Off The Record: సీఎం రేవంత్ తన విజన్‌ను అధికారులతో క్లారిటీగా చెప్తున్నారు. దానికి అనుగుణంగా పని చేయండి అని సూచిస్తున్నారు. గడిచిన రెండేళ్లుగా అన్ని శాఖల సెక్రటరీలతో సమావేశాలు ఏర్పాటు చేస్తూనే ఉన్నారు. మీరు మారండి…గ్రౌండ్‌కి వెళ్ళండి అంటూ ఆదేశాలు ఇస్తూనే ఉన్నారు. ప్రతీ నెలా రిపోర్ట్ చూస్తాం అని మొత్తుకుంటున్నారు. కానీ అధికారులు మాత్రం వాళ్లు ఏం చేయాలనుకుంటున్నారో అదే చేస్తున్నట్టు కనిపిస్తోంది. క్షేత్రస్థాయికి వెళ్తే…భయంతోనో…తనిఖీలకు వస్తారనో జాగ్రత్తగా విధులు నిర్వహించే అవకాశం ఉంది. లేదంటే అమలు అవుతున్న పథకాల్లో మార్పులు…సవరణలు తీసుకువచ్చే వెసులుబాటు ఉంటుంది అనేది సీఎం రేవంత్ ఉద్దేశం అయ్యి ఉండొచ్చు. కానీ సెక్రటరీ స్థాయి అధికారులు…Zpస్కూల్ స్థాయి విద్యార్థులకు ప్రిన్సిపాల్ పదేపదే చెప్పినా పిల్లలు రిపీట్ చేసినట్టుగా ఉంది అధికారుల వ్యవహారం.
Read Also: Bangladesh Crisis: బంగ్లాదేశ్ రాజధానిలో పేలుడు, ఒకరి మృతి..
ఐతే…మారాలి…మారాలి అంటారు..నచ్చకపోతే మార్చొచ్చుగా అనే చర్చ కూడా ప్రస్తుతం నడుస్తోంది. పనిచేయని అధికారులపై తరచూ సీరియస్ అవుతున్నా…వాళ్ళు మారడం లేదా..? సీఎం చెప్తూనే ఉన్నారు కదా…అని లైట్ తీసుకుంటున్నారో కానీ..యాక్షన్ మాత్రం తీసుకోవడంలేదు అనే ఫీలింగ్ కూడా కనిపిస్తోంది. అధికారుల పనితీరులో మార్పురావడంలేనప్పుడు నిర్దాక్షిణ్యంగా బాధ్యతల నుండి తప్పించొచ్చు కదా?ఎన్నాళ్లు ఈ హెచ్చరికలు అనే వాళ్లు కూడా లేకపోలేదు. జిల్లా కలెక్టర్లు కూడా చాలా మంది గ్రౌండ్‌కు వెళ్ళటమే లేదు. ఒకరిద్దరు తప్పితే..మిగిలిన వాళ్ళు అంతా సైలెంట్‌గా ఆఫీసులకే పరిమితం అవుతున్నారట. జిల్లాల పరిధి తగ్గింది…ఒక్క రోజులో జిల్లా అంతా తిరగొచ్చు. కానీ అధికారుల్లో ఎందుకు నిర్లిప్తత అనే టాక్ కూడా ఉంది. సీఎం రేవంత్ కూడా టైమ్ ఇద్దాం అనుకుంటున్నారో.. లేదంటే చెప్పిచెప్పి దారిలోకి రాకుంటే చేసి చూద్దాం అనుకుంటున్నారో కానీ…కార్యదర్శుల మీటింగ్ అయ్యింది అంటే…సీఎం రేవంత్ నుండి సేమ్ డైలాగ్స్ వస్తాయని అంచనా వేసుకునే పరిస్థితి.
