉన్నారు? ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రతిపక్షం లేకుండానే హాట్ హాట్ గా సాగుతున్నాయి. తాజాగా హీరో హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ అసెంబ్లీలో చిరంజీవిపై హాట్ కామెంట్స్ చేశారు.గత ప్రభుత్వంలో జగన్ తో సినిమా ప్రముఖుల సమావేశం పై జరిగిన చర్చలో..చిరంజీవి లీడ్ తీసుకుని గట్టిగా అడగడం వల్లే జగన్ సినీ ప్రముఖులకు అపాయింట్‌మెంట్ ఇచ్చారన్నారు మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్.ఈ వ్యాఖ్యల్ని బాలకృష్ణ ఖండించారు.చిరంజీవి గట్టిగా మాట్లాడలేదని,కామినేని అబద్ధాలు చెబుతున్నారన్నారు. ఇక్కడే అసలు సమస్య స్టార్ట్ అయింది.. బాలకృష్ణ వ్యాఖ్యల పై చిరంజీవి స్పందించినా మెగా బ్రదర్స్…..పవన్ కల్యాణ్. .నాగబాబు ఇప్పటి వరకు స్పందించక పోవడంపై అనేక రకాలుగా చర్చ జరుగుతోంది.

బాలకృష్ణ వ్యాఖ్యలపై తప్పనిసరిగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించాలి..కానీ ఆయన సైలెంట్ అవ్వడానికి పొలిటికల్ రీజన్స్ అనే చర్చ జరుగుతోంది.కూటమిలో ఇప్పుడు బాలకృష్ణ పవన్ కల్యాణ్ అత్యంత కీలకంగా ఉన్నారు…అలాంటిది బాలకృష్ణ సడెన్‌గా చిరంజీవి పై కామెంట్ చేశారు. పవన్ కనక స్పందిస్తే కూటమి ధర్మానికి ముప్పు వస్తుందని,అందుకే సైలెంట్ గా ఉన్నారనే చర్చ నడుస్తోంది.వెంటనే స్పందిస్తే కూటమిలో ఇబ్బందులు వస్తాయని గ్రహించి అలెర్ట్ అయ్యారని అందుకే స్పందించలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.చిరంజీవికి మద్దతుగా మాట్లాడితే తప్పకుండా బాలకృష్ణ మాటలని ఖండించి నట్టేనని..అందుకే ఎలాంటి కామెంట్ చేయకుండా జనసేనాని సైలెంట్ అయ్యారనేది పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతున్న డిస్కషన్.

మరో మెగా బ్రదర్ నాగబాబు కూడా ఈ విషయంలో సైలెంట్ గా ఉన్నారు..పోనీ పవన్ డిప్యూటీ సీఎం పొజిషన్ లో ఉన్నారు కాబట్టి కొన్ని ఇబ్బందులు రావచ్చు. కానీ నాగబాబు ప్రతీ అంశంలో స్పందిస్తూ ఉంటారు..అలాంటి మెగా బ్రదర్ కూడా ఎందుకు సైలెంట్ అయ్యారనే చర్చ బాగా జరుగుతోంది. నాగబాబు ఎమ్మెల్సి కాబట్టి ఆయన మాట్లాడినా కూటమి పై ప్రభావం పడుతుందనే ఆలోచనతోనే సైలెంట్ అయ్యారని సమాచారం. కూటమి ఐక్యతకు జనసేన కంట్రిబ్యూషన్ అత్యంత కీలకం అని…ఇందుకే మెగా బ్రదర్స్ పరిస్థితిని బట్టి సైలెంట్ అయ్యారట.ఏ మాత్రం మాట్లాడినా ఎటు దారి తీసి… వైసీపీకి మేలు జరుగుతోందో అనే ఆలోచనతోనే సైలెంట్ గా ఉన్నారట.

చిరంజీవి లేకపోతే మేము లేము అని చెప్పుకునే మెగా బ్రదర్స్ మాత్రం….ఈ విషయంలో సైలెంట్ అవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.బాలకృష్ణ అసెంబ్లీలో చిరంజీవి ని కామెంట్ చేయడం చిన్న విషయం కాదు..అయినా రాజకీయ కారణాలతో మెగా బ్రదర్స్ మౌనంగా ఉండటం కొంతమందికి నచ్చట్లేదనే అభిప్రాయమూ ఉంది…చిరంజీవి ఫాన్స్ మాత్రం బాలకృష్ణకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ లెటర్ రాయడం..మెగా బ్రదర్స్ సైలెంట్ గా ఉండడం పైనా గుసగుసలు వినిపిస్తున్నాయి.

Exit mobile version