Site icon NTV Telugu

Off The Record: జాగృతి జనం బాటలో కవిత కాస్త డిఫరెంట్‌గా వ్యవహరిస్తున్నారా..?

Otr

Otr

Off The Record: జాగృతి జనం బాటలో కవిత కాస్త డిఫరెంట్‌గా వ్యవహరిస్తున్నారా? ఆమె తీరు గులాబీ దళానికి అస్సలు మింగుడు పడ్డం లేదా? ఏదైతే అదైంది ఇక నుంచి ఫుల్‌ స్వింగ్‌లో రివర్స్‌ అటాక్‌ చేయాలన్న నిర్ణయానికి వచ్చారా? ఇంతకీ కవిత తీరులో కనిపిస్తున్న మార్పు ఏంటి? రాష్ట్ర పర్యటనలో ఆమె ఎవర్ని టార్గెట్‌ చేస్తున్నారు?

జాగృతి జనం బాట పేరుతో జిల్లాల్లో పర్యటిస్తున్నారు ఎమ్మెల్సీ కవిత. ఇప్పటికి ఏడు జిల్లాల టూర్‌ పూర్తయింది. అయితే… తన పర్యటనల్లో ఆమె చేస్తున్న కామెంట్స్‌ దుమారం రేపుతున్నాయి. ఒక్కో జిల్లాకు వెళ్లినప్పుడు కొందరు నాయకుల్ని టార్గెట్‌ చేస్తున్నారు కవిత. సరే… రాజకీయాల్లో అది సర్వ సాధారణం అనుకున్నా….ప్రత్యేకించి బీఆర్ఎస్‌ నాయకుల్ని లక్ష్యంగా చేసుకుని స్టేట్‌మెంట్స్‌ ఇవ్వడం చర్చనీయాంశం అవుతోంది. అందులోనూ మాజీ మంత్రులను ఓ రేంజ్‌లో కడిగి పారేస్తుండటం పొలిటికల్‌ హాట్‌ టాపిక్‌గా మారుతోంది. మామూలుగా అయితే… అధికారంలో ఉన్న వాళ్ళే టార్గెట్‌గా ఆరోపణలు, విమర్శలు చేస్తుంటారు విపక్ష నేతలు.

AP New Districts: కొత్త జిల్లాల డిటైల్డ్ రిపోర్ట్ ఇదే..!

కానీ… కవిత మాత్రం ఏ జిల్లాకు వెళితే… ఆ జిల్లాలో బీఆర్‌ఎస్‌ హయాంలో మంత్రులుగా చేసిన వాళ్ళని లక్ష్యంగా చేసుకోవడాన్ని ప్రత్యేకంగానే చూడాలంటున్నారు పొలిటికల్‌ పరిశీలకులు. నిజామాబాద్ జిల్లాకు వెళ్లినప్పుడు అక్కడ మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డిని, మెదక్ జిల్లా టూర్‌లోహరీష్ రావును, నల్గొండ జిల్లా పర్యటనలో జగదీశ్ రెడ్డి, రంగారెడ్డిలో సబితా ఇంద్రారెడ్డి టార్గెట్‌గా విమర్శించారామె. ఇక తాజాగా… వనపర్తి జిల్లాలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మీద గురి పెట్టారామె. ఈ వైఖరి గురించే ఇప్పుడు ఇటు రాజకీయ వర్గాల్లో, అటు బీఆర్‌ఎస్‌ సర్కిల్స్‌లో గట్టి చర్చ జరుగుతోంది. జాగృతి జనం బాట పేరుతో ప్రజల్లో తిరగడం, అక్కడ సమస్యలు తెలుసుకోవడం వరకు బాగానే ఉన్నా…ప్రత్యేకంగా బీఆర్‌ఎస్‌ నాయకుల మీద ఎందుకు గురి పెడుతున్నారో అర్ధం కావడం లేదంటున్నారు ఆ పార్టీ కార్యకర్తలు. తాము ప్రతిపక్షంలోకి వచ్చి రెండేళ్ళయింది. అయినా సరే… తమని టార్గెట్ చేసి మాట్లాడాల్సిన అవసరం ఏముందని అంటున్నారు. ఇప్పుడు జిల్లాల పర్యటనల్లో కవితకు సమస్యలు కనిపిస్తే… వాటిని పరిష్కరించమని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయవచ్చు, లేదా అక్కడి అధికార పార్టీ నేతల్ని నిలదీయవచ్చు, ఆయా జిల్లాల మంత్రుల్ని అడగవచ్చు. కానీ.. వీటన్నిటినీ మానేసి మామీద బాణాలు సంధిస్తే ప్రయోజనం ఏం ఉంటుందని మాట్లాడుకుంటున్నారట గులాబీ నాయకులు.

మొన్నటి వరకు తాను కూడా అదే పార్టీలో కీలకంగా ఉన్నానన్న సంగతిని కవిత మర్చిపోతే ఎలాగన్నది వాళ్ల క్వశ్చన్‌. ఏ జిల్లాకు వెళితే ఆ జిల్లాలో ఉన్న మాజీ మంత్రులు, తనతో కలిసి పనిచేసిన వాళ్లపై తీవ్ర విమర్శలు చేయడం ఏంటని అడుగుతున్నారు. మాజీ మంత్రులు అంటే… గతంలో కవిత తండ్రి కేసిఆర్‌తో పాటు ఆయన క్యాబినెట్లో ఉన్నవాళ్ళేకదా..? అలాంటిది ఎక్స్‌ మినిస్టర్స్‌ని లక్ష్యంగా చేసుకుంటున్నారంటే… పరోక్షంగా తన తండ్రి టీమ్‌ను, ఆయన హయాంలో జరిగిన నిర్ణయాలను తప్పు పడుతున్నట్టేకదా అంటూ లాజిక్‌ లాగే వాళ్ళు సైతం ఉన్నారు. కవిత ఇంకా చాలా టూర్‌ చేయాల్సి ఉందని, ఇప్పుడున్న ట్రెండ్‌ని బట్టి చూస్తుంటే… తమ విషయంలో ఎలాంటి ఆరోపణలు చేస్తారోనని ఆలోచిస్తున్నారట బీఆర్‌ఎస్‌ నాయకులు, మాజీ మంత్రులు. ఒకవేళ ఏవైనా తప్పులు జరిగి ఉంటే…. తాము అధికారంలో ఉండి మంత్రులుగా పనిచేసిన సమయంలో పార్టీకి, ప్రభుత్వానికి అత్యంత సన్నిహితంగా ఉన్న కవిత అప్పుడెందుకు ప్రశ్నించలేదన్నది వాళ్ల పాయింట్‌.

Realme Watch 5: త్వరలో భారత మార్కెట్‌లోకి రియల్‌మీ కొత్త స్మార్ట్ వాచ్..

నిజంగా ప్రజల సమస్యలు పరిష్కరించాలన్న చిత్తశుద్ది కవితకు ఉంటే…ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. కానీ… ఆ పనులు చేయకుండా ఇలా ప్రతిపక్షంలో ఉన్న తమను విమర్శించడమంటే… రాజకీయ లబ్ధి కోసంగాక ఇంక దేనికోసమన్నది గులాబీ నాయకుల ప్రశ్న. ఇన్నాళ్లు ఆమెను కేసీఆర్‌ కూతురిగా చూసి పట్టించుకోలేదని, ఇకపై మాటకు మాట సమాధానం చెబుతామంటున్నారు బీఆర్ఎస్ నేతలు. అధికార పార్టీని వదిలేసి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని పాయింట్‌ఔట్‌ చేస్తున్నారంటే… ఆమె పరోక్షంగా ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి లబ్ది చేకూరుస్తున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు కొందరు గులాబీ లీడర్స్‌. భవిష్యత్తులో కవితకు సంబంధించిన పొరపాట్లను కూడా తాము హైలైట్‌ చేస్తామంటున్నారు.

Exit mobile version