Site icon NTV Telugu

Off The Record: యనమల కృష్ణుడి రాజకీయ భవిష్యత్‌పై నీలి నీడలు..?

Otr Yanamala Krishnudu Poli

Otr Yanamala Krishnudu Poli

Off The Record: తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు నియోజకవర్గ స్థాయిలో చక్రం తిప్పిన నాయకుడు యనమల కృష్ణుడు. గత ఎన్నికలకు ముందు అనూహ్యంగా వైసీపీలోకి జంప్‌ అయిపోయారు. మొదట్లో బాగానే ఉన్నా… ప్రస్తుతం ఆయన రాజకీయంగా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. గట్టిగా చెప్పాలంటే… ఇప్పుడు యనమల కృష్ణుడి పరిస్థితి పుట్టింటోళ్ళు తరిమేశారు-కట్టుకున్నోడు వదిలేశాడన్నట్టుగా తయారైందన్నది పొలిటికల్‌ టాక్‌. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుకు వరుసకు సోదరుడైన కృష్ణుడు గతంలో తుని నియోజకవర్గంలో చక్రం తిప్పారు. రామకృష్ణుడు రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా ఉంటే… లోకల్‌గా నియోజకవర్గ వ్యవహారాలన్నీ కృష్ణుడే చూసుకునే వారు. ఒకరకంగా అప్పట్లో తుని టీడీపీకి పొలిటికల్‌ బాస్‌ కృష్ణుడేనని చెప్పుకునేవారు. ఈ క్రమంలో… రామకృష్ణుడు పొలిటికల్‌గా ఫేడౌట్‌ అయ్యాక తుని నాదేనని అనుకున్నారట కృష్ణుడు. అందుకే గత ఎన్నికల్లో ఇక్కడ పార్టీ టిక్కెట్‌ కోసం గట్టిగానే ప్రయత్నించారు. కానీ.. టీడీపీ అధిష్టానం మాత్రం రామకృష్ణుడి కుమార్తె దివ్య వైపు మొగ్గు చూపింది. దాంతో…. సైకిల్‌ దిగేసి ఫ్యాన్‌ కిందికి చేరిపోయారు కృష్ణుడు. అప్పుడే ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకించారు నియోజకవర్గ వైసీపీ ముఖ్యుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. అసలు తునిలో తెలుగుదేశం పార్టీకి మైనస్‌ ఏదన్నా ఉందంటే… అది యనమల కృష్ణుడేనని, అలాంటి వ్యక్తిని చేర్చుకుని మనం ఇబ్బంది పడటం ఎందుకని వాదించారట దాడిశెట్టి.

కానీ అప్పటి రాజకీయ పరిస్థితులు, పరిణామాలతో ఫ్యాన్ పార్టీ పెద్దలు కృష్ణుడిని చేర్చుకోవడానికే ఇష్టపడ్డారు. కానీ… ఎన్నికల తర్వాత పూర్తిగా పక్కన పెట్టేశారట. తుని వైసీపీలోని చాలామంది గతంలో కృష్ణుడితో విభేదాలు ఉన్నవారే. వాళ్ళే నియోజకవర్గ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. దాంతో వాళ్ళకు ఈయనకు అస్సలు పొసగడం లేదట. అంతేకాకుండా… రకరకాల కామెంట్స్‌ కూడా పాస్‌ చేయడం కృష్ణుడికి ఇబ్బందిగా మారినట్టు చెప్పుకుంటున్నారు. ఆయన్ని బయటికి పంపేసి టీడీపీ మైనస్‌ని ప్లస్‌ చేసుకుందని, చేర్చుకుని మనం ప్లస్‌ని మైనస్‌ చేసుకున్నామంటూ డిఫరెంట్‌ అనాలసిస్‌ చేస్తున్నారు లోకల్‌ వైసీపీ లీడర్స్‌. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తుని నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి యనమల దివ్యకు 15వేల177 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇదే అతి తక్కువ మెజారిటీ. ఇక్కడే ఒక సరికొత్త విశ్లేషణను తెర మీదికి తెచ్చారు తుని వైసీపీ నాయకులు. కేవలం లాస్ట్‌ మినిట్‌లో కృష్ణుడిని చేర్చుకోవడం వల్లే నష్టపోయామని, టీడీపీ అభ్యర్థికి వచ్చిన మెజార్టీనే ఆ విషయం చెబుతోందంటూ లాజిక్‌ లాగుతున్నారు. తాము గెలవాల్సిన సీటు కృష్ణుడి వల్ల వచ్చిన నెగెటివిటీతో కొద్ది తేడాతో ఓడిపోయామని లోకల్‌ వైసీపీ లీడర్స్‌ ప్రచారం చేస్తుండటం కారణంగా ఆయన కూడా పార్టీలో కంఫర్ట్‌గా ఉండలేకపోతున్నారట. అందుకే పార్టీ కార్యక్రమాలకు కూడా దూరందా ఉంటున్నట్టు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ నాలుగు సీట్లు గెల్చుకుంటే… అందులో తుని కూడా ఉంది. మరోవైపు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న దాడిశెట్టి రాజా కూడా కృష్ణుడి ని లైట్ తీసుకుంటున్నారట.

ఆయన సంగతేంటని ఎవరైనా అనుచరులు ప్రస్తావించినా… మొదటి నుంచి నాతో ఉన్న క్యాడర్‌కు ప్రయారిటీ ఇవ్వాలా? లేక కృష్ణుడిని పక్కన పెట్టుకుని తిరగాలా అంటూ రివర్స్‌ ప్రశ్నిస్తున్నట్టు తెలపిసింది. ఆ మాటలను బట్టే కృష్ణుడి పొజిషన్‌ ఏంటో అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు. అటు కృష్ణుడి అనుచరులు మాత్రం… పార్టీ మారి అనవసరంగా తొందరపడ్డామా? కష్టమో నిష్టూరమో టీడీపీలో అలాగే కొనసాగి ఉంటే ఇప్పుడు కనీసం ఏదో ఒక నామినేటెడ్‌ పదవి అయినా వచ్చి ఉండేది కదా అని అంటున్నట్టు తెలుస్తోంది. తిరిగి వచ్చేస్తామంటూ కృష్ణుడి అనుచరులు ఒకరిద్దరు నియోజకవర్గ టీడీపీ నాయకుల దగ్గర ప్రస్తావిస్తే… వదిలించుకోవడానికే చాలా టైం పట్టింది… మళ్ళీ ఎలా తగిలించుకుంటామంటూ నిర్మొహమాటంగా అంటున్నట్టు తెలుస్తోంది. అయినా సోదరుడిగా రామకృష్ణుడు, పార్టీగా టీడీపీ కృష్ణుడికి చాలా అవకాశాలు ఇచ్చినా ఆయన సక్రమంగా ఉపయోగించుకోలేక పోయారని అంటున్నారట. గత ఎన్నికల్లో అన్న కూతురు పోటీ చేస్తే వ్యతిరేకంగా ప్రచారం చేసిన నాయకుడి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని కరాకండిగా చెప్పేస్తున్నట్టు సమచారం. మొత్తానికి తుని పాలిటిక్స్‌ రెండు ప్రధాన పార్టీలు అమ్మో కృష్ణుడా అంటున్నాయి. ఫ్యాన్ కింద ఉన్నా… ఉక్కపోత భరించలేకపోతున్న నాయకుడు ఫైనల్‌గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Exit mobile version