Off The Record: తెలంగాణ బీజేపీ అంతర్గతంగా భగభగ మండుతోందా?
- తెలంగాణ బీజేపీ అంతర్గతంగా భగభగ మండుతోందా?..
- సంస్థాగత ప్రధాన కార్యదర్శి మీద గరం గరంగా నాయకులు..
- మేం బానిసలమని అనుకుంటున్నారా అంటూ జిల్లా అధ్యక్షుల ఆవేదన..
- ఏదో ఒక రోజు మొత్తం బ్లాస్ట్ అవుతుందన్న అభిప్రాయం..
- అంతా తన కనుసైగలతో నడవాలని తివారీ అనుకుంటున్నారా?..
- ఇటీవల మీటింగ్‌లో జిల్లా అధ్యక్షుల్ని పొట్టు పొట్టు తిట్టిన తివారీ..
- పనిచేస్తూ కూడా మాటలు పడటం ఎందుకని జిల్లా అధ్యక్షుల ఆవేదన..
- ఆయన తిరగరు, మమ్మల్ని తిడతారా అంటూ ఆగ్రహం..
- తివారీ మీద కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలకు కూడా కోపం?..
- కలిసేందుకు వచ్చినా టైం ఇవ్వరంటూ కోపం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: బీజేపీ అంటే…. కేరాఫ్ డిసిప్లిన్ అంటారు. నాయకుల మాటలు, చేతలు కూడా అలాగే కనిపిస్తుంటాయి. కానీ…. తెలంగాణలో మాత్రం వాతావరణం కాస్త తేడాగా మారుతోందట. మీరు చెప్పేవన్నీ బయట ఎక్కడైనా కావచ్చేమోగానీ…. ఇక్కడ మాత్రం అలా కాదు, వెదర్ అలాలేదని పార్టీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి. దాన్ని క్రమశిక్షణారాహిత్యం అని కూడా చెప్పడానికి వీల్లేదు….., ఓవర్ చేస్తే రియాక్షన్స్ అలాగే ఉంటాయన్న మాటలు పార్టీ నాయకుల నుంచే వినిపిస్తున్నాయి. అంతర్గతంగా ఇప్పుడు తెలంగాణ బీజేపీలో ఇదే రచ్చ జరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. పార్టీ మీటింగ్‌లో తమను తిట్టినందుకు సంస్థాగత ప్రధాన కార్యదర్శి మీద జిల్లాల అధ్యక్షులు గరంగా ఉన్నారట. మేమేమన్నా చిన్న పిల్లలమా? ఏం చేయాలో మాకు తెలియదా? లేక మేం ఆయనకు బానిసలమని భావిస్తున్నారా అంటూ వివిధ జిల్లాల అధ్యక్షులు సన్నిహితుల దగ్గర తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే కొద్ది మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా చంద్రశేఖర్ తివారీ వైఖరితో విసుగెత్తిపోయి ఉన్నారని, ఏదో ఒక రోజు అంతా బద్దలవుతుందన్న అభిప్రాయం బలంగా ఉంది పార్టీలో. ఈ పరిస్థితుల్లో తెలంగాణ కమలంలో అంతా పైకి కనిపిస్తున్నంత పచ్చగా ఏమీ లేదని, లోలోపల లొల్లి బాగానే నడుస్తోందని అంటున్నారు.
ప్రస్తుతానికి సర్దుబాటు చేసేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంతగా ప్రయత్నిస్తున్నా… కట్టలు తెగే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నారు. పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి తివారీ మీద రోజు రోజుకి నేతల్లో అసంతృప్తి పెరిగిపోతోందట. అంతా తన కను సైగలతోనే నడవాలని అనుకోవడం రాష్ట్ర నాయకులకు అస్సలు నచ్చడం లేదట. ఇటీవల జిల్లా అధ్యక్షులు, ఇన్చార్జ్‌ల సమావేశం జరిగింది. అందులో సంస్థాగత ప్రధాన కార్యదర్శి జిల్లా అధ్యక్షులపై ఒక రేంజ్‌లో ఫైర్ అయ్యారని, అందర్నీ పట్టుకుని పొట్టు పొట్టు తిట్టేశారని చెప్పుకున్నారు. దాదాపు ఉతికి ఆరేసినంత పని చేయడంతో… ఆ మీటింగ్‌లో కామ్‌గా ఉన్న నాయకులు బయటికి వచ్చాక బాగా ఫీలయ్యారట. ఆయనేంది…? అలా మాట్లాడడం ఏందంట ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. మనం జిల్లా అధ్యక్షులమా? లేక ఆయనకు బానిసలమా అంటీ వాళ్లలో వాళ్ళు మాట్లాడుకున్నట్టు తెలిసింది. పార్టీ కోసం ఫుల్ టైం ఇచ్చి పని చేస్తున్నాం… లెక్కకు మించి కార్యక్రమాలు ఇచ్చినా నిర్వహిస్తున్నాం. పైగా మాటలు పడుతున్నాం ఇదేం పద్ధతి అంటు కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన తిరగరు, నేతలతో మాట్లాడారు, పైగా… మా పై చిర్రుబుర్రులాడతారా…? అసలు పార్టీని నడిపే పద్ధతి ఇదేనా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది.
Also Read
మరోవైపు కొందరు ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా సంస్థాగత ప్రధాన కార్యదర్శి వ్యవహార శైలి పట్ల కోపంగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. కలిసేందుకు వచ్చినా టైమ్ ఇవ్వరు, ఏదైనా చెప్పినా పట్టించుకోరు, పైగా రివర్స్ ఆ తిట్లేంటి అంటున్నారట. రాష్ర్ట కార్యవర్గ సభ్యులు, అధికార ప్రతినిధుల నియామకంలో కూడా ఆయన హవానే నడిచిందని అంటున్నారు. కొందరు ఎంపీ, ఎమ్మెల్యేలు ఇచ్చిన పేర్లను పక్కన పెట్టారట. ఇలా… రకరకాల కారణాలతో చంద్రశేఖర్ తివారి వైఖరి మీద తెలంగాణ బీజేపీ నాయకుల్లో అసంతృప్తి, ఆగ్రహం పెల్లుబుకుతున్నట్టు తెలుస్తోంది. ఆయన తీరు ఇలానే ఉంటే మాత్రం బ్లాస్ట్ అవక తప్పదన్నది వాళ్ళ అభిప్రాయం. ఈ అంతర్గత పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయో చూడాలి.
తాజావార్తలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!